అయితే మొదట మీ భాగస్వామికి వెనుక ఎంతుందో లెక్కలు కాకుండా (అతను లేదా ఆమె) blood samples తీసుకోండి..
"వివాహము" అనగానే నెల ముందునుంచే అమ్మాయి, అబ్బాయి ఇళ్ళల్లో పండగ వాతావరణం మొదలవుతుంది కదా.. పెండ్లి పత్రికల దగ్గరనుంచి పెండ్లి అయ్యాక భోజనాల వరకు ఎక్కడా తక్కువ కాకుండా, ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి ముఖ్యంగా దంపతుల ఇరువురి గుణ, గణాలు, జాతక పొంతనలు చూసి మరీ ఇద్దరినీ ఒక్కటి చేసి పంపించేస్తారు.. ఇక్కడ వరకు బాగానే వుంది..
వీటికన్నిటి కన్నా ముందు అనగా అమ్మాయి, అబ్బాయికి, అబ్బాయి అమ్మాయికి నచ్చిన మరుక్షణం మీరు మొదట అడిగేది వారి ఇరువురి జాతకాలు. నిజమే కదా... కాని నిజానికి వీటికన్నా ముందు ఇద్దరివి అడగాల్సినవి ముఖ్యంగా ఈ రోజుల్లో "blood samples" ... ఏంటి అవాక్కయ్యారా ?? అయితే ఒక సంఘటనను మీరు చదవాల్సిందే....
ఇది చదువుతున్న ప్రతీ ఒక్కరు దయచేసి మీ పరిసర ప్రాంతాలలో ఉన్నవారికి, ముఖ్యంగా నూతనంగా ఒక్కటి కాబోతున్న వధూవరులకు తెలియపరచండి... వాళ్ళేదో అనుకుంటారని, బాగోదు అని మీరు వేసే ప్రతీ వెనకడుగు వల్ల ఒక వంశమే తుడిచిపెట్టుకు పోతుంది.. అంతే కాదు దాని పర్యవసానం చాలా ఘోరంగా, భయానకంగా కూడా వుంటుంది.. దాని మూల్యం భారీ మొత్తం లో కూడా వుంటుంది...
ఇక విషయంలోకి వెలితే ....
ఒక శ్రీమంతుల దంపతులకు ఒక్కగానొక్క అబ్బాయి... మంచి చదువు, మంచి వ్యాపారం మంచి మనసున్నవాడు, గుణవంతుడు ... అంతే కాదు అందగాడు కూడా ఈ అబ్బాయికి ఎందులోనూ తీసిపోకుండా సరి సమాన స్థాయిలో ఆ అమ్మాయి కూడా వాళ్ళు శ్రిమంతులే, ఒక్కగానొక్క అమ్మాయి... యెంతో గారాభంతో పెరిగింది...ఇద్దరికీ ముడి పెట్టేయ్యాలని ఇరువురి పెద్దలు ఒక నిర్ణయానికి వచ్చారు... ఇక అంతే ఇద్దరి ఇళ్ళల్లో నెల రోజులనుంచి పండుగ వాతావరణం నెలకొంది...
బంధువుల రాకపోకలు, స్నేహితుల అల్లర్లు, మరదళ్ల సరసాలు, పెద్దల ప్రేమానురాగాలు, పసిహృదయాల కేరింతలు, పచ్చని తోరణాలు, పూల సువాసనలు, కమ్మని విందులు, తప్పెట్లు, తాళాలు, అబ్బబ్బ ఒక్కటేమిటి ఇంద్రలోకమే భువిపైకి దిగినంతలా నభూతో న భవిష్యతి అన్నట్లుగా ప్రతీ రోజు ఎవరి పనుల్లో వారు చేసుకుంటూ వచ్చేస్తున్నారు...
పెళ్ళికి వారం రోజుల ముందునుంచి ఈ కోలాహలాలు ఇంకాస్త ఎక్కువైపోయాయి.. నలుగులని, స్నానాలు అని, వ్రతాలని, ఆధ్యాత్మికత కూడా ఈ సంతోష సాగరంలో కలిసి అందు పారవశ్యంలో మునిగి తేలుతున్న వారికి, దూరంనుంచి చూచే లోకులకు అమితోత్సాహముతో కనులకు కనువిందు చేయగా కన్నులకు కనుల పండుగగా, మంగళ వాయిధ్యముల రాగ, సరాగాల మేళవింపులతో హృదయానందకరమై పసిపిల్లల దగ్గరనుంచి వృద్దుల వరకు సంతోషాలతో అలలారుతూ నూతన వధూవరులను పెండ్లి పీటలపై కూర్చుండ బెట్టి వందలాదిమంది బంధు, మిత్రు, సపరివార సమేత, సోదర, సోదరీల మధ్య అంగ రంగ వైభవంగా వివాహము జరిగినది...
వివాహము అయిన ఆరు మాసముల తరువాత ఆడతనం అమ్మతనం అవ్వడానికి, హాస్పిటల్ కి వెలితే పరీక్షించిన డాక్టర్ ఇద్దరికీ H.I.V. Positive అని చెప్పగానే ఆ తల్లి ప్రాణమున్న జీవచ్చవం అయిపోయింది ... విషయాల్లోకి వెలితే పెళ్లి కాకముందు ఆ అబ్బాయి ఒక సెలూన్ లో షేవ్ చేయించుకుంటుంటే కొంచం తెగిందని అప్పుడే వేరేవాళ్ళకు చేసిన షేవర్ తో ఇతనికి చెయ్యడం మూలంగా అతని వైరస్ ఇతనికి సంక్రమించినట్లు దర్యాప్తులో తేలింది..
ఇక్కడ తప్పు ఎవరిది ??
- ఒకరికి వాడిన షేవర్ ని ఇతనికి వాడిన ఆ సెలూన్ యాజమాన్యందా ?
- ఆ సెలూన్ లో షేవ్ చేయించుకున్న ఈ అబ్బాయిదా ?
- తన బిడ్డకు H.I.V. Positive వుందని తెలుసుకొని తల్లి, తండ్రులదా ?
- ఈ అబ్బాయిని పెళ్ళాడిన ఆ అమ్మయిదా ??
- ఇప్పుడు జన్మను ఇవ్వబోతున్న ఆ బిడ్డదా ?
తప్పు ఎవ్వరిదీ కాదు కాని ఇక్కడ మూడు జీవితాలు కాలగర్భంలో కలిసిపోయాయి ... పచ్చని సంసారం రావణ కాష్ట అయిపోయింది... ముక్కు పచ్చలారని పసి హృదయం పరమాత్మను చేరింది...
తల్లిదండ్రులారా మీరు మీ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అన్నీ ఒకటికి రెండుసార్లు చూసి ఆలోచించి ఆచరిస్తారు వాటితో పాటు ఇలాంటివి కూడా కొంచం గ్రహించమని చిన్న మనవి...
మొదట ఒకరికి, ఒకరు నచ్చగానే అడగాల్సింది జాతకాలు కాదు
“blood samples”...
ఇకనైనా ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహిస్తారని ఆసిస్తూ...
నోట్ - పైన నేను చెప్పిన కథ కేవలం కల్పితము మాత్రమే .... కాని మన నోటీసుకు రాని ఎన్నోనిజమైన ఇలాంటి కథలు పరువుకోసం కాలగర్భంలో కలిసిపోతున్నాయి.. బయటకి రావట్లేదు.. దయచేసి ఈ విషయాన్ని నిర్లక్ష్యం వహించకుండా ఈ చిన్న ఆలోచననను ఆచరిస్తారని కోరుకుంటున్నాను... సెలవు..
స్వస్తి.. ___/\___
Bobby Nani
No comments:
Post a Comment