Monday, August 30, 2021

అతడంటే ఓ ధైర్యం మరి..!!


 

నన్ను చూసినప్పుడు అతనికి పాతికేళ్ళు లోపు అనుకుంటా

ఏం సాధించాడనో ఆ ఆనందం మునుపెన్నడూ లేనివిధంగా

అతనికి ఇంకేమి అక్కర్లేదు ఈ లోకంలో ఒక్క నేను తప్పా

తడబడుతూ అడుగులేసినప్పుడు చూడాలి

అతని కళ్ళలో ఆ క్షణం మెరిసిన ఆ మెరుపును  

పరిగెత్తుకొచ్చి గాల్లో ఎగరేసి తన గుండెలపై నడిపించుకునే వాడు

నాకింకా గుర్తే ఓ ఆరేళ్ళ వయసప్పుడనుకుంటా

తెలియక విసిరిన రాయికి – తగిలిన గాయానికి

మౌనంగా నిల్చొని మాటలు పడ్డాడు..

అతడంటే ఓ ధైర్యం మరి..!!

 

అందరం సంతోషంగా బయటకు వెళ్ళినప్పుడు

అతడు మాత్రం ముబావంగా ఉంటాడు

అందరూ అనుకుంటారు తీసుకెళ్ళడం ఇష్టంలేదనేమోనని

నిజానికి నేనూ తండ్రి అయ్యాకనే తెలిసొచ్చింది ..!!

తండ్రి అంటే ఓ రక్షణ ..

ఓ కాపుదల

దానికోసం తన చిన్న చిన్న

సరదాలను, సంతోషాలను గప్చిప్గా పక్కన పెట్టేస్తాడు

కంటికి కనురెప్పలా తండ్రి తన కాపుదలలో నిమగ్నమైనప్పుడు

ఇక సరదాగా మనతో ఎలా గడుపుతాడు

అయినా అతని ప్రేమ ఎప్పుడూ పడుకున్నాక

గాయాలకు మందు రాయడంలోనే తెలుస్తుంటుంది

జుట్టు నిమురి తలపై ముద్దు పెట్టుకున్నప్పుడే అనిపిస్తుంటుంది

అమ్మ ప్రేమ కనపడుతుంది

నాన్న ప్రేమ చూడాలంటే నాన్నవై నప్పుడే తెలుస్తుంది..!!


Written by: Bobby Aniboyina

Mobile : 9032977985

Monday, August 2, 2021

నేను రాసిన పాట “నన్ను విడువా మాకే సిన్ని”...


 

నేను రాసిన పాట “నన్ను విడువా మాకే సిన్ని” లక్షమందికి పైగా చేరువై మరింత వేగంగా ముందుకు వెళ్తోంది.. చాలా చాలా ఆనందంగా వుంది.. ఇంత తక్కువ సమయంలో లక్ష మందికి చేరువవ్వడం it's not an easy… నిజంగా మీ ఆదరాభిమానాలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. __/\__

ముందుగా ఈ పాటకు ప్రాణం పోసి రూపం కలిగించిన నా ఆత్మీయ సోదరులు “గుండేటి సాయి కృష్ణ, వారి సతీమణి శ్రీమతి సంధ్యా” గార్లకు నమస్సుమాంజలి...

తదుపరి వ్యక్తి ఫోక్ సింగర్ భైరగోని చంద్రం గారు తన గొంతుకతో మాయ చేసారు అలానే ముఖ కవళికలతో ఆశ్చర్య పరిచే విధంగా పాటలో ఇమిడారు..

తరువాత ఈ పాటకు జీవాన్ని ప్రసాధించిన సంగీత రూపకర్త జి ఎల్ నాందేవ్ గారు..

అలాగే ఎడిటింగ్ చేసిన రమేష్ సిద్దం గారికి, డైరెక్షన్ కోరియోగ్రఫీ చేసిన రాజేష్ మలయాళ గారికి తన అందంతో సమ్మోహన పరిచిన జినీత గారికి ఇందులో పని చేసిన ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఈ వేదిక ద్వారా మరెన్నో అవకాశాలు మీనుంచి రావాలని కోరుకుంటూ.. రాబోయే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ, చేసే పనికి రాసే అక్షరానికి నూటికి నూరుపాళ్ళు ప్రాణం పెట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని మాట ఇస్తున్నాను.. మీ ఇంటి బిడ్డగా నన్ను ఇంతలా ఆశీర్వదించినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదములు..

Song Link: https://www.youtube.com/watch?v=i3BtJz0V-0w