భారతదేశం ఎంతో గొప్పది కదా....
అవును చాలా గొప్పది ఎందుకంటె నేను భారతీయుడను కాబట్టి.....
మన దేశం జనాభా 2016 సంవత్సరానికి 1.33 బిలియన్లు అయింది .... ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశాలలో రెండవది. వైశాల్యము లో ప్రపంచంలో ఏడవది. భారత ఆర్ధిక వ్యవస్థ యొక్క స్థూల జాతీయోత్పత్తి( పర్చేసింగ్ పవర్ పారిటీ) ప్రకారం నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచంలో అతివేగంగా వృద్ధి చెందుతున్న వ్యవస్థలలో ఇది ఒకటి. ప్రపంచం లోనే అతి పెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యము ఐన భారతదేశం, ప్రపంచంలోనే అతి పెద్ద సైనిక సామర్థ్యం కలిగి ఉన్న దేశాలలో ఒకటిగా, అణ్వస్త్ర సామర్థ్యం కలిగన దేశంగా ఒక ముఖ్యమైన ప్రాంతీయ శక్తిగా ఆవిర్భవించినది. భారత దేశానికి మొత్తం నాలుగు పేర్లు ఉన్నట్లు చెప్పుకోవచ్చు. వీటిలో మొదటిది జంబూ ద్వీపం., ఆ తరువాత వచ్చిన పేరు "భారతదేశం" లేదా "భరతవర్షం", తరువాతి పేరు హిందూదేశం, తరువాత హిందూదేశం యొక్క రూపాంతరం ఐన ఇండియాఅనే పేరు అని మనకు తెలిసినవే .... గడచిన 5000 సంవత్సరాలలో మనదేశం ఏ దేశం పైనా దండెత్తలేదు. అంతటి సహనంతో కూడిన దేశం... ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపించే అతి గొప్ప దేశం మనది... అంతే కాదండోయ్ ఇక్కడ దోచుకునే వారికి దోచుకున్నంత కూడా... ఇక్కడ ప్రజలకు చిన్న ఆశ చూపిస్తే చాలు వెంటనే పార్టి మార్చేస్తారు .... ఇది తప్పు అనేవాడిని నయనో, భయానో ఒప్పించేస్తారు అంత గొప్పది మనదేశం... ముక్కుపచ్చ లారని పసికందులను చెత్త కుప్పల్లో చూడాల్సిన దుస్థితి మనది ... అందుకే మనదేశం చాలా గొప్పది...
మహిళలు గొప్పవారని పురాణాల్లో వినడమే కాని ఇక్కడ వారు ఒంటరిగా కనిపిస్తే కామంతో కన్ను, మిన్ను కనపడని మగ కుక్కలు ఎక్కువగా వున్న అతి గొప్ప దేశం మనది... ఒక ఆడపిల్లమీద అత్యాచారం చేస్తే అది నిజమా కాదా అని విచారణ జరపడానికి సగం జీవితం అయిపోయే దాకా తిప్పెంతటి గొప్ప రాజ్యాంగ దేశం మనదేశం.... ఒక పరాయి దేశంనుంచి వచ్చి మన బిడ్డలను, మనవాళ్ళను మన కళ్ళముందే చంపేస్తుంటే వాల్లనుపట్టుకొని కూడా బిరియాని తినిపించే అతి గోప్ప దేశం మనది.... ఏ దేశంకు వెళ్ళినా మనవాళ్ళకు కుక్కల్ని కాల్చినట్లు కాల్చి చంపేస్తుంటే చూస్తూ ఊరుకొనే ప్రజాస్వామ్య దేశం మనది...
ఇవన్నీ ఎంతకాలమని సహిస్తాం?
ఎంతకాలమని భరిస్తాం ?
మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని మీరు అనుకుంటున్నారా ?
ఎంతకాలమని వెన్ను చూపించి పరుగులు తీస్తాం....
మనదేశంలో నే మనకు రక్షణ లేకపోతే పక్కదేశంలో ఎలావుంటుంది..?
మన రాజ్యాంగాన్ని అప్పటి పరిస్థితులను అనుసరించి రాశారు ఇప్పుడు అలాంటి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి... పరిస్తితులతోపాటు సవరణలు కూడా చెయ్యడం మంచిదని నా అభిప్రాయం...చేస్తున్నారు కాని అవి సరిపోదు.. ఇంకా ఖటినతరం చెయ్యాలి...
నేను రాజ్యాంగాన్ని ప్రశ్నించే వయస్సు కాని, అర్హత కాని, నాకు ఏమాత్రము లేదు ... కాని దయచేసి ఒక్కసారి ఆలోచించండి అని మాత్రమే చెప్పగలను .... నాయకులారా మీరు మాకు ఏదీ ఉచితంగా ఇవ్వకండి... అలా మీరు ఇచ్చి, ఇచ్చి మేము ఇలా తీసుకొని, తీసుకొని మా గుంటలు మేమే తవ్వుకుంటూ ఉన్నాము.... మీరు అలా మాకు ఆశ చూపించి యెంత వెనకేసుకుంటున్నారో గత 67 ఏళ్ళగా చూస్తున్నాం... వద్దు ఇకనైనా ఆపండి దయచేసి... మీ భవిష్యత్తు, మా భవిష్యత్తు, మన దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది ... దాన్ని మీరెలాగో మార్చలేరు కనీసం ప్రయత్నం చెయ్యండి... తోలి అడుగు మీరు వేస్తే తరువాత రాబోయే తరాలవారిలో ఒక్కరైనా మారి తదుపరి అడుగులు వారు వెయ్యడానికి అవకాశం వుంటుంది.... మీరే కాదు మాలో కూడా కొందరు మారరు ... వాళ్ళు ఇలా.... వాళ్ళను అమ్ముకొని ఓటు వేసేంతవరకూ, మతం పిచ్చితో ఓట్లు వేసేంతవరకూ, ప్రాంతం పిచ్చితో ఓట్లు వేసేంతవరకూ, మేము బాగుపడము ..
మా జీవితాలు బాగుపడవు..
శ్రీ గురజాడ అప్పారావు గారు అన్నారు
“దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్”
ఎంతో గొప్ప పలుకులు కాని ఇప్పుడు పరిస్థితి
“దేశం అంటే మనుషులు కూడా కాదోయ్ దేశం అంటే ధనమోయ్”
అన్నట్లు వుంది....
అందరం అంటూ ఉంటాము మనం అతిగొప్ప దేశంలో బతుకుతున్నాము అని.... కాదు అలా అనుకుంటున్నాం అంతే... మన తాతలు చెప్పుకున్నారు మనదేశం అభివృద్ధి చెందుతుంది అని, మన తండ్రి గార్లు చెప్పుకున్నారు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం, తరువాత మన మనుమళ్ళు కూడా చెప్పుకుంటూనే వుంటారు ..
ఇలా చెప్పుకుంటూనే పోవడమేనా ఎప్పుడండీ మనదేశం (నాదేశం) ఎంతో అభివృద్ధి చెందిన దేశం అని మనం ఆకాశానికి గర్వంగా చూస్తూ చెప్పుకునేది ??
ఈ ప్రభుత్వం ఎప్పుడైతే మార్పు తెస్తుందో అప్పుడే మనము మన దేశం, క్రమమైన దారిలో నడుస్తాము... మార్పు అంటే తప్పు ఎవ్వరు చేసినా తప్పించుకోకూడదు వెంటనే శిక్షలు అమలు పరచాలి...
పూర్వపు రోజుల్లో చాణక్యుడు వేసిన శిక్షలు ఇక్కడ అమలుపరచాలి... అలాంటి మార్పు రావాలి... ఆ మార్పు కోసం నేను ఎదురు చూస్తునట్లు గానే నాలా ఎంతో మంది వున్నారని నాకు తెలుసు. వాళ్ళలో మీరు వున్నారా ?? మిమ్మల్నే వాళ్ళలో మీరు వున్నారా ??
స్వస్తి ___/\____
Bobby Nani

No comments:
Post a Comment