ప్రకృతికి ఈ ప్రపంచం మీద కోపం వస్తుంది...
రౌధ్రంగా మారిపోతోంది ...
అభివృద్ది పేరిట జరిగే ఈ అశుద్ధ కాలుష్యాలపై ...
సంద్రం తిరగుబాటు చేస్తుంది..
విసిగి వేసారిన ఈ మనుష్యులమీద ...!
మన మానవాళికి ఇవాళిదేం కొత్త కాదుగా...
ఒకరినొకరం ముద్దుగా పేర్లు పెట్టి మరీ పిలుచుకుంటాం...
పలకరించి పోయాక ఒంటిగా కూర్చొని శవాలు లెక్కపెట్టుకుంటాం...
మనవాళ్ళు పోతే మాత్రం ... ప్రకృతి మీద పడి దేబిరిస్తుంటాం...
అశోకుడు చెట్లు నాటించెను అని చదివుకుని మరీ ...
మీసాలకి సంపెంగ నూనె రాసుకున్న ఘనులమే కదా అందరం...
మనిషి అడవులు నాశనం చేస్తే అది పురోభివృద్ది క్రమమా...
పురిటి నొప్పులు తాళలేక ప్రకృతి ఒళ్ళు విరిస్తే అది మాత్రం విధ్వంసమా...
ఇదెక్కడి న్యాయం రా అయ్యా... !!!!
నువ్వు విసర్జించిన ప్లాస్టిక్ సంచులు....
భారీ పరిశ్రమలు నుండి వదిలిన వ్యర్ద పదార్దాలు..
నీ మహా నగరపు మురుగు మలినపుల నీరు
నీకు వడ్డీతో సహా తిరిగి ఇవ్వడానికే అక్కడక్కడా అకాల ప్రకృతీ విధ్వంశములు ..
కొండలు, కోనలు, పుట్టలు, గుట్టలు పగలగొట్టి మరీ నీ నగరాన్ని విస్తరించావుగా...
ఇళ్ళల్లో తగరపు పూలని పెట్టుకుని మురిసావుగా...
ఇంటి అందాల్ని చూపడం కోసం ఇంటి ముందున్న చెట్టును తుంచేసావుగా ...
మరి సిద్దం అయిపో భారీమూల్యానికి ...
ఇప్పటికైనా మించినది ఏదీ లేదు.. మన చేతుల్లోనే వుంది..
మనల్ని మనమే ఇలా నష్టపెట్టుకుంటూ,
ఎన్నాళ్ళిలా, ఎన్నేల్లిలా ఈ ఆస్ధి నష్టం, ప్రాణ నష్టం లేక్కలేస్తూ
చితికిన చితిమంటలలో భోగ భాగ్యాలను వెతుక్కునేది...
దీనికి అసలు కారణాలు ఏమిటో మనకు తెలియదా...!!! తెలుసు..
నీ ప్రాణానికి, నీ కుటుంబ ప్రాణానికి వచ్చిన ముప్పు ఏంలేదుగా ...
దాచుకున్నావుగా పదిలంగా బహుళ అంతస్ధుల మేడలలో ...
మరి పల్లెకారులు, గిరిపుత్రులు, అడవిబిడ్డల, మాటేమిటి..
పునరావాసం రక్షణ శిబిరాల పేరుతో పూటకో ఊరు, రోజుకో వేషం ...
వెన్నెల కాంతికి సైతం భగ్గున కాలి బూడిదయ్యే పేదింటి గుడిసెలు...
నీ ఇంట్లో వెలిగే విద్యుత్ దీపపు కాంతులకు బలవ్వాల్సిందేనా...
మారని బతుకులు వారివి .. మారినా ఉపయోగపడని రాతలు మనవి...
ఇంత చదువు, ఇంత జ్ఞానం, ఇంత పరిజ్ఞానం వ్యర్ధమే కదా...
సంద్రం మీద వర్షం వలె...
పర్యావరణాన్ని సంరక్షించుకుందాం...
సాటి మనిషిని గౌరవించుకుందాం ...
మన ముందు తరాల్ని బ్రతకనిద్దాం...
మన ప్రతీ ఆనందానికి గుర్తుగా ఒక చెట్టు నాటుదాం..
సాధ్యమైనంత వరకు సంరక్షించుకుందాం ...
నేను ఇలా చెయ్యాలని సంకల్పించాను...
మరి మీ మాటేంటి ?? మీ సమాధానం నాకు వద్దు .. మీ ఆచరణ మాత్రమే కావాలి..
నోట్ : దయచేసి కాపీ, గట్రా చెయ్యకండి.. మానవ నైతిక విలువలకు ప్రాధాన్యత ఇవ్వండి.. వారి భావాలకు, మనోభావాలకు గౌరవం కల్పించండి....
స్వస్తి.. __/\__
Bobby Nani

No comments:
Post a Comment