కొంతమంది పరిచయాలు బలే గమ్మత్తుగా మొదలవుతాయి ..అలానే గప్చిప్ గా దూరం కూడా అవుతాయి కూడా .. ప్రతీ పరిచయానికి కారణం అవసరం లేదు. కాని ప్రతీ పరిచయం దూరం అవ్వడానికి మాత్రం కారణం తప్పక వుండాలి .. తుమ్మెదలు పుష్పం మీద తియ్యనైన తేనెకోసం వచ్చి వాలినట్లు వాలుతారు.. కాని ఆ పుష్పానికి తెలియదు ఆ అందమైన తుమ్మెద వచ్చింది తేనే కోసమని.. అలానే ఈ తుమ్మెదకు తెలియదు ... సంధ్యాస్తమ సమయానికి ఆ పుష్పం వాడిపోయి నిర్జీవం అవుతుందని.. కాని అవి కలుసుకున్న ఆ కొన్ని మధుర క్షణాలు అద్బుత క్షణాలుగా మారిపోతాయి.. అలానే మనకూ నిన్నటి గురించి అనవసరం, రేపటి గురించి అనవసరం ఈ రోజు ఉన్నవాళ్ళే మన అద్బుతాలు రేపు వారు మనతో ఉంటారని ఆశించకుండా ఈ కొన్ని క్షణాలు వారి ఆత్మీయానందాన్ని అందుకోవడమే ఉత్తమం..ఇదే నేటి లోకం పోకడ.. అందరికీ కొత్తదనం కావాలి.. కొత్తదనం అంటే శారీరక మార్పులు మార్చుకోవడం అనుకున్నాం కాని మానసిక జ్ఞాపకాలను మరవడం అని అనుకోలేదు.. కొత్త అంటే పాతవాటిని మరవడం కాదు పాత, కొత్త అందరినీ కలుపుకుపోవడం ...
స్వస్తి __/\__
Bobby Nani
స్వస్తి __/\__
Bobby Nani
No comments:
Post a Comment