Thursday, July 21, 2016

అతడో కాంత దాసుడు..



ప్రతీ ఒక్కరు తల్లి గురించే మాట్లాడుతారు.. ఆమె గొప్పది అందులో సందేహం లేదు.. కాని తండ్రి కూడా అందుకు తక్కువ కాదనే నా ఈ చిరు సత్కార కవిత ..
ఇంట్లో తండ్రి స్థానం చాలా గొప్పది .. ఎందుకంటె ఆయనకు ఎన్నో సమస్యలు, మరెన్నో భాద్యతలు, ప్రతీ క్షణం భయపడుతూనే బ్రతుకుతాడు... కాని పైకి మహా ధైర్య శాలిలా ... ఇంటికి తండ్రి ఒక రక్షణ వలయం లా మారుతాడు.. అందరికీ ఏమో కాని తన కూతురుకు మాత్రం ఆయన మొదటి ప్రేమికుడే.. ఎప్పటికీ..

ఇలాంటి తండ్రికి నా ఈ చిరు కవితను అందిస్తున్నాను..

అతడో కాంత దాసుడు..
పేరుకే కాంత దాసుడు..
నిరంతర సంసార సాగర శ్రమజీవుడు...
నితాన్వేషణ విధి నిర్వహనుడు...
వేకువనే లేచి .. వున్నా, లేకున్నా
యేవో బట్టలు వేసుకొని ..
తిన్నా, తినకున్నా,
ఎండనకా, వాననకా,
పగలు, రేయి తారతమ్య భేదాలు మరిచి
సంసారమనే బీడు కయ్యను ..
గాడేద్దు వలె దుక్కి దున్నుతున్నాడు..
కంటిలోని జలాన్ని ఆవిరి చేస్తూ ..
కంటిముందర సంసారమనే భూమిని
చిరునవ్వుతో .. లాగుతున్నాడు పచ్చని
పంట చెయ్యాలనే తపనలతో..
కమిలిన చేతులతో,
తన పాదాన్ని అంటిన కనికరం లేని గాయాలతో.. !!
ఎందుకోసం ఈ త్రాస.. ఎవరోకోసం ఈ ప్రయాస..
అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు తెలిసింది..
మసిపట్టి మసకబారిన తన మోము ఒకటి వుందని..
గతించిన ఏళ్ళను వెనక్కి తిరిగి ఒక్కసారి చూసుకుంటే ..
అంతా చీకటిపట్టిన మసే కనిపించింది..
దుమ్ము, ధూళితో నిండిన తన జీవితాన్ని దులిపేదెవరు ??
మొరటివాడు, మొండి వాడు, క్రోధుడు ఇవే తన బిరుదులు ..
అతడో అద్బుతం, అతడో అజరామరం,
అతడే ఓ అనంత శక్తిస్వరూపుడు మగసిరి గల్గిన మగాడు...

__/\__


Bobby Nani

4 comments: