అసలు మన పరిభాషలో “కృష్ణ” అనే శబ్దం ఎలా వచ్చినదో దాని నిర్వచనం ఏంటో చూద్దాం..
కృష్ణ : క + ఋ +ష +న +అ : క కారఋకారషకార సకార అకార విసర్గములు చేరి “కృష్ణ” శబ్ధమైనది. క కారమునకు బ్రహ్మయు, ఋ కారమునకు అనంతుడను, ష కారమునకు శివుడును, న కారమునకు ధర్ముడను, అ కారమునకు శ్వేతదీపవాసి అగు విష్ణువును, విసర్గమునకు నారాయణ ఋషియు అని అర్ధములగును. సర్వ మూర్తి స్వరూపుడును, సర్వాధారుడను, సర్వకారణుడు అయిన ఈ స్వామి దివ్య తెజస్వరూపుడగుచే కృష్ణుడు అని పిలవబడుచున్నాడు...
శ్రీ కృష్ణుడు అవతరించగా....
గోకులములోని అన్నీ భూములలో అక్కడక్కడ ...
చందనము, మందారము, నాగము,
పున్నాగము, చంపకము, అశోకము,
పనస రసాలము మొదలైన నానా జాతి
వృక్షములు, కుసుమ ఫల సంపదలతో,....
దివ్యమైన పరిమళములు దిక్కులయందు వ్యాపించగా....,
స్రవించుచున్న తేనెల గ్రోలి చరించు
తుమ్మెదలు ఝంకారము సొంపుగా చేయుచుండగా ....
ఫలముల అమిత బరువుతో కొమ్మలు కిందకు వంగగా ...
భక్తిచేత భూమిని ఆనుకొని ... !
భగవంతుడైన వసుదేవునికి ...
సాష్టాంగ లక్షణమైన ప్రణామము చేయుచున్నట్లుగా ఉండెను ఆ సమయంలో..
అంతే కాకుండా అక్కడక్కడా మాధవి,
జాజి, మల్లిక మొదలైన పూదీవెలు... ఎల్లప్పుడూ ....
మందమారుతముచే జారువట్టి పుష్పముల సమూహముగలవై ఉంటూ ....
అవతరించిన శ్రీ భగవంతుడైన
నారాయణుని యెడల అవి పరమ ప్రేమగల,
భక్తితో కూడిన పుష్పాంజలి సమర్పించునట్లుగా ....
కనులకు కనువిందులు చేస్తున్నాయి ...
ఆ సమయమున నాకు.. నిజంగా శ్రీ కృష్ణ నామ స్మరణలో ఏదో తియ్యని, తెలియని మత్తు వుంది.. అందుకే ఆయనను మహా మహులు సైతం వర్ణించలేరు.. వర్ణనకు అతీతుడు ఈ నల్లని గోపాల కిట్టయ్య....
ఈ రోజు ఏంటో కృష్ణా, కృష్ణా అంటూ మదిలో ఓ మృదంగామృతం గిలిగింతలు పెట్టుచున్నది...
స్వస్తి.. ___/\___
Bobby Nani

No comments:
Post a Comment