యెంత అబ్బురపరిచే టెక్నాలజీ వచ్చినా మనిషి.. మనిషికే పుడతాడు..
పసితనం, యవ్వనం. వృద్దాప్యం ఆగవు ... మరణం, జననం ఆగవు...
మేఘాలనుంచే వర్షపు చినుకులు రాలుతాయి..
తొలకరి జల్లులతో తడిచి పులకరించిన నేల ...
సుఘంధ, సువాసనల మేళవింపు తో వచ్చే పరిమళం .. వర్ణింపసఖ్యం కా జాలదు...
అనుభవాలు, జ్ఞాపకాలు, ఆటలు, పాటలు, అన్నీ మనసున్న మనిషికే సాధ్యం..
యంత్రాలను కనిపెట్టిన మనం ... వాటితోనే సహజీవనం సాగిస్తున్నాం...
మనుషుల మనసులకు, ప్రకృతి అందాలకు, దూరంగా వచ్చేస్తున్నాం..
హృదయంతో చూసే రోజుల్లోనుంచి కళ్ళతో చూసినా కనపడని రోజుల్లోకి వెళ్తున్నాం...
పక్షుల కిలకిలా రావాలు... ఎక్కడ ?
సెలయేటి జలపాతాలు... ఎక్కడ ?
నాట్యమయూరి నెమలమ్మ ... ఎక్కడ ?
కళ్ళు పట్టనంత సౌందర్యం.... ఎక్కడ ?
మనపై పడు ఉదయపు ఉషోద కిరణాలు ... ఎక్కడ ?
మనకంటికి కనపడని పడమటి దిక్కు సూర్యభగవానుడు సంధ్యాకాంత రాగరంజితం.... ఎక్కడ ?
మానవత్వం... ఎక్కడ ?
అమ్మమ్మ, తాతయ్యల ప్రేమానురాగాలు... ఎక్కడ ?
ఇవన్నీ ఇలా ఎన్నెన్నో కాలక్రమేనా కనుమరుగు అయిపోతున్నాయి.. కాలగర్భం లో కలిసిపోతున్నాయి... మన ముందు తరాలు వాళ్ళు చూసినవి, చేసినవి మనం చూడలేదు.. మనం చూసినవి మన తరువాత రాబోవు తరాల వారు చుస్తారన్న నమ్మకం లేదు...
ఇది అభివృద్దా .... లేక .... పతనమా .... ఒకప్పుడు అన్ని సమపాళ్ళలో ఉండేవి ఇప్పుడు అన్ని హెచ్చుపాళ్ళలో వున్నాయి.. కారణం మనకు అన్ని అతి శీఘ్రముగా జరిగిపోవాలి దేవుని దగ్గరకు కూడా ముందు మనమే వెళ్లిపోవాలి అని కోరుకునే అతి సాధారణ విషయం అనిపించే నీచమైన మనస్తత్వం మనది... ఒప్పుకోవాలి మనం ఇవన్నీ... ఇలా ఎన్నో... ఎన్నెన్నో..
కళలు కూడా ఖరీదై పోయిన రోజులివి.. మెప్పుకోసం, గొప్ప కోసం డబ్బులు తగలేసే వింత మనుషులం మనం... పెండ్లి అంటే వెళ్లి మొహం చూపించి వచ్చే మనస్తత్వం నిజానికి పెండ్లి అంటే రెండు వేరేవేరే హృదయాలు ఒక్కటయ్యే వేళ.. ఎందరు ఇలా ఆలోచిస్తున్నారు ?? స్వార్ధపు ముసుగులో మనిషి మొహానికి రంగులు పులుముకొని ఇలా పైకి ఆప్యాయతలు, అనురాగాలు అంటూ వేల్లజూపుతూ జీవితపు నాటక రంగంలో తనదైన శైలిలో తను అనుకున్న ప్రతీ పాత్రలోకి పరకాయ ప్రేవేశము గావిస్తూ, నవ్విస్తూ, ఏడిపిస్తూ, భాదిస్తూ, అగ్ని కోసం వెళ్ళే పురుగువలె సమస్యల వలయంలోకి మనమే చిక్కుకుంటూ ఉన్నాము...
ముఖ్యంగా కొందరు యువత ... యువత దేశానికి పట్టుకొమ్మలు అనే విషయం ఏమో కాని కేవలం కొందరు స్త్రీ, పురుషులు ఇద్దరు గురించి చెప్తున్నాను...
చాటింగ్ లోనే సంసారాలను చేస్తున్నారు ... ఇదేనా మన అభివృద్ధి.. ఒక యంత్రాన్ని ఒక సత్కార్యం కొరకు కనిపెడితే దాని ద్వారా 100 దుర్వినియోగపు పనులను మనమే సృష్టిస్తున్నాం.. కాదంటారా??
సమాధానం మీ దగ్గరే కాదు నా దగ్గర కూడా లేదు... మనిషి ఆలోచనా తరంగాలు వాయువుకన్నా వేగంగా వెళ్తున్నాయి ఈ దశలో కనీస నైతిక విలువలను మరుస్తున్నాడనడంలో ఎలాంటి సంశయము, సందేహము లేదు... ఏదో సాధించాలన్న తపన ...తపన వుండాలి అది మనల్ని మింగేసేలా వుండకూడదు అనేది నా అభిప్రాయం... స్థలానికి, పొలానికి హద్దులు ఉన్నట్లే మనిషికి కూడా కొన్ని హద్దులు, నియమాలు ఏర్పాటుచేసుకోవాలి...
ఇలా చెప్పుకుంటూ పోతే వస్తూనే వుంటాయి మన చరిత్ర అంత పెద్దది కదా మరి...
చివరగా ఒక్క మాట ... యెంత ఎత్తు ఎదిగిన తలపైకేత్తే అనంత విశ్వాన్ని చూడాలి...
పైకెత్తి ఉమ్మితే ఏమౌతుంది,, ??
స్వస్తి __/\__
Bobby Nani

No comments:
Post a Comment