Wednesday, December 30, 2020

పద్మముఖి ...



పాలకడలి ప్రభవించు
పార్ధేవి వోలె..!
ఉదయగగనమున విహరించు
ఉషోదయము వోలె..!
అరుణ కమలమును
కరమున దాల్చు అలివేణి వోలె..!
వీణ వాయించినా,
విల్లు సంధించినా,
పూమాల అల్లినా,
కరవాలము చేబూనినా,
తనకు తానె సాటి
లేనే లేదిక పోటీ..!!

మనసుపడిన
స్త్రీ గాఢ పరిష్వంగంలో
ప్రాపంచిక బాధల్నిసైతం
గప్చిప్గా మర్చిపోవచ్చు
స్త్రీ
అంతరంగం
మబ్బుపట్టిన ఆకాశం..!
కాస్త ప్రేమ చూపిస్తే
జలజలామని కరిగి
వర్షిస్తుంది
వినీలాకాశంలా
దర్శనమిస్తుంది..!!

కన్నులు
విట్టార్పి చూడాలే కానీ
రసరమ్యమైన స్త్రీ
ఆడతనంలో అణువణువున
ఉప్పొంగే భావాలే..!
అందుకే
తాను విచ్చుకుంటుంది
వెచ్చని బాహువుల మధ్యన బంధూక పుష్పమై..!
తాను నర్తిస్తుంది
హృదయవేదిక పై అనురాగ స్రవంతియై..!
తాను వర్షిస్తుంది
మనసైన మగని గుండెపై విలాసవతియై..!!

ఒక
విపంచి
పలికించలేని వేవేల
భావాలను, భావోద్వేగాలను సైతం
అలవోకగా, అత్యంత మధురంగా
స్త్రీ స్పృశించగలదు..!!

తన పాదాలు
ప్రభాత వేళలో ఒక్కొక్కటిగా రాలే
పారిజాతకుసుమాలు..!
దోర గోరింట అంటిన
మధుర పాదాగ్రమములు..!
పీటపై నుంచి
కాలు జాపి
ఒకింత ముందుకు వాలి
పారాణి పరవశంతో
ఎర్రపడిన పాదాలకంటిన
వెండి వెలుగుల అందియలను
మధురముగ తొలగించే ఆ
కరములు తప్పించి
నా పెదవుల సాయంతో
ఆమూలాగ్రము మీటాలనుంది..!!

మత్తెక్కించే
ఆ మల్లెపూల మెడను
నాలిక కొనలతో ఆరాధిస్తూ,
పెదవితుమ్మెద వాలని
ఆమె నవనీత నడుముకు
ముద్దుల వడ్డాణం తొడగాలనుంది..!!
మనసెరిగి నడుచుకునే
మగని సాంగత్యంలో
స్త్రీ భావోద్వేగాలు
ప్రాతఃకాలమున
శ్వేతమధుకములా
పురివిప్పుతాయి..!!

ఆమెలో
ఆమెకే తెలియని
అలౌకికభావాలు ఎన్నో
ఆమె అణువణువున
అంగాంగమ్మున
అమరి ఉంటాయి
ఒక కుసుమం
ఎన్ని పరిణామాలుగా
వికసించగలదో
ఒక స్త్రీ పరిపరివిధాలుగా
తనలో తాను మార్పు చెందగలదు..!!

స్త్రీ
కన్నులు మాట్లాడే
కలువ భాషకు
తియ్యని కౌగిలింతలే
సమాధానాలు..!!

తనకు తానుగా
కోరికతో,
ఉద్రేకముతో,
నీ దేహంపై నర్తించినప్పుడే
నిజమైన సౌఖ్యం
అంతే కాని
బలవంతపు,
బలాత్కారపు
సంయోగం కాకూడదు..!!

సాత్వికమైన స్త్రీ
తన మానసమును
కుసుమముగా చేసి
మనసైన మగని పాదాలను
మనసారా పూజిస్తుంది..!!

ఇదే స్త్రీ లక్షణం
విలక్షణం..!!

Written by: Bobby Aniboyina

Saturday, December 26, 2020

పైకి శ్రీరంగ నీతులు ....


 ఒక చిత్రాన్ని, అందులోని అక్షరాలను చూసి వారి స్థాయిని అంచనా వేస్తున్నారు అంటే మీరు ఎలాంటి మానసికస్థితిలో వున్నారో అర్ధం అవుతుంది.. అవగాహన రాహిత్యం నేడు మనిషికి మనిషికీ మధ్య దూరాన్ని పెంచుతుంది..!!

ఒక స్త్రీ ఈ ఫోటో పెట్టి భార్యాభర్తలు గురించి కొన్ని అక్షరాలు రాస్తే .. ఆమెను దారుణంగా చూస్తూ, మాటలతో శవ పరీక్ష చేస్తారా ఆమెను మీరు.. ఇదేనా మీ సంస్కారం .. ఇదేనా మీకు తెలిసిన జ్ఞానం..!

పైకి శ్రీరంగ నీతులు చెప్తూ,
గుడిఎనక నా సామి లా వుండేవాళ్ళు మన మధ్యనే ఎందరో..
తాత్వికతను భోదిస్తూనే లోలోన శృంగార కార్యకలాపాలు గావిస్తూ .. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంటారు వీరు..
సమాజంలో వీరు అత్యంత ప్రమాదకారులు కూడా.. !!

విశృంఖలత్వాన్ని, విచ్చలవిడితనాన్ని ఇక్కడ నేను ప్రోత్సహించట్లేదు..!!

అయినా ఎవడికి తెలియదు ఈరోజుల్లో శృంగారం అంటే.. పదిహేనేళ్ళ కుర్రాడు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడి ఫోన్ చేతిలో పట్టుకున్నాడు అంటే .. నీకు తెలుసా.. వాడేం చూస్తున్నాడో అందులో..
ఎవరికి చెప్తావ్ నువ్వు.. ఇది తప్పు, ఇది ఒప్పు అని.. నువ్వు చెప్తే వింటారా .. ఫోన్ పగలకొట్టి రెండుదెబ్బలేస్తే ఊరుకుంటారా .. ఇంకో మార్గాన్ని అన్వేషిస్తారు .. ఇదే నేటి యువత ఆలోచనాధోరని ..!!

నువ్వు దాపెట్టే కొద్ది వారిలో కుతూహలం తారాస్థాయిలో ఎక్కువ అవుతూనే వుంటుంది.. అలా అని విచ్చలవిడిగా ఉండమని కాదు.. విజ్ఞానపరంగా వారికి ఆరోగ్యవంతమైన అవగాహన అందివ్వాలి.. !
సరే ఇక విషయంలోకి వెళ్దాం..!
ఆలుమగలు అంటే రెండు శరీరాలే కాదు..
రెండు మనసులు కూడా
పూర్తిగా ఒకరికొకరు చదివిన పుస్తకం లా తెలుసుకొని వుండాలి..!!
రెండు శరీరాలు ఏకమై
రెండు మనసులతో ఒకే పుస్తకమై
తొమ్మిది రసాలను సిరాగా చేసి
ఏక కలంతో రాసుకునే రంగులమయ జీవితం వారిది..!!
భార్య అనే ఆలయానికి
అలసి పయనించే యాత్రికుడు భర్త..
సజ్జనుడికి స్వర్గధామం భార్య...
సృష్టికర్త వ్రాసిన బంగారు చిత్రపటం భార్య,
భర్తే పరికించ గలడు..
దేవుడిచ్చిన మణిమాల భార్య,
భర్తే ధరించగలడు ..
స్వర్ణలిఖితం భార్య,
భర్తే పఠించగలడు ..

యజమాని, బానిస సంబంధాలే భార్యాభర్తలను జడుఁల్ని చేస్తున్నాయి..అందుకే రసస్పందన కోసం ఒకరికొకరు తడుముళ్ళాడవలసి వస్తోంది.. ముందు ఈ వైఖరిని విడిచి పెట్టాలి.. మీ ఇద్దరిలో ఎవరూ ఎవరికీ బానిసా కాదు యజమానీ కాదు..ఉభయులూ ఒకరికొకరు క్షణం ఎడబాటు కూడా సహించలేని స్నేహితులు కావాలి. స్నేహమే మధురమైన సంబంధం.. స్నేహమే ఒకరిలో ఒకరిని లీనం చేసే సాధనం..

సహృదయులే, స్నేహశీలత్వం, నిత్య సంతోషం, దయ, అనురాగం ప్రదర్శించగలిగిన మగవాణ్ణి స్త్రీ ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే వుంటుంది.. అతని కౌగిట్లో వెన్నలా కరిగిపోతుంది.. అతని స్పర్శతో పులకరిస్తుంది.. సౌందర్యజిజ్ఞాసువులైన భార్యాభర్తల గాఢపరిష్వంగములో మరే ఆర్తనాదాలు వినపడవు.. కిలకిల ధ్వనులు తప్ప..
ప్రతీ పురుషుడూ స్త్రీ కోసమే సృష్టించబడ్డాడు.. అలానే ప్రతీ స్త్రీ పురుషుని కోసమే సృష్టించబడింది .. యవ్వనం వారి కలయిక కోసమే నిర్దేశించబడింది.. ఈ సత్యం తెలియని వాడు దుఃఖ భాగుడు, అసంతృప్తజీవుడు .. తను అనుభవించలేని, ఆఘ్రాణించలేని పుష్పాన్ని భగవదార్పితం చేసినట్లు కొందరు భార్యాభర్తలు వారి యవ్వనాన్ని వ్యర్ధం చేస్తున్నారు.. అందుకు గల కారణం అహం అనే చీడ పురుగు వారిని మోహించి ఉండటమే..

నవ జీవనం, నవ భావం, నవ దర్శనం మానవుల పవిత్ర శృంగార రసనిష్పన్నతలోంచే పుట్టుకొస్తాయి.. జీవితం పూల పాన్పు కాదు.. దుఃఖభూయిష్టమైనది.. ఎన్నో బాధలు, శ్రమలూ పడనిదే రోజు గడవదు నేడు.. అయినా ప్రతీరోజు ప్రతీ పురుషుడూ తన భార్యలో కొత్తదనాన్ని చూడనేర్వాలి.. అలానే ప్రతీ స్త్రీ తన భర్త నుంచి కొత్త అనుభూతిని గ్రహించాలి. ఆ స్త్రీ పురుషులిద్దరూ ఏకమైన ప్రతీ దఫా వారి మనసిక నిషేదాలు తొలగిపోవాలి.. ప్రశాంతమూ, ప్రగాఢమూ, అయిన కొత్త వ్యక్తిత్వం పొటమరించాలి..

ఆదర్శ దాంపత్యానికి సంబంధించిన విజ్ఞానాన్ని, నిర్భయంగా యువతరం చర్చించి, సరియైన వైఖరి అవలంబించేలా చేయడం సంఘసేవకులకు, వైద్యులకు బాధ్యత కలిగివుండాలి..

ఆలింగన, చుంబన, నఖక్షత, దంతక్షతాది బాహ్యరత విధానాలు, అంతరరతి విధానాలు చదువుకున్నంత మాత్రాన ఎవడూ రతిలో సమర్ధుడు కాలేడు ..
ఈత ఎలా ఈదాలో చదివినంత మాత్రాన ఈదగలడా ?? ఈతను నేర్చుకోవాలి.
ఈతను నేర్చుకోవాలంటే చెరువూ, గురువూ రెండూ వుండాలి. అలాగేరతి విషయంలో కూడా, భయబ్రాంతులైన భార్యాభర్తలు సఖ్యత మీద అనుభవం, అనుభవం మీద ఆస్వాదన కలుగుతాయి.. పెళ్ళికి ముందే కొందరు త్వరపడిపోవడం వల్ల నిజమైన ఆనందాన్ని, ఆస్వాదనను అందుకోలేక పెళ్లి అయిన తరువాత సహచారితో సఖ్యత లేక విడాకుల దాకా పోయిన కేసుల్ని, విడాకులు తీసుకున్న కేసుల్ని నేను నా ఆఫీనులోనే ఎన్నో చూస్తున్నాను..

సారభూతమైన జీవస్పందనను గ్రహించగల శక్తి గల వాళ్ళు,
స్పందించే స్వభావంగల వాళ్ళు దాంపత్యజీవితకైవల్యాన్ని చేరుకోగలరు..
భూమ్యాకాశాలను రెండిటినీ ఏకం చేయగల అపూర్వానుభూతి దాంపత్య మాధుర్యాన్ని సమగ్రంగా చదివి చవిచూచినవారికే కలుగుతుంది. స్పర్శద్వారా అస్పృశ్యమైన ఆధ్యాత్మిక ఆనందాన్ని గ్రహించి స్త్రీల శారీరక, మానసిక, ఆధ్యాత్మిక అవసరాలను సంతృప్తిపరచగలిగిన వాడు దైవాన్ని సైతం మెప్పించగలడు ఇది సత్యం.. ఇదే సత్యం..

భార్యాభర్తల మధ్య కుళ్ళు జోకులు, సెటైర్లు , వెధవ పోస్టులు పెట్టే వారికి, మనోభావాలను పంచుకునే స్త్రీ, పురుషుల పై వక్ర దృష్టి కనపరిచే వరాహ సౌందర్యులకు, మూత్ర చోరులకు ఈ నా వివరణ ఓ చెంపపెట్టు కావాలి..మన ఇంట్లో కూడా స్త్రీ లు ఉన్నారన్న విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తిస్తారని ఆశిస్తూ స్వస్తి..__/\__

Written by: Bobby Aniboyina

Monday, December 21, 2020

చిన్న విషయమే.. కాని దాని మూల్యం ఓ నిండు ప్రాణం..!!


 చిన్న విషయమే..

కాని దాని మూల్యం ఓ నిండు ప్రాణం..!!
చాలా చిన్న విషయం అనుకునే ఎంతో పెద్ద పెద్ద విషయాలు మన ముందు చాలానే ఉన్నాయి.. కానీ వాటిని మనం లెక్కే చెయ్యం.. అలాంటి వాటిల్లో ఒకటి ఇప్పుడు మనం చర్చించబోయే విషయం..!!
మనం చేసే అనేక తప్పిదాల వల్ల ఈ భూమికే కాకుండా, మనతో జీవించే సమస్త జీవరాశికి కూడా ఆటంకం కలుగుతూ ఉంది.. మానవుడు చేసే ప్రతీ పనిలో ఏదో ఒక రకంగా నలిగేది, నలుగుతున్నది మనతో జీవిస్తున్న ప్రాణులే..!
విషయంలోకి వెళ్తే..
ప్రతీరోజు ఓ చెత్తకుప్పకు దగ్గరగా కొన్ని కుక్కలు ఉమ్మడిగా జీవిస్తూ, ఆ చెత్తకుప్పలోని ఆహార పదార్ధాలను ఆరగిస్తూ జీవనం సాగిస్తూ ఉండేవి.. ఆ ప్రదేశానికి అవి రుణపడినట్లు భావిస్తూ ఎంతో విశ్వాసంగా ఉంటూ ఉండేవి.. తెల్లవాదులూ తిరుగుతూ కొత్తవాళ్ళను రానివ్వకుండా ఆ ప్రదేశానికి రక్షకుల్లా కాపలా కాస్తూ ఉండేవి.. అలా ఉండగా ఆ ప్రదేశానికి ఓ కుటుంబం తాత్కాలిక నివాసం కొరకు వచ్చారు..
వారి ఇంటికి చేరువలోనే ఉన్నటువంటి ఆ చెత్త కుప్పలోకి ఈ ఇంటివాసులు రకరకాల తినుబండారాలను, వారి పిల్లలు సగం సగం తిని పారేసిన ఆహారపదార్ధాలను ప్లాస్టిక్ కవర్ లొ కట్టి అందులోకి విసిరే వారు.. అలా ఉండగా ఓ రోజు .. ఎంతో ఆకలిమీద వున్న ఓ కుక్క ఆతురతతో ఓ కవర్ని పెరికేసి తినడం మొదలెట్టింది.. కొన్ని క్షణాల్లోనే తన గుంతుకేదో అడ్డుపడి నోటినుంచి అధిక రక్తస్రావంతో, గట్టిగా దగ్గలేక దగ్గుతూనే రెండు పగలు, ఒక రాత్రి నరకయాతన అనుభవించి చనిపోయింది..
అలా ప్రతీ పది రోజులకు ఓ కుక్క చనిపోతూ వస్తుండేది.. ఆ ప్రాంతం వారంతా చనిపోయిన ఆ క్షణం అయ్యో పాపం అనుకుంటూ మరుసటి క్షణం మర్చిపోయి ఎవరి పనుల్లో వారు ఉండిపోయేవారు.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఓ పాతిక కుక్కల దాకా చనిపోయాయి.. మున్సిపాలిటీ వారు ఈ ప్రాంతంలోని కుక్కలు చనిపోతున్నాయని ప్రభుత్వ పశువుల డాక్టర్ గారికి విన్నవించుకున్నారు.. ఆ డాక్టర్ గారు చనిపోయిన కుక్కను శవ పరీక్ష నిర్వహించిన పిదప చాలా ఆశ్చర్యానికి గురి అయ్యాడు ..
అందుకు గల కారణం .. షేవ్ చేసిన బ్లేడ్ లు కుక్క మెడ భాగంలో ఉండిపోయి పైకి చెప్పుకోలేక.. మింగ లేక, కక్కలేక ఆ కుక్క నరకయాతన అనుభవించి చనిపోయిందని ఆయన నిర్ధారించారు..
షేవ్ చేసిన బ్లేడ్ లను చిన్న గొయ్యి తీసి పాతిపెట్టడం ఐదు నిమిషాలు కూడా పట్టని చాలా చిన్న విషయం.. దాని వెనుక మూగ ప్రాణాలు ఇలా భరించరాని బాధతో చనిపోతున్నాయి.. ఆలోచించండి..
ఇప్పుడు కూడా ఇది చిన్న విషయమే అంటారా.. ??
మనలో చాలామంది షేవ్ చేసుకున్నాక బ్లేడ్స్ ని ప్లాస్టిక్ కవర్ లలో పెట్టి చెత్త కుప్పల్లో వేస్తున్నారు.. ఆ చెత్త కుప్పల్లో ఈ బ్లేడ్ లతో పాటు వ్యర్ధ ఆహార పదార్ధాలు కూడా ఉంటాయి.. ఆ ఆహార పదార్ధాలకు అలవాటు పడిన కొన్ని కుక్కలు అక్కడ తినేందుకు వచ్చి మృత్యువాత పడుతున్నాయి.. దయచేసి మీరు వాడిన బ్లేడ్ లను కాస్త శ్రమ అనుకోకుండా గుంత తీసి పూడ్చి పెట్టండి.. కాలానుగుణంగా అవి తుప్పుపట్టి మట్టిలో కలిసిపోతాయి.. ఏ ప్రాణికి హాని జరగదు..దయచేసి ఈ విషయాన్ని తేలికగా తీసుకోవద్దని మనవి చేస్తూ.. !
మీ వంతు బాధ్యతగా మూగ జీవాల ప్రాణానికి సంరక్షణకు బాధ్యతవహించండి.. !!

Written by: Bobby Aniboyina

Friday, December 18, 2020

హేమంతము ...


 హేమంతఋతువు అంటే అందరికీ గుర్తొచ్చేది ఎముకులు కొరికే చలి.. వెచ్చదనం కోసం ప్రతీ ప్రాణి తడిమి తడిమి ప్రాకులాడుతుంది.. మొన్ననే కార్తీక మాసము వెళ్ళి మార్గశిరము అడుగుపెట్టింది.. చలి తీవ్రత అధికంలో వుంటుంది... ఇలాంటి చల చల్లని వేళలో ప్రకృతిపై వెచ్చని కవిత రాయాలని ఓ చిలిపి కోరిక పుట్టింది నాలో.. ఇంకేముంది అనుకున్నదే తడువుగా ఇలా మీ ముందుకు వచ్చి వాలింది.. ప్రకృతి ప్రేమికులు అభిప్రాయాలు చెప్పాలి మరి...


హేమంతము
***********

అదో
హేమంతఋతువు
మార్గశిర మాసము
మంచుబిందువులు
పూవు పూవున మసలుకొని
ఆకు ఆకునా జారుతున్నవి..!!

అసుర సంధ్య వేళన
నేత వృక్షము కింద
చలితో చతురతలాడు సమయాన
రమణీయ పుష్ప సుగంధ వాయువులు
నా ముక్కు పుటాలనదరకొడుతూ వీస్తున్నవి..!!

మకరందమును గ్రోలు తుమ్మెదలు
మత్తెక్కి వెల్లికిల పడి వున్నవి
మావి చిగుళ్ళను చిదుము పికములు
కదలలేక వదలలేక బ్రేవుమనుచున్నవి
కనుల విందైన వెన్నెలలు
కాసేపట్లో కురియు సమయమది
చకోరములు ఒకే కొమ్మపై కూర్చుని
వెన్నెలను జుర్రి వెచ్చబరుచు కోరికయది
ఇదే హేమంతఋతు శోభితము..!!

హిమముచే కప్పబడిన
హేమంతఋతువున
ప్రకృతి వెలుగుకై వెదుకులాడెను
చల్లని వేళలో హేమంత క్రాంత
పాత చీర విడిచి కొత్త ఆమని పొందెను..!
మారాకులు వేసిన తమలపాకు తీవలు
వెన్ను వదిలిన చెఱుకు పైరు..!
మంచు కొండ మీద ఆడపడుచులు
ఆశ కొలది అలంకరించుకున్న భూషణములవలె
సొరపూలు, చంపసరాలు, గడ్డిపూలు..!!

ఒకపక్క
ఉత్తరపు దిక్కు
మలయమారుతం
చలితో వీస్తూ
మన్మథుని పంచ బాణములు
కామినీ, కాముకుల
లేత బుగ్గపై చిటిక వేసినట్లు,
కవ్వించి మనోల్లాసము గావించెను..!!

మరుపక్క
కోటివత్తుల దీపవృక్షము
కిరణ హారతులిచ్చె..!
కింశుక ప్రసవ వనిత
కొమ్మకొమ్మను సింగారించుకుని
ప్రియ వసంతునిపై
పూల వర్షము కురిపించె..!!

ససంధ్యమున
కొదమ లేగలకు
పాలుగుడపగ
చెంగుచెంగున పరుగెత్తు
నిండు పొదుగుల
చింబోతుల చిందులు..!
తొడిమ వీడని పూల
బిడియంపు బరువుతో
కన్నె పడుచులవలె..
గుప్పుమను గుబాళింపులు...!
హేమంతఋతు శోభితమ్ములివే..!!

Written by: Bobby Aniboyina