Thursday, July 28, 2016

చావుభయం ఒకటిపోతే దేవుడి బ్రతుకు గోవిందే కదా..



దేవుడున్నాడని నమ్మి నిజంగా..
మనం మానేసింది ఏమీ లేదు..
చేతనైనదంతా చేసుకొనే
చేతనామయులం మనం..
చేతకానిదంతా దేవునితో,
దేవదూతలతో చేయించుకొనే
స్థితప్రజ్ఞులం మనం..
మన ఆనందం కోసం దేవునికి
మాటలు నేర్పిన, మతం నేర్పిన
మహానుభావులం మనం..
చిదానందులం మనం ... !
సర్వ ధర్మాలను పరిత్యజించి
సర్వేశ్వరుణ్ణి శరణం అంటాం..
ఇహపర సుఖాలకోసం
ఎవరినైనా వేదిస్తుంటాం..
స్వార్ధానికి సానుకూలంగా ఉంటేనే
ఏ దేవుడి మాటైనా వింటాం..
చావుభయం ఒకటిపోతే
దేవుడి బ్రతుకు గోవిందే కదా..
అనంతం అంతమై పోతే
అందరి పనీ గొంవిందే..

Bobby Nani

No comments:

Post a Comment