Friday, January 13, 2017

SOCOTRA (The Mysterious Island) from Bobby... 4th Part


SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

నన్ను ఒంటరిగా కొన్ని గంటలు వదిలేయండి.. నేను దీన్ని కనుగొనే ప్రయత్నం చేస్తాను... అని ఆమె చెప్పగానే .. 
తప్పకుండా అమ్మా అంటూ అందరూ లేచి … బయటకి వెళ్లి కూర్చుంటారు…
కొన్ని గంటల సమయం అనంతరం లోపలనుంచి….

“ప్రసన్న కుమార్ భాటియా గారు” అంటూ ఆమె సన్నని స్వరం వినిపించగానే పరుగులుతీస్తూ అందరూ లోపలకు వెళ్తారు… 

ఏమ్మా అర్ధం తెలిసిందా ?? అని ఆతురతతతో ప్రసన్న కుమార్ భాటియా గారు అడుగగా .. 

ఇంతకీ ఆ మ్యాడం ఆ రహస్యాన్ని చేధించిందా ....??
ఇక ఆలస్యం ఎందుకు ?? తెలుసుకుందాం పదండి మరి....!!
4th Part

ఆమె చిన్నగా నవ్వుతూ తల అటూ ఇటూ ఊపుతుంది..
ఏముంది దాంట్లో అని ప్రసన్న కుమార్ భాటియా ప్రశ్నించగా ..
“Island of Socotra” అని రాసుంది అని చెప్తుంది…
ఇది ద్వీపమా ??
నిస్సందేహంగా ఇది ద్వీపమే నాన్నగారు అంటూ చిన్నోడు లోపలకు వెళ్లి మ్యాప్ తీసి చూపిస్తాడు..
“Socotra” ద్వీపసమూహం యెమెన్ అరేబియా సముద్ర తీరం వద్ద కొన్ని వందల కిలోమీటర్ల ఆవల వుంది అని చూపిస్తాడు.. 

అరె నీకు ఇవన్నీ ఎలా తెలుసు రా చిన్నోడా అని అడుగగా..
ఈ ద్వీపం గురించి ఎప్పుడో విన్నట్లు గుర్తు. అంతేకాదు ఇక్కడ ప్రత్యేకమైన డ్రాగన్ చెట్లు ఉండటమే విశేషం.. ఎక్కడా కనిపించని చిత్ర, విచిత్ర వృక్షజాలం, జంతుజాలం వుంటుంది.. మరే భూభాగం మీద ఉండనివి ఇక్కడ వున్నాయి.. చాలా భయంకరమైన ద్వీపాలలోను, ప్రమాదకర ద్వీపాలలోను, అత్యంత రహస్యకరమైన ద్వీపాలలోనూ ఇది కూడా ఒకటి అని సెలవిస్తాడు… చాలా మంచి విషయాన్ని వివరించావు రా చిన్నోడా అని అంటూ..
అమ్మా మీరు ఎలా కనుగొన్నారో వివరించగలరా.. అని అడుగుతాడు..
తప్పకుండా చెప్తాను సర్.. అంటూ ఇలా చెప్పనారంభిస్తుంది ..
ప్రసన్న కుమార్ భాటియా గారు ముందుగా మీ తాత గారికి హృదయపూర్వక ధన్యవాదములు చెప్పాలి.. ఆయన ఒక అసాధారణ వ్యక్తి… ఆయన మేధస్సు అమోఘం.. ఆ అదృశ్య సిరాతో రాసిన అక్షరాలతో మాత్రమే నేను ఇదంతా కనుగొనలేదు.. ఆయన మరోటి కూడా ఈ వీలునామాలో మనకోసం వదిలి వుండటం వల్ల నేను ఈ కోడింగ్ ని కనుక్కోగలిగాను ..
ఆ అదృశ్య సిరా తో రాసినది ఒక “తాళం” అనుకుందాం…
మరి తాళం తీయాలంటే “తాళంచెవి” వుండాలి కదా..
లేకుంటే ఆ తాళం తెరవబడదు కదా..
అమ్మా మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్ధం కాలేదు కొంచం వివరంగా చెప్పండి అని ప్రసన్న కుమార్ భాటియా గారు అడుగుతారు..
అదే చెప్తున్నాను సర్.. అంటూ మళ్ళి మొదలు పెడుతుంది..
మీ సందేహమే నిజమైంది సర్.. ఈ వీలునామా మొత్తం తెలుగులో రాసుంది కాని చివరన వున్న కొన్ని అక్షరాలు మాత్రం ఇంగ్లీష్ లో వున్నాయి కదా… 

అవును అమ్మా అయితే వాటిల్లో ఏముంది.. ? అని ప్రశ్నిస్తాడు ప్రసన్న కుమార్ భాటియా …
వాటిల్లోనే మొత్తం నిఘూడార్ధం దాగుంది అని చెప్తూ ఇలా రాసి చూపిస్తుంది..
“Any assets, movable or immovable, Silver, Gold and etc., from being mentioned in this will or which may hereafter be acquired by me shall be taken by my grandson and their legal heirs aforesaid in equal shares absolutely”  ఇదే కదా అందులో రాసుంది..
మొదట నేను ప్రతీ అక్షరాన్ని లెక్కవేస్తే 185 అక్షరాలు వచ్చాయి… దానితో ఎన్నోరకాలుగా ప్రయత్నించి చూశాను … కాని కుదరలేదు..
ఆ తరువాత చాలాసేపు ఆలోచించగా పదాలను లెక్కేసి చూద్దాం అని ఆలోచన వచ్చింది..
38 పదాలు వచ్చాయి.. దీన్ని కూడా పలురకాలుగా ప్రయత్నించాను..
చివరికి 38 ని ఇలా 3 - 8 = 5 ఇదే కీ గా కనిపెట్టగలిగాను ..
ఈ 5 అనే కీ ని ఆధారంగా చేసుకొని ఆ అదృశ్య సిరాను క్రిప్టోగ్రఫీ (గూఢ లిపి శాస్త్రం) ద్వారా ఈ క్రింద వివరించిన పద్దతిలో బహిర్గతం చెయ్యగలిగాను…

Hide Letters (వీలునామాలో వెనుకవున్న అదృశ్య సిరా) :
V L S D Q A P Y L P B P K M D



Formula : P for Plain Text,
P = (C-K) mod 26
Where C = Cipher text
K = Key


A to Z equal to 1 to 26 i.e., A1, B2, C3.,


P (V) = (22-5) mod 26
= 17 mod 26
= 9 = “I”


P (L) = (12-5) mod 26
= 7 mod 26
= 19 = “S”


P (S) = (19-5) mod 26
= 14 mod 26
= 12 = “L”


Final PLAIN TEXT is : “ISLAND OF SOCOTRA”
ఇలా మూడు లెటర్స్ చేసిన విధంగా చివరి లెటర్ అయిన “D” దాకా చెయ్యాలి. అలా చేస్తే “ISLAND OF SOCOTRA” అని వస్తుంది.. 

ఇలా మీ కోడింగ్ ని నేను మొత్తానికి ఎలాగోలా కనిపెట్టగలిగాను ప్రసన్న కుమార్ భాటియా గారు అని చెప్తుంది..
అమ్మా… మా తాత గారు కాదు అసాధారణ వ్యక్తి … మీరు..
ఆయన ఏం ఉద్దేశించి రాసాడో, ఎన్ని తిరకాసులు పెట్టాడో మీ మాటల్లో తెలిసింది.. అవన్నిటినీ మీరు కనుగొని, వున్నది వున్నట్లు మీరు దాన్ని మాకు చెప్పిన పద్దతి అమోఘం, అనిర్వచనీయము .. కృతజ్ఞతలు అమ్మా అని ప్రసన్న కుమార్ భాటియా గారు ఆమెను ప్రశంశలతో ముంచేత్తుతాడు …
సరే అండి ఇక నేను వుంటాను … అంటూ అందరికీ చెప్పి వెళ్ళిపోతుంది…

అలా ఆమె వెళ్ళిపోయిన కొన్ని గంటలు వాళ్ళందరిలో మౌనం ఆవరించింది..
కొంత సమయ మౌన నిరీక్షణ అనంతరం ప్రసన్న కుమార్ భాటియా గారు తన గొంతు సవరించుకుంటూ ఏంట్రా ఎవరో పోయినట్లు అలా మొహాలు పెట్టారు. తరువాత ఏం చెయ్యాలో ఎవరన్నా చెప్పండ్రా అనగానే..
రెండవ వాడు అయిన లోకేష్ లేచి నిలబడి నాన్న ముందు మీరు చెప్పండి అంత దూరం పోవాలంటారా ??
ఒకవేళ మనం వెళ్ళినా అక్కడ ఏముందని వెళ్ళాలి ? ఏమీ అర్ధం కావట్లేదు అనగానే...
పెద్దోడు మధ్యలో దూరి రేయ్ మొన్నటివరకు మనకేమన్నా దీనిగురించి తెలుసా ??
అసలు వీలునామా ఉందన్న విషయం కూడా తెలియదు..
కాని ఇప్పుడు మనకు ఒక దిశ, నిర్దేశం తెలిశాయి …
ముత్తాత గారు మనకేదో చెప్పాలని అనుకుంటూ వున్నారు అని నా అభిప్రాయం .. అదేంటో కనుక్కోవాల్సిన భాద్యత మనందరిది …
నాన్న గారు ఎలాగైనా, యెంత కష్టం అయినా సరే ఈ రహస్యాన్నిమనం చేధించాలి దయచేసి మీ నిర్ణయం తెలపండి అని పెద్దోడు అడుగుతాడు..
అవును నాన్న గారు అన్నయ్య చెప్పింది అక్షరాల నిజం అని చిన్నోడు వంతుపాడుతాడు…

సరే రా ఇక మీరు ఇంతలా చెప్తున్నారు కాబట్టి వెళ్లి అదేంటో కనుక్కుందాం..
మరి సాహసం చేద్దామా ??
అని ఒకరకమైన గర్వంతో పిలుపునిస్తాడు ప్రసన్నకుమార్ భాటియా ..
అందరికీ సమ్మతమే ...కాని రెండవ వాడు అయిన లోకేష్ కి మాత్రం ఈ ప్రయాణం అస్సలు ఇష్టం లేదు.. ఏదో మొహమాటానికి ఒప్పేసుకున్నాడు.. 

ఒకవారం రోజులలో మన ప్రయాణం మొదలు పెట్టాలి అందరూ సిద్దం అవ్వండి అని చెప్తాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

అందరూ ఉత్కంటతతో ఆ రోజు కోసం ఎదురుచూస్తూ వున్నారు… ఇంతలో ఆ రోజు రానే వచ్చింది..
ముంబై నగరము నుండి సముద్ర తీరాన వందల కిలోమీటర్ల లాంచీ ప్రయాణం చెయ్యాల్సి వుంది… ప్రతీ ఒక్కరు ఎవరి సామాన్లుతో కూడిన బ్యాగ్ లను వారు తగిలించుకొని అంబరాన్ని అంటిన ఆనందోత్సాహాలతో లాంచి ఎక్కి కూర్చున్నారు.. 


ఎన్నో ఆలోచనలు, మరెన్నో భయాలు, అక్కడ ఎలావుంటుందో, అసలు వుంటుందో లేదో అనే ఆలోచనల చట్రంలో ప్రసన్నకుమార్ భాటియా వున్నాడు.. మనిషి అయితే ఇక్కడ వున్నాడు కాని మనసంతా ముగ్గురు పిల్లల భవిష్యత్తు గురించే … వారికి ఈ సాహస ప్రయాణంలో ఏమన్నా ఆపద కలిగితే ఆ ఊహే చాలా భయాన్ని పురిగొల్పుతున్నదే అని మొహానికి అంటిన స్వేద బిందువులను తుడుచుకుంటూ .. మహా ధైర్య శాలిలా నీలిగి కూర్చుంటాడు .. 

చిన్నోడు అయిన సంతోష్ ఏంటి నాన్న భయంతో అప్పుడే చమటలు పడిపోతున్నాయి వయస్సు పెరిగింది నీకు ….. ఈ సాహస యాత్ర అవసరమా చెప్పు.. ఇంట్లో ఉండొచ్చు కదా మేము వెళ్లి వచ్చేవాళ్ళం కదా.. అని చమత్కారపు మాటలు అనగానే..

నిజమేరా నాకు వయస్సు పెరిగింది.. ఒప్పుకుంటాను కాని అక్కడకు వెళ్ళాక చెప్తా ఎవరికి చెమటలు పడతాయో అని తిరిగి చమత్కారపు బాణాన్ని వదులుతాడు ప్రసన్నకుమార్ భాటియా.. 

అలాంటి సరదా సన్నివేశాలతో వారి ప్రయాణం కొనసాగుతూ వుంది..

కాని రెండో వాడు అయిన లోకేష్ మాత్రం ఒంటరిగా అనుభూతి చెందుతూ తన మాటకు విలువలేదని భాదపడుతూ వున్నాడు.. 

రెండు రోజులు సాఫీగా వారి ప్రయాణం సాగింది.. మూడో రోజు తెల్లవారుజామున వున్నట్లు వుండి సముద్రం ఉగ్రరూపం దాల్చింది.. పెద్ద పెద్ద అలలతో వారి లాంచిని, అందులోని 82 మందిని కుదిపేసి అతలాకుతలం చేసేసింది.. భయంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గజ గజ వణకసాగారు.. కొన్ని గంటల తరువాత ప్రశాంతత నెలకొంది.. అందరూ ఆనందపడుతున్నారు.. 

కాని రెండోవాడు అయిన లోకేష్ మాత్రం నిశితంగా ఆ సముద్రాన్ని పరిశీలిస్తున్నాడు… అందుకు గల కారణం కెరటాలు ఒకదాని వెంట మరొకటి ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కదులుతాయి కాని ప్రస్తుతం అవి అలా లేవు.. చిందరవందరగా క్షణానికో వ్యత్యాసంతో మార్పు చెందుతున్నాయి.. 


ఇది ప్రళయం రాబోవుతుందనడానికి ఒక సంకేతంగా అతను భావిస్తాడు.. వెంటనే తన తండ్రి అయిన ప్రసన్నకుమార్ భాటియా కు ఈ విషయాన్ని చెప్తాడు.. 


అతను తన కుమారుడిని నమ్మినా ...ఈ విషయాన్ని అందరికీ చెప్తే వారు ఎలా తీసుకుంటారో అని మొదట భయపడి .. 

వారు ఎలా తీసుకున్నా పర్వాలేదు... కాని అందరికీ ఈ విషయాన్ని వెంటనే చెప్పి హెచ్చరించాలి అని నిర్ధారించుకొని ప్రతీ ఒక్కరికి నిదానంగా, సౌమ్యంగా వారికి అర్ధమయ్యేలా విషయాన్ని తెలియజేస్తాడు.. 

మరి ఇప్పుడు పరిష్కార మార్గం ఏంటి ?? అని ఒక వ్యక్తి అడుగుతాడు.. 

అదే ఇప్పుడు మనం అందరం ఆలోచించాలి ...అని అంటాడు ప్రసన్నకుమార్ భాటియా… 

ఇంతలోనే గాలి జోరు పెరిగింది.....

To be continued …


Written by : BOBBY

11 comments:

  1. Aa maths konchem aalochinchalsi vastundi.but story tension gane undi Ami avutundaa ani

    ReplyDelete
    Replies
    1. Thank u andi ...

      P for Plain Text ..ante Formula
      P = (C-K) ante
      "C" Cipher text
      "K" Key
      idi formula
      26 ante Alphabetical 26 kada adi daani ardham...
      This is the Letters
      "V L S D Q A P Y L P B P K M D"

      So
      1st Letter "V"

      V Yenno Letter 22 So mana Cipher Text 22
      and
      K for Key mana Key 5 I mean (3-8=5)
      so 22 lo nunchi 5 Less chesthe 17 Avuthundi
      and
      Total Alphabetical 26 lo nunchi manaku vachhina 17 less chesthe 9 and Mana answer "9"

      Alphabetical 26 lo Nine Letter yedi ?? "I"

      so Mana 1st Letter " I "

      ante mana “ISLAND OF SOCOTRA” lo 1st Letter Manam Kanukkunam alane Remaining Letters cheyyaali anni chesthe “ISLAND OF SOCOTRA” vasthundi idi formula of Cryptography...

      ee formula nerchukovadaanike naaku 8 months samayam Pattindi Mam..

      Delete
  2. Aa maths konchem aalochinchalsi vastundi.but story tension gane undi Ami avutundaa ani

    ReplyDelete
  3. కథలో బిగి బావుంది... narration ఇంకా improve కావాలి... ఇద్దరి మధ్య సంభాషణ ల్లో... gap ఇవ్వండి...that means reader has to distinguish... who is the speaker of that sentence... ☺👍👌👌

    ReplyDelete
    Replies
    1. Tappakundaa Bro.. Time Lenanduvalla ala raasesaanu next Week lo nunchi prayathnisthaanu.. Thank u soo much bro ..

      Delete
  4. అబ్బా...మళ్ళి తరువాయి బాగమ...నేను టెన్స్కన్ తట్టుకొలేక పోతున్నా...నాని గారు...అంతా ఒకే సారి ఫొస్ట్ చెయ్యి..మెమే కొద్ది కొద్దిగా చదువుకుంటాము...realy very suspence story...

    ReplyDelete
    Replies
    1. Hahaha.. antaa petteste interest vundadu bro...

      Delete
  5. Interesting read.. waiting for next post... plz tag me while sharing d post in fb.

    ReplyDelete
    Replies
    1. thank u andi.. but tag yela cheyyaali?? fb lo friends list lo vuntene tag cheyyagalam kadandi...

      Delete
  6. Chala intresting ga undi bro....waiting ante nacchadu naku...but me post la kosam wait chestanu......all the best...

    ReplyDelete