Friday, January 6, 2017

మధుర సంతకములు ...

గమనిక : కొంచం ఘాటు పదాలు వాడటం జరిగింది.. సున్నిత స్త్రీ లు చదవకపోవడమే మంచిది.. నూతన దంపతుల మధ్యన జరిగే సున్నితమైన సరస శృంగార ఖేలిని ఉద్దేశించి రాసాను.. కవితా హృదయంతో చదవమని విన్నపం.. 


మధుర సంతకములు ...
*********************

తొలిసంధ్య నులివెచ్చని కిరణాల మాటున ..
తలారా నలుగు స్నానమాచరించి..
ముద్దులొలుకు మందార కుసుమ దరహాసముల తోడ.. 
చెంగు చెంగు మని నర్తించు నా చెలి .. కాలి 
మువ్వల సవ్వడులతో, సొగసులొలుకు 
శృంగార నెమలి భంగిమ నయనాడుతూ, నడయాడుతూ... 
తెలుపు వస్త్రములను చుట్ట యత్నించ ..
ఆరుబయట అలికిడితనమునకు 
వడి వడి బిత్తర తత్తర చూపులతో.. 
తడబడుతూ, తప్పటడుగులతో... 
తడి కురుల కొనన జాలువారు చిరు జల్లులతో.. 
యెవ్వన జింక వంటి లే లేత అడుగులతో ..
దేహ పరువపు సొగసులను కరము నున్న 
తెల్లని వస్త్రముతో కప్పుకొనుచూ .. 
బిర బిరా లంకించు జవరాలిని అమాంతం 
ఒడిసిపట్టి గిర గిరా తిప్పి పాన్పున పవళింపు 
పరిణాయకుడను జూచి సిగ్గులొలుకు ఆ 
పడతి మోముఫై ప్రేమ చుంబనాల గురుతులతో..
ఆపాదమస్తకం జిహ్వాభి షేకములతో ..
మకరధ్వజుఁడై కోమలాంగి పరువపు మకరందమును సేవింపంగ ..
ఒక నేత్రమున రౌద్రముతో .. 
మరో నేత్రమున శృంగారముతో .. 
ఒక కరమును త్రోసిపుచ్చుతూ..
మరొ కరమున హత్తుకుంటూ.. 
పులకరింతలు గలుగ పురివిప్పి యాడినవి యా పడతి 
మధుర యవ్వన కన్నె ప్రాయములు .. 

Bobby Nani

No comments:

Post a Comment