Wednesday, January 18, 2017

“తామరనేత్రిని” ...



నేటి వేగవంతమైన ప్రేమలకు, పెళ్ళిళ్ళకు, పెటాకులకు కనువిప్పుగా ఓ మధుర ప్రేమను, ఆ ప్రేమికులను ఉద్దేశించి రాసాను.. “రెండు హృదయాలు” ఎన్నో ఏళ్ళ నుంచి ఒకరికొకరు చూసుకోకుండానే ప్రేమించుకుంటున్నాయి.. చూసుకోకుండా ప్రేమ ఏంటి ?? అనే అజ్ఞాన మాటలు చాలామందిలో మెదులుతాయి .. వెలుగు, చీకటి అంటే పగలు, రాత్రి కాదు.. ప్రేమ, భాద్యత అని అర్ధం.. చీకటిలో వెలుగు లేకుంటే అందమే లేదు.. అలానే వెలుగులో చీకటి ఉంటేనే వెలుగుకో అర్ధం.. “ప్రేమలో భాద్యత ఉండాలి.. భాద్యతాయుతంగా నీ ప్రేమ చిరకాలం ఉండాలి” ఇది నేటి యువతలో ఎంతమందిలో ఉంది ?? వేగంగా నచ్చేది, వచ్చేది అంతే వేగంగా నాశనం అవుతుంది.. నెమ్మదిలో అర్ధం చేసుకునే గుణం ఉంటుంది.. ఆలస్యంగా చిగురించినా ఆరుకాలాలు సజీవంగా నిలిచి ఉంటుంది.. 

ఒక ప్రియుడు తన ప్రేయసిని ఎన్నోయేళ్ల నిరీక్షణ అనంతరం క్షణ కాలం మాత్రమే చూసి తలమునకలుగా మునిగిన ప్రేమ సంద్రంలో కొట్టుమిట్టాడుతూ ఆమెను తన అక్షరాలతో అలంకరిస్తున్నాడు.. “తామరనేత్రిని” అని తనకు ముద్దు పేరుకూడా పెటుకున్నాడు .. మీరే చూడండి... 

“తామరనేత్రిని” ... 
*************

అదేంటో నీ రూపాన్ని చూడగానే నా కనుపాపలో 
కోటి కుసుమాలు ఒక్కసారిగా వికసించాయి...!!
అనేక తారలు తళుక్కుమని మెరిసాయి.. !
ముదురు నీలిరంగు చీరలోన,
నువు అలా నడుస్తుంటే.. 
అరణ్యపు మయూరము నా ముంగిట నర్తిస్తున్నట్లు అనిపించింది.. !!
వెన్నెల చాలా అందంగా ఉంటుంది..
కాని, నిన్ను చూసాక నా కళ్ళకు ఆ వెన్నెల వెలవెలబోయింది.. !!
కనురెప్ప వేసే క్షణంలో కూడా నిన్నే,
చూడాలని పరితపిస్తున్నాయి నా నేత్రములు.. !!
శంఖం ఆకృతిలా వున్న ఈ కోమలాంగిని చూచుటకు 
వెయ్యి నేత్రములైననూ చాలవు .. 
ఛందస్సు వదలని సంప్రదాయ పద్యం లా..
సంగీతం లేక కదలని శాస్త్రీయ గేయం లా .. వున్న నన్ను.. 
వచనా కవిత్వం లా వచ్చి తాకావు.. 
పల్లవిలేని నీ వలపు పాటలు ..
నియమం లేని నీ పద్య పాదాలు..
అలంకారాలు లేని నీ అమాయక హావా భావాలు.. 
నన్ను ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.. !!
తెల తెల్లవారున పారిజాతపు కుసుమాలు రాలినంత 
సుతిమెత్తగా నీ పాదాలు ఆ ధరణినిని ముద్దాడుతుంటే.. 
నీ దేహం నుంచి గంధపు పరిమళాలు వెదజల్లుతుంటే .. 
పిల్లగాలికి నీ కేశములు వెన్నెల వంటి ఆ నడుమును 
తాకుతూ గిలిగింతలు పెడుతుంటే...
ఘడియ ఘడియకో మధుర చుంబన “లా” 
నా అణువణువునూ స్పృశిస్తున్నాయి...!!
ఒక్కసారి నిను కనులారా చూస్తే చాలే క్షణాలు కాదు.. యుగాలను దాటేస్తా .. !!!


Written by : Bobby

No comments:

Post a Comment