Wednesday, July 27, 2016

పుస్తకాలు లేని గది ఆత్మలేని దేహం వంటిది...

తెల్లటి పొలంలో నల్లని విత్తులు.. అదే అండి.. పుస్తకంలో అక్షరాలు..
ఏమైనా పుస్తకంలో చదవడంలో వున్నఆనందం మరెందులోనూ వుండదు.. అలా చదివిన మనకు సంతృప్తిగా కూడా వుంటుంది.. ఎంతైనా పుస్తకం పుస్తకమే..
ఎవ్వరూ లేనప్పుడు నేనున్నాను అంటూ తోడుగా మారగలదు..
భాదలో వున్నప్పుడు మనసు మరల్చి సంతోషాన్ని అందించే సంజీవిని కూడా కాగలదు..
తెలియనివి భోదించడంలో గురుస్థానాన్ని కలిగి సన్మార్గంలో నడిపేదిగా కూడా చెయ్యగలదు..
ఓ స్నేహితుడిగా, గురువుగా ఇలా ఎన్నో అవతారాలను పోషించి మనల్ని ఒకతాటిపై నడిపించనూ గలదు..


అందుకే నా దృష్టిలో పుస్తకాలు లేని గది ఆత్మలేని దేహం వంటిది... అంతే కాదు పుస్తకాలు దీపాలవంటివి కూడాను . వాటి వెలుతురు మనోమలిన్యమనే చీకటిని తొలగిస్తుంది... సానపెట్టినకొద్ది రాయి రత్నం వలె ప్రకాశిస్తుంది. చదివినకొద్దీ మనిషికూడా వివేకవంతుడవుతాడు....


Bobby Nani​

1 comment:

  1. పుస్తకాలు ప్రపంచ చైతన్యాన్ని మోసుకొస్తాయి..జడత్వపు ఛాయల మీద కాంతి చిమ్మి నీడలనే పరిగెత్తించే స్పందనా ఝురులవి...!

    ReplyDelete