ఏముందే నీలో..
ఊపిరి భారమై తోస్తుంది..
హృదయం వేగం తీస్తోంది..
పెదవులు పెనుగులాటకు తపిస్తున్నాయి..
దేహము తన్మయత్వముతో తహతహలాడుచున్నది ..
నా రోమాలే సూదిమొనలై నను గ్రుచ్చుతున్నాయి..
అలసటలేని నయనాలు నిను వెతుకుతున్నాయి..
నిరంతర నీ జ్ఞాపకాల పరంపర నాకూపిరినిస్తోంది..
ఎలా చేరుతావ్ నన్ను..
వర్షించే మేఘంలా నువు మారి,
చిరుజల్లుల్లా నను నిలువెల్లా ముద్దాడుతావా..
ప్రాతఃకాలమున వికసించిన పుష్ప పరిమళమై
నను మత్తుఁగ తాకుతావా..
మరణశయ్యపై పడివున్న నన్ను
మట్టిలా కప్పుకు పోతావా..
చెప్పూ.. !!
వినాలని ఉంది.. !!
నీతో మాటలు కలపాలని ఉంది..
ఎదుట లేని నీ కోసం..
యుగాలైనా ఎదురు చూస్తూనే వుంటా ..
హృదయ కాగితంపై
సిరా లేని కలముతో,
మౌన సంతకాలు చేస్తున్నా..
ఎప్పటికైనా
నిను చేరాలని,
నిను చూడాలనే తపనలతో..!!
Written by: Bobby Nani

No comments:
Post a Comment