Sunday, November 19, 2017

ఏం.. మీకు మగాడంటే అంటే అంత చులకనగా కనిపిస్తున్నాడా.. ??


చాలా మంది ఈరోజు Men's Day (పురుషుల దినోత్సవం) గురించి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.. అందుకు చాలా సంతోషంగా వుంది.. కొందరు మాత్రం చాలా వెటకారంగా పోస్ట్ లు రాసున్నారు.. ఇది చాలా శోచనీయం ..

ఏం.. మీకు మగాడంటే అంటే అంత చులకనగా కనిపిస్తున్నాడా.. ??

మీరు తీసుకునే ప్రతీ శ్వాసలో తను మీకెప్పుడూ తోడై, నీడై వుండట్లేదా .. ఒక కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా, భర్తగా, తండ్రిగా, స్నేహితుడిగా, ప్రేమికుడిగా, అనుక్షణం మిమ్మల్ని కనుపాపలా కాచుకు కూర్చోవట్లేదా... అయినా వాడు అంటే మీకు లోకువే.. ఎదుకంటే మీ దృష్టిలోనూ, సమాజం దృష్టిలో అతడో కాంత దాసుడు.. 
వేకువనే లేచి .. 
వున్నా, లేకున్నా, 
తిన్నా, తినకున్నా, 
దండానికి తగిలించిన బట్టలు వేసుకొని .. 
ఎండనకా, వాననకా, 
పగలు, రేయి తారతమ్య భేదాలు మరిచి 
కుటుంబ బీడు కయ్యను .. గాడేద్దు వలె దుక్కి దున్నుతున్నాడు.. 
కంటిలోని జలాన్ని కన్నులలోనే ఆవిరి చేస్తూ ..
కంటిముందర భాద్యత అనే భూమిని చిరునవ్వుతో .. 
లాగుతున్నాడు పచ్చని పంట చెయ్యాలనే తపనలతో..
కమిలిన చేతులతో, తన పాదాన్ని అంటిన కనికరం లేని గాయాలతో.. !!
ఎందుకోసమో ఈ త్రాస.. ఎవరోకోసమో ఈ ప్రయాస.. 
నా ఆనుకున్న మీ కోసం కాదా.. 
తనపై మీరు పెట్టుకున్న నమ్మకం కోసం కాదా... 
రక్షణ తెలిసిన తన బాధ్యత కోసం కాదా..

ఆలోచించండి..!!

ఏ మగాడ్ని అంత చులకనగా చూడొద్దు.. అహర్నిశలు కుటుంబం కోసం కష్టపడుతూ పైకి మొరట స్వభావాన్ని ప్రదర్శించేది మీ నాన్నే... గుర్తుపెట్టుకో .. మీ నాన్న కూడా మగాడే..

తన మనసును ఎప్పటికీ నువ్వు అందుకోలేవు..అలా అందుకోవాలంటే నువ్వు ఓ తండ్రివి అయినప్పుడు మాత్రమే జరుగుతుంది....

అమ్మలా తనకు ఏడవటం రాదు.. 
కళ్ళల్లో ప్రేమ చూపించడం రాదు.. 
చేతల్లో మాత్రమే చూపించగలడు ..
మనసులో మాత్రమే ఏడవగలడు .. 
అద్దంలో తనని తాను చూసుకున్నప్పుడు తెలిసింది.. 
మసిపట్టి మసకబారిన తన మోము ఒకటనేది వుందని.. 
గతించిన ఏళ్ళను వెనక్కి తిరిగి ఒక్కసారి తను చూసుకుంటే ..
అంతా చీకటిపట్టిన మసే కనిపించింది..

దుమ్ము, ధూళితో నిండిన తన జీవితాన్ని దులిపేదెవరు ??

మొరటివాడు, మొండి వాడు, క్రోధుడు ఇవే మీరు తనకిచ్చిన బిరుదులు .. 
ఈరోజు నువ్వు నలుగురి పిల్లలతో కార్పొరేట్ విద్యను అభ్యసిస్తున్నావంటే అతడు అక్కడ తన స్వేదాన్ని చిందిస్తున్నాడు..

నీకు అర్ధం అవుతుందా.. ??

ఏరా అబ్బాయ్ .. అతని స్తోమతకు మించి నిను చదివిస్తున్నాడు.. 
ఇదిగో అమ్మాయ్ ... నీ పెళ్లి సకల లాంఛనములతో దేదీప్యమానంగా చేస్తున్నాడు..

డబ్బు ఎక్కడినుంచి వస్తుంది నాన్నా.. అని మీరేనాడైనా అడిగారా.. 
తన తల తాకట్టు పెట్టి మరీ తెచ్చి పోస్తున్నాడు.. అర్ధమవుతోందా .. 
మగాడంటే మీకు అంత చులకనా..

మీకు భయమేస్తుందంటే గుండెలకు హత్తుకున్నాడు..

చలేస్తుందంటే దగ్గరికి తీసుకున్నాడు..

జబ్బు చేసిందంటే సకలోపచర్యలు చేసాడు..

మీ మలం, మీ మూత్రం, ఆఖరికి మీ వ్యర్ధాన్ని కూడా తనపై పోయించుకున్నాడు .. అతడూ ఓ మగాడే..

ఎవరి కోసం.. మీ కోసం..

మీరు పుట్టి పెరిగి ఒకరి ఇంటికి వెళ్ళేంత వరకు తను మీకు ఎంతలా కాపుదల కాచాడో తెలుసా.. అసలు మీకు వయసులో వున్న ఒక అమ్మాయిని కాపుదల చెయ్యడం యెంత కష్టమో తెలుసా.. పోకిరీ గాళ్ళు, పక్కింటివాళ్ళు, స్కూల్లలో, కాలేజీలలో, బస్సుల్లో, ఇలా అన్నిచోట్లా ఉరిమే తన కళ్ళతో, ఖరుకైన తన కంఠ స్వరముతో భయపెడుతూ, బెదిరిస్తూ మీకో రక్షణా వలయంలా ఉన్నాడు .. తెలుసా..

ఇవేమీ మీకు తెలియదు.. తెలియాలని కూడా అనుకోడు..

అయినా మగాడంటే మీకు చులకనే.. మీ తండ్రి కూడా ఒక మగాడే అన్న సంగతి మీరు మరవకూడదు..

అతడెప్పుడూ అద్బుతమే , అజరామరమే, ఓ అనంత శక్తిస్వరూపమే .. మీరు నమ్మినా, నమ్మకున్నా..

మీరు మగాళ్ళను గౌరవించక్కర్లేదు.. చులకన మాత్రం చెయ్యకండి...

భాద్యత తెలిసిన ప్రతీ మగాడు నా దృష్టిలో మగాడే.. అలాంటి వారికి అంకితమిస్తూ.. __/\__

Written by : Bobby Nani

No comments:

Post a Comment