Friday, April 21, 2017

\\\\ విధ్యార్దుల్లారా ఆలోచించండి..////\\\\ విధ్యార్దుల్లారా ఆలోచించండి..//// 
**************************

నాయకుల జెండాలను మోయడానికేనా విధ్యార్దులుండేది.. ?? 
కండువాలకు కానరారా విద్యార్ధులు.. 

అదేమంటే అనుభవం కావాలట.. నిజమే ఆ అనుభవం ప్రజలకేమో గాని వారికి మాత్రం చాలా అవసరం ఎలా, యెంత వెనకేసుకోవాలా అని.. 


అసలు విద్యార్ధులకు, నాయకులకు సంబంధం ఏంటి ? 


నాయకుడు వస్తే విధ్యార్దులేందుకు రోడ్లమీదకు జెండాలెత్తుకొని వస్తున్నారు.. 


అయినా వాళ్ళని అని ఏం ప్రయోజనం .. 100 పెట్రోల్ కక్కుర్తికి అరపూట ఎండలో మోటారు బైకుపై తిరిగేందుకు ఎగేసుకొని వస్తున్న నిన్ను, నీ వెనుక కూర్చున్న ఆ సన్నాసి ఫ్రెండ్ ని అనాలి ... 


నీ ఫ్రెండ్ చెప్పాడని నీవు వెళ్తావ్.. తను చెప్పాడని మరొకడు... ఇలా ఇదొక చైన్ సిస్టం లా ప్రతీ విద్యార్ధి ఇందులోకి వాడికే తెలియకుండా వస్తున్నాడు.. ఇంతకీ వాడికి అసలు నాయకుడెవరో కూడా తెలియదు.. ఎందుకొస్తున్నామో కూడా తెలియకుండా వస్తున్నారు.. 


నాయకులకు కావాల్సింది యువశక్తి .... మీరు తనవెంట వున్నారనే ధీమా ప్రజలలో కలగాలని మిమ్మల్ని వాడుకొనే అతి నీచమైన నాయకుని పన్నాగం ఇది.. 
బయటకు రండి.. 
మేల్కోండి .. 
నిజాన్ని తిలకించండి.. 
నాయకునికి జెండా పట్టే రోజులు పోవాలి.. 
యువత నాయకుడై నడవాలి.. 
వయసు మళ్ళిన ఈ ముదుసలి నాయకుల పాలనకు స్వస్తి చెప్పాలి.. 


రాజకీయ రణరంగంలో...
జిత్తుల మారి నక్కలవలె ..
రంగులు పులుముకున్న ఊసరవెల్లిల వలె..
పేద ప్రజల రక్తపు కూడు ఆరగించే సునకముల వలె. ..
బడుగు, బలహీన వర్గాల శ్రమను దోచుకునే మానవ మృగమువలె...
సంచరించుచూ, 
మా నెత్తిన ఎక్కించుకున్నందుకు మీరాడే ...
ఈ రాక్షస, రాజకీయపు మరణపు సోపాన పటములో...
పావులుగా జేర్చి వికటాట్టహాసం తో, 
వెకిలి చేష్టలతో, వికృత పనులతో..
అయిదు ఏళ్ళ పాలనను, అరుదైన రీతిలో ...
ఆశ్చర్య పరిచే విధి విధానంతో పాలించడం ...
నభూతో న భవిష్యతి ... 
ఇది మీకే సాధ్యం...

అసలు “నాయకత్వమంటే నిరంతర అబ్యాసనమే.” ఎల్లప్పుడూ ఏదో ఒక కొత్త విషయాన్ని ఆలోచిస్తూ నేర్చుకుంటూ నిత్య విద్యార్దివలె వేల్లెవాడే నిజమైన నాయకుడు.. 

నిరంతరం సంస్థ ప్రగతి గురించి ఆలోచిస్తూ, తన ఆలోచనలను సభ్యులకర్థమయ్యేల్లా చెప్పి, వారిని అదే విధము గా ఆలోచించేలా చేసి సంస్థను ప్రగతి పధం వైపు నడిపించడమే నాయకుడి ప్రదమ లక్షణం. 

నాయకుడు మొదట తాను మారి చూపించినతరువాత ఇతరులను అనగా అనుచరులను మారమని కోరాలి. విజయం ఏ ఒక్కరివల్లా సాధ్యం కాదు. సమిష్టి కృషివల్లే అది సాధ్యమవుతుంది. నాయకత్వ స్థాయిలో ఉన్నవారు ఈ విషయాన్ని గుర్తించాలి. ఎంత సామర్థ్యంగల టీమ్‌ లీడరైనా సభ్యులతో కలుపుగోలుగా, స్నేహపూర్వకంగా వ్యవహరించగలగాలి. ఈ విధమైన లక్షణాలు ఉన్నవారే నాయకుడిగా ఎదగుతారు. పురోభివృద్ధికి తోడ్పడుతారు.

క్రమశిక్షణ, 
సమయపాలన, 
నిబద్ధత, 
నాయకుడికి ఉండాల్సిన లక్షణాల్లో అతి ముఖ్యమైనవి. 
సమయపాలన లేని వారు విజయాలు సాధించలేరు. 
నాయకుడు పదిమందికి ప్రేరణ కలిగించేవాడై ఉండాలి. 
సానుకూల దృక్పథం అలవరుచుకోవాలి.
నాయకుడు అనేవాడు గొప్ప వ్యూహకర్తగా ఉండాలి. 
దూరదృష్టి కూడా ఉండాలి. 
సమస్యలు గుర్తించడంతోపాటు వాటిని పరిష్కరించే సమయంలో వ్యూహాలను పక్కాగా అమలు చేయాలి. 
అదే సమయంలో టీమ్‌ సభ్యుల, సహచరుల వ్యూహాలనూ కూడా పరిగణనలోకి తీసుకొని పరిశీలించి అవసరమైతే స్వీకరించాలి. 
పూర్తి ఆత్మవిశ్వాసంతో పనిచేయాలి.

నాయకుడికి ఉండేటటువంటి మొదటి లక్షణము తను నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉండటము, దృడ నిశ్చయంతో ముందుకు కదలటము. తను చేసే పనులు, మాట్లాడే మాటలు ఆలోచించే ఆలోచనలు అర్థవంతముగా, పదిమందికి మంచిచేసేవిగా ఉంటాయి. లక్ష్యమునకు కట్టుబడి ఉండటము అనేవి నాయకునికి ఉండే లక్షణాలు. 

ఒక ఏం.ఎల్.ఏ ఎన్నికల అప్పుడు యెంత ఖర్చు చేస్తారో ఎవరికీ లెక్కలు వుండవు..
నోట్లకట్టలకు రెక్కలు వచ్చును,...
మద్యపు సెలఏర్లు ఆవిర్భవించును ... 
సాని నెరజానులు సందెవేలకు ... 
స్థానాన్ని వదిలి సంకర జాతులతో సందడి చేసెను... 
ఓటరు, క్వార్టర్ కు, పచ్చ కాగితానికి ...
తలవొగ్గి, ఆత్మాభిమానాన్ని తాకట్టుగా చేసి... 
అయిదేళ్ళ రాక్షస పాలనకు రంకేసిన ..
ఆంబోతు వలే పచ్చ జెండా ఊపి...
ఒళ్ళు మరిచి, తనని తానే మరిచి, 
కన్నవారిని, 
కట్టుకున్న వారిని, 
కడుపునబుట్టిన వారిని, 
మరిచి,... 
రోడ్ల ప్రక్కన కుక్కల నివాస ...
స్థావరాలలోనే స్తిరపడి సుఖించగా... 
రేపనే రోజున నీకు అన్యాయం జరిగిన నాడు... 
నీ గోడును ప్రశ్నించడానికి ...
కనీసం నీ నాలుకైనా సహకరిస్తుందా .. 
ఓ ఉమ్మెత్త వానరా .... మానరా ఈ ఎంగిలి బతుకులు... 
రాయరా సువిశాలపు భారత రాజ్యాంగపు పేజీలను 
తిరగరాయరా ...
ఆడరా కదంతొక్కి కుళ్ళు రాజకీయపు కుట్రలపై .. 
పాడరా విరహ గీతపు కౌగిలిలో నాయకులను దూర్చి... 

భాద పెట్టేవాడు, భయపెట్టేవాడు కాదురా నాయకుడంటే భరోసా ఇచ్చేవాడే నిజమైన నాయకుడు.. 


ఓ నిత్య విద్యార్ధి...

Written by : Bobby Nani

5 comments:

 1. నిజమేనండి ఆలోచించాలి అందరు కూడాను .
  స్వచ్చ భారత్ కొకరోజు
  స్వచ్చ ఆంధ్రా కొకరోజు
  తల్లి పాలకోకరోజు
  పోలియో చుక్కలకొకరోజు
  బస్సు పాసుకోకరోజు
  పాసు(బాతు)రూములకోకరోజు
  చైతన్య ను మూయాలని ఒకరోజు
  నారాయణని మూయాలని ఇంకోరోజు
  స్కాలర్షిప్పులకోకరోజు
  బ్యాంకు బుక్కు కొకరోజు
  డాక్టర్ లేడని ఒకరోజు
  డాక్టర్ ను కొట్టాలని ఓక రోజు
  ర్యాగింగని ఒకరోజు
  రైతు రుణమాఫీకొకరోజు
  ఆత్మహత్య కాదు హత్య అని ఇంకోరోజు
  పెట్రోలు డీసల్ పెరిగిందని ఒకరోజు
  గ్యాస్సు బండకోకరోజు
  ముఖ్యమంత్రి పర్యాటనకొకరోజు
  ఎన్నికలకోకరోజు
  ఎన్నికల ఫలితాలకొకరోజు
  పై వేవి మాకు తెలీదు
  మాకు తెలిసిందల్లా
  ర్యాలీలు..........
  ధర్నాలు...........
  రాస్తారోకోలు...........
  వర్థిల్లాలి...........
  జిందాబాద్..........
  కభద్దార్................
  జస్టీస్..................
  డౌన్ డౌన్................
  జై ..........................
  అంతే..
  మాకు ఇంకేమి తెలిదు
  మా గొంతు చించుకొని
  ఎండలో ........................
  జన సమూహం లో
  కాలుష్యం లో
  దాహం వేస్తే కనీసం మంచి నీరు లేక
  గొంతు చించు కొంటాం
  అరుస్తాం.............
  నాయకుల ఫోటో ఫోజులు
  మాకు కాళ్ళు నొప్పులు
  మేమెవరో తెలుసా
  పసి మొగ్గలం
  రేపటి పౌరులం
  నేటి విద్యార్థులం........!
  …………


  ReplyDelete
 2. ఈ విషయం పై ఓక ఉపాధ్యాయుడును నేను అడిగితె ప్రోటోకాల్ అండి పిల్లలు రావాల్సిందే అంటాడు

  ReplyDelete
  Replies
  1. . . . ఉపాధ్యాయుడును . . .
   మన్నించండి. ఉపాధ్యాయుడిని అనికదా అనాలి? రానురాను ఇలాంటి చిత్రవిచిత్రమైన యీకాలపు తెలుగుభాషాప్రయోగాలు చూస్తుంటే చదవనూ విననూ చాలా భయాందోళనలు కలుగుతున్నాయి. నిన్ననే ఒకాయన అన్నవాక్యం "ఎవ్రిబడీ‌ వెరీ బేడ్లీ ప్లేయ్డ్ అండీ'

   Delete
  2. మన్నించండి, టైపు చేయడం లో పొరపాటు దొర్లింది , గమనించలేదు , అంతేగాని పదప్రయోగాలు చేయాలని కాదు

   Delete
 3. ఓక అనే పదాన్ని మీరు కూడా గమనించలేదు , నేను ఇప్పుడే చూసాను 'ఒక ఉపాధ్యాయుడిని' అని ఉండాలి . కాని ఓక అని తప్పు దొర్లింది . గూగుల్ ఇన్పుట్ టూల్ లో దొర్లే తప్పులు చూసుకోక పొతే మీ లాంటి వారితో అక్షింతలు.... మాకు అవే శ్రీ రామ రక్షలు

  ReplyDelete