Saturday, April 1, 2017

పంచ విషాదాలు..


ఓ స్త్రీ కోరిక మేరకు ఈ చిరు విషాద కవిత... 

రెండు రోజుల క్రితం ఆడవారి పాదాలపై ... పంచ భూతాలను ఉద్దేశించి వాటి సౌందర్య చర్యలను రాయడం జరిగింది .. ఆరోజున ఓ స్త్రీ మూర్తి ఇలా అడిగింది.. 

బాబీ గారు పంచ భూతాలపై నేను చాలా కవితలు విన్నాను.. ఎక్కువగా వాటి స్వరూపం అయిన రౌధ్రాన్ని చూసాను.. ప్రళయాన్ని చూసాను, నాశనాన్ని చూసాను.. కాని మొన్న మీరు వాటిల్లో సౌందర్యం కూడా ఉంటుందని ఆడవారి పాదాలతో సరిపోల్చి రాసారు .. అలానే ఆ పంచ భూతాలు పడే తపన, ఆవేదన కూడా చూడాలని ఉంది .. ఓ రచయితగా మీరు వాటి ఆవేదన రాయగలరా.. ?? 
అని అడిగారు... 

రాయగలరా అని అంటే రాయాలనిపిస్తుంది కదా.. 

పంచ విషాదాలు.. 
*************

ధరణి బాధపడుతోంది 
అమాయకుల రక్తం 
అరాచక శక్తుల చేతుల్లో చింది
తనపై ఒలుకుతున్నందుకు...!!

ఆకాశం విలపిస్తోంది 
కట్నం చితి పొగలు 
తనను ఉక్కిరిబిక్కిరి 
చేస్తున్నందుకు.. !!

అగ్ని బాధపడుతోంది
కుల రక్కసి బలవంతంగా 
బడుగు గుడిసెల్ని భస్మీపటలం 
చేస్తున్నందుకు.. !!

వాయువు విలవిలలాడుతోంది 
సహజసిద్దమైన తనను 
వికృతం చేసుకొని 
రోగాల బారిన పడుతున్నందుకు.. !!

నదుల్లో నీరు బాధపడుతోంది
కలతలకు కలవరపడి
వెతలకు కృంగి, కొన్ని జీవితాలు 
అర్ధవంతంగా ముగుస్తున్నందుకు.. !!

Written by : Bobby Nani



No comments:

Post a Comment