Thursday, February 2, 2017

“టైటానిక్‌”

“టైటానిక్‌” ఈ పేరు వినగానే మొదట మనకు గుర్తొచ్చే వ్యక్తి “జేమ్స్‌ కామెరూన్‌” ఆయన రూపొందించిన చిత్రంలో “టైటానిక్‌” షిప్‌ మునిగిన విషాద ఘటనకు, ఓ అందమైన ప్రేమకథను జోడించి ఎంతో అత్యాద్భుతంగా చిత్రీకరించారు. ఎంతలా అంటే.. 20వ శతాబ్దం మొదట్లో జరిగిన సంఘటనను.. శతాబ్దాంతంలో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఆ విషాదం జరిగి రేపు రాబోయే ఏప్రిల్ కు సరిగ్గా 105ఏళ్లు కావస్తోంది.. 

ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ..!! 

ఓ రచయిత ఊహాపరిజ్ఞానం, అతని శక్తి సామర్ధ్యాలు ఎప్పటికప్పుడు అందరినీ సంబ్రమాశ్చర్యాలకు గురిచేస్తూనే వున్నాయి.. వుంటాయి కూడా.. అలా జరిగిన ఓ నిజ సంఘటనే ఈ “టైటానిక్” షిప్ కి సంబంధించిన “టైటాన్” ... 

విషయంలోకి వెళ్తే.. 

“Morgan Robertson” అనే రచయిత 1898వ సంవత్సరంలోనే “The Wreck of the Titan” అనే ఒక నవలను పుస్తకం రూపంలో ముద్రించాడు.. ఈ కథలో “టైటానిక్” షిప్ లాంటి పెద్ద నౌకను ఉద్దేశించి రాసాడు ఆ షిప్ పేరు “టైటాన్” .. 

“టైటానిక్” షిప్ ఎలా మునిగిపోయిందో...

అందులో ఎలాంటి లోపాలు వున్నాయో...

షుమారు యెంత మంది ప్రయాణికులు చనిపోయారో...

ఇద్దరి మధ్య ప్రేమ ఎలా చిగురించిందో.. 

షిప్ లోపల వున్న సదుపాయాలూ, సౌకర్యాలు..

ఆఖరికి ఎక్కడ మునిగిపోతుందో కూడా కూలంకషంగా రాసి ...
మంచుకొండను ఎలా గుద్దుకొని రెండుగా విడిపోయి మునిగిపోతుందో, కళ్ళకు కట్టినట్లు ఆయన ముందే ఆ పుస్తకంలో రాసున్నారు.. ఇందులో విచిత్రం ఏంటంటే పేర్లు కూడా సరిగ్గా సరిపోవడం... 

ఇదంతా “టైటానిక్” షిప్ మునిగిపోకముందే (14 సంవత్సరములకు ముందే) ఈ బుక్ లో రాసున్నారు.. అతని ఊహాగానాలకు, మేధోసంపత్తికి నిలువెత్తు నిదర్శనం.. 

టైటానిక్ షిప్ ఇంగ్లాండు లోని సాథాంప్టన్ నుండి 1912వ సంవత్సరంలో ఏప్రిల్ 10వ తేదిన టైటానిక్ నౌక న్యూయార్క్ నగరం వైపు బయలుదేరింది. అందులో మొత్తం 2,240 మంది ప్రయాణికులు ఉన్నారు.. వారిలో కొందరు ఈ బుక్ గురించి కూడా మాట్లాడుకొని ఉన్నారని .. చాలా ఆశ్చర్యంగా భావించారని, తరువాత జరిగే ప్రమాదాన్ని పట్టించుకోకుండా కొట్టిపారేశారని అందులోనుంచి బ్రతికి బయటపడినవారు చెప్పారని అంటున్నారు.. 

1,522 మంది ప్రయాణికులను బలిగొన్న ఓ అందమైన నౌక గురించి ఆయన ముందుగానే ఓ బుక్ లో రాయడం నిజంగా అద్బుతమే.. ఇది యాదృచ్చికం కాదు.. అతనికి జరగబోయే విషయాన్నే అతను అక్షరాలుగా మలిచి అందరికీ హెచ్చరించే లా.... ఉన్నది వున్నట్లు 14 సంవత్సరములకు ముందే రాయడం అన్నది మామూలు విషయం కానే కాదు.. 

అతనికి తెలిసి చేసాడో లేక తెలియక చేసాడో కాని మొత్తానికి ప్రపంచాన్ని ఒక ఊపు ఊపేసాడు ... ఇలాంటి రచయితలు చాలా అరుదుగా వుంటారు.. వారందరినీ జ్ఞప్తికి తెచ్చుకుంటూ ... 

ప్రపంచ చరిత్రలో ఒక చేదు జ్ఞాపకంలా మిగిలిన దుర్ఘటన టైటానిక్ నౌక మొట్టమొదటి ప్రయాణమే చిట్టచివరి ప్రయాణం కావడం, 1,522 మంది ప్రయాణికులు, సిబ్బంది జలసమాధి అవ్వడం ఈనాటికీ అదో తీరని విషాదసంఘటనే ...

Written by : Bobby Nani

No comments:

Post a Comment