Friday, February 3, 2017

SOCOTRA (The Mysterious Island) from Bobby... 10th Part

SOCOTRA

                                      -The Mysterious Island-


మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...

ఇంత అర్ధ రాత్రి వేళ పడవలో ఎవరు ఇక్కడకు వస్తున్నారు..?? 
ఎందుకు వస్తున్నారు ?? 
అసలు వారు ఎవరు ?? 
ఇలాంటి ఆలోచనలు ఎన్నో వారి మస్తిష్కంలో పరుగులు తీస్తున్నాయి.. 
ఇక్కడేదో జరుగుతోంది .. 
వెంబడించిన ఆ వికృత రూపం, 
నేల అడుగునుంచి వస్తున్న శబ్దం, 
నిర్మానుష్యమైన ఈ దీవిలో ఈ అర్ధ రాత్రివేళ ఓ పడవ… 
ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఇక్కడ సమస్య వుంది అని ఆ సాఫ్ట్ వేర్ మోహన్ అంటాడు.. 
నిజమే…. ఇదేంటో మనం కనిపెట్టాలి ... 
అలా ఆ పొదల మాటుకు వెళ్లి గమనిద్దాం పదండి అని ఆకాష్ అంటాడు.. (వీరు ఆ సముద్రానికి కొంచం ఎత్తులో వున్నారు.. ) అనుకున్నట్లే ఇద్దరూ ఆ సమీప పొదల మాటుకు వెళ్లి చూస్తూ వుండగా .. పడవ ఆ దీవికి వచ్చి ఆగింది..

ఆ పడవ ఏంటి అనే ఆలోచనలతో ఉన్నారా ..??
సరే అదేంటో చూద్దాం పదండి..
10th Part

అందులో నుంచి ఇద్దరు బలమైన మనుషులు కిందకు దిగారు.. గుడ్డ చుట్టిన ఓ ఐదు అడుగుల మూటను ఇద్దరూ మోసుకుంటూ కిందకు దించారు.. మరో చిన్న మూటను కూడా దించారు.. ఆ మూటలకు యేవో మరకలు అంటుకొని వున్నట్లు వున్నాయి.. ఆ లాంతరు వెలుగులో సరిగా కనపడటం లేదు.. 

ఆ రెండూ మూటలను మోసుకొని వారికి సమీపాన వున్న ఓ పెద్ద రాయి దగ్గరకు వచ్చారు.. అక్కడ వున్న అన్నీ రాళ్ళతో పోలిస్తే ఆ రాయి చాలా వ్యత్యాసంగా వుంది.. ఓ 6 అడుగుల పొడవుతో ముదురు ఊదారంగు కలిగి ఆకాశ కాంతులకు స్పందిస్తూ చాలా స్పష్టంగా కనిపిస్తూ వుంది.. వాళ్ళు ఆ రాయి దగ్గరకు వెళ్లి వాళ్ళ దగ్గర వున్న కాగడ వెలిగించి ఆ రాయికి దగ్గరగా ఉంచగా … ఆశ్చర్యంగా ఆ రాయి కాగడ వేడికి ప్రక్కకు ముడుచుకుంటూ లోపలకు దారిని ఇస్తోంది.. వాళ్ళు ఆ మూటలు తీసుకొని లోపలకు వెళ్ళిపోయారు.. 

ఓ ఇదా సంగతి…

అయితే ఇదేనెమో ఆ సొరంగానికి ఏకైక మార్గం అని ఆకాష్ అంటాడు… 


నిజమే అత్యద్బుతమైన నైపుణ్యం తో ఈ సొరంగ మార్గాన్ని రూపొందించినట్లు తెలుస్తోంది.. ఆ రాయిని చూస్తుంటే ఈ భూమికి సంబంధించినది కాదనిపిస్తుంది .. నాకు తెలిసి ఆ రాయి అంతరిక్షానికి చెందినదై వుంటుంది.. చూసావా ఆ రాయి మళ్ళి యదాస్థానానికి వచ్చి ఆకాశానికి ఎలా స్పందిస్తోందో.. అని అంటాడు మోహన్.. 

ఇప్పుడు ఇక్కడకు వచ్చిన వారు ఇద్దరూ ఎవరు ?? 

ఆ మూటలు ఏంటి ? 

అసలు కింద ఏముంది ?? 

ఏదో రహస్యం దాగుంది ఇక్కడ... అని ఇద్దరూ ఆ పొదలమాటునే నిలబడి మాట్లాడుకుంటూ వుండగా మళ్ళి ఆ రాయి ముడుచుకుంటున్న శబ్దం వినిపిస్తుంది.. 

ఇందాక వచ్చిన ఆ ఇద్దరూ ఖాళీ చేతులతో బయటకు వచ్చారు.. పడవ దగ్గరకు వెళ్లి తిరిగి వెళ్ళిపోయారు.. వాళ్ళు వెళ్ళిన చాలా సేపటి తరువాత మోహన్, ఆకాష్ ఇద్దరూ అక్కడనుంచి ఆ రాయి దగ్గరకు వెళ్లి నిలబడ్డారు ... 

మనకు మంట కావాలి.. మంట ఉంటేనే లోపలకు వెళ్ళగలం .. అదేంటో కనుక్కోగలం.. 

ఇక ఆలస్యం చెయ్యకుండా మనం ఉంటున్న స్థావరానికి చాలా వేగంగా వెళ్ళాలి అనుకోని బయలుదేరుతారు.. .. అక్కడ అందరూ ప్రశాంతంగా నిద్రపోతూ వున్నారు.. చాలా నిశబ్దంగా వుంది .. మండుతున్న మంట చిట పట, పెళ పెళ మనే శబ్దం మాత్రమే వినిపిస్తుంది.. దగ్గరకు వెళ్లి ఓ కాగడ తయారు చేసి.. వేగంగా మళ్ళి ఆ రాయి దగ్గరకు వెళ్ళారు.... అప్పటికే తెల్లారిపోతోంది.. 

మళ్ళి ఇక్కడ ఏముందో తెలుసుకొని.. నౌక వచ్చే సమయానికి అందరితో కలిసి వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు.. 

అనుకున్నట్లే ఆ కాగడ వెలిగించి లోపలకు వెళ్తారు.. 


లోపల అంతా అక్కడక్కడా చిన్న చిన్న లాంతర్లు వెలుగుతూ ఆ ప్రదేశమంతా మసక మసక గా వుంది.. విపరీతమైన దుర్వాసన వస్తోంది.. నేల అడుగు భాగం అంతా కొంచం తడి తడిగా అక్కడక్కడా బురద తో చూసేందుకు ఓ కారాగారం లా వుంది.. భయానకంగా వుంది.. మెల్లిగా కదులుతూ చుట్టూరా చూస్తూ ఏవైపు నుంచి ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని భయంతో అడుగులేస్తూ వుండగా.. 

కొంత దూరం నుంచి ఓ భయంకర రోదన వినిపించసాగింది.. ఆ వైపుగా వెళ్లి చూడాలని ఇద్దరూ అనుకోని ముందుకు కదలసాగారు.. ఓ ఇరవై అడుగులు ముందుకు వెళ్ళగా ఇందాక చూసిన ఆ రెండు మూటల తాలూకు చుట్టిన గుడ్డలు అక్కడ పడివున్నాయి.. ఆ గుడ్డలు నిండా చీమునెత్తురుల వంటి మరకలు అంటి వున్నాయి.. వాటి నుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేక అక్కడనుంచి వేగంగా ముందుకు కదిలారు.. ఎదురుగా కుడిప్రక్కకు తిరగాల్సిన మలుపు వుండగా.. ఎడమప్రక్క మూలన జారబడి కూర్చున్న ఓ అస్థిపంజరం కనిపించింది.. అంతే ఇక ఇద్దరికీ అడుగులు ముందుకు కదలలేదు.. 


అలా జారబడి కూర్చునే ఎలా అస్థిపంజరంగా మారిందో ?? అని ఆలోచించసాగారు.. 

ఒకటి ఆ మనిషికి కదలలేనంత అతి తీవ్రమైన గాయాలు కలిగి అలానే కూర్చొని .. చివరికి ప్రాణాలు వదిలేసి అయినా ఉండాలి.. 

లేదా ఎవరన్నా ఆ అస్థిపంజరాన్ని తీసుకొచ్చి అలా ఎర్పాటు అయినా చేసుండాలి … అని ఇద్దరూ మాట్లాడుకుంటూ మళ్ళి మెల్లిగా ఆ అస్థిపంజరాన్ని దాటుకుంటూ ముందుకు కదలసాగారు.. 

ఈ లోపు బాగా తెల్లారిపోతోంది.. 

ప్రసన్నకుమార్ భాటియా లేచి చూడగా ఆకాష్ కనపడక పోవడంతో … కంగారుపడుతూ మిగిలిన ఇద్దరి కుమారులతో కలిసి వెతకసాగాడు … ఈలోగా పెద్ద శబ్దం చేసుకుంటూ నౌక రానే వచ్చింది..

హెలికాఫ్టర్ నుంచి దిగిన అతనితో మీరు అందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపొండి.. నేను నా మిగిలిన కుమారులు కలిసి ఆకాష్ ని కనిపెట్టి వస్తాము.. నాకు ఒక సహాయం చెయ్యండి.. మళ్ళి ఈ దీవి దగ్గరకు మరో నౌక ఎప్పుడు వస్తుందో కొంచం కనుక్కొని చెప్పండి… ఆ నౌకలో మేము వెళ్ళిపోతాం అని ప్రసన్నకుమార్ భాటియా చెప్పగానే .. 

తప్పకుండా చెప్తాను అంటూ.. తన శాటిలైట్ ఫోన్ తీసి కనుక్కుంటాడు..

రేపు సరిగ్గా ఇదే సమయానికి మరో నౌక ఇటువైపుగా వెల్లబోతోందని మీకోసం కొన్ని నిమిషాలు ఈ దీవి దగ్గర ఆగుతుందని చెప్తాడు.. 

మీ సహాయానికి సర్వదా కృతజ్ఞున్ని అని ఆ హెలికాఫ్టర్ వ్యక్తిని ఆలింగనం చేసుకొని అక్కడనుంచి ఆకాష్ కోసం బయలుదేరుతారు.. 

అక్కడ లోపల వున్న ఆకాష్, మోహన్ లు కుడిప్రక్కకు తిరగగానే ఆ రోదన చాలా దగ్గరగా వినపడసాగింది .. 

ఊపిరి గట్టిగా పీల్చుకుంటూ అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడిచారు.. 

దూరాన ఓ వికృత ఆకారం కాళ్ళు జాపుకొని కూర్చుని వెక్కి వెక్కి ఏడుస్తూ వుంది.. 

ఆ రూపాన్ని చూసిన ఇద్దరికీ చమటలు పట్టాయి.. 

ఆ వికృత రూపం వెలుగులో వుండటం చేత వీళ్ళిద్దరికీ స్పష్టంగా కనిపిస్తోంది.. వీళ్ళు చీకట్లో వుండటం చేత కొంతవరకు ప్రమాదం లేదు అనుకోని అక్కడే నిలబడి పరిశీలిస్తూ వున్నారు.. 

తన కాళ్ళపై ఓ చిన్న అదే ఆకారం కల మరో రూపం పడివుంది.. దాన్ని పట్టుకొని ఆ వికృత జీవి రోదిస్తోంది.. మనిషిలానే వుంది.. కాని మనిషి కాదు.. 

తన శరీరం అంతా కొరడా తగిలిన గుర్తులతో… చర్మం మొత్తం చిట్లి పోయి వుంది.. ఎక్కడా కూడా కొంచం కూడా ఖాళీ లేదు.. రక్తం కారుతూనే వుంది.. 

ఆ దేహాన్ని చూస్తుంటే ఓ ఆడవారి దేహం లా వుంది.. విచిత్రం ఏంటంటే ఆమె చాలా బాధగా ఏడుస్తుంది …. కాని కళ్ళనుంచి ఒక్క చుక్క నీరు కూడా రావట్లేదు.. 

అది చూసి ఆ ఇద్దరికీ ఏమి అర్ధం కాని అయోమయ పరిస్థితిలో వుండగా.. 

వారి ఇద్దరి వెనుక మెడపై ఎవరో ఊపిరి తగులుతున్నట్లుగా వారికి అనిపిస్తుంది.. ఇక వారికి అర్ధం అయిపోయింది.. 

వారి వెనుక ఎవరో వున్నారని.. 

ఒక్కసారిగా దేహం అంతా వణుకుతోంది… 

చేతులో కూడా ఎలాంటి ఆయుధం లేదు ప్రాణాలను కాపాడుకునేందుకు .. 

ఏమి చెయ్యాలో తోచని పరిస్థితి లో వారు వుండగా.. 

వారి వెనుకగా వచ్చి ముందు నిలబడింది మరో విచిత్ర జీవి… ఆకాష్ వాళ్ళ స్థావరం దగ్గర చూసింది ఈ రూపాన్నే… ఇద్దరూ వెంబడించి ఇక్కడదాకా వచ్చింది కూడా ఈ జీవికోసమే.. అలాంటిది ఆ జీవే ఎదురుగా వుంది.. కాళ్ళు, చేతులు ఆడట్లేదు.. అలానే ఇద్దరూ నిలబడిపోయారు.. 

ఆకాష్ వెనక్కి పరుగెడదాం అని మోహన్ కి సైగ చెయ్యగా…. మోహన్ వద్దు అని సైగ చేస్తాడు.. 

అందుకుగల కారణం ఆ జీవి కళ్ళల్లో ఆవేదన కనిపిస్తుంది… వారికి హాని చెయ్యాలనే భావాలు అస్సలు కనిపించలేదు మోహన్ కి .. 
మోహన్ ఆ జీవికి దగ్గరగా వెళ్ళి మాట్లాడటానికి ప్రయత్నిస్తాడు…

లోపల కొంచం భయపడుతూనే ..

ఎవరు నువ్వు ??

ఎందుకు మమ్మల్ని వెంబడించావు ??

అసలు ఇక్కడేం జరుగుతోంది ??

ఈ గాయలేంటి ?? ఈ సొరంగం ఏంటి ?? 

ఈ ప్రశ్నలు అన్నీ చాలా నెమ్మదిగా అడుగుతాడు.. 

ఆ వికృత రూపం కాసేపు మౌనంగా వుండి బాధపడి తరువాత సైగలు ద్వారా ఏదో చెప్పాలని చూస్తోంది.. తన చేతి చూపుడు వేలును మోహన్, ఆకాష్ వైపు చూపిస్తూ తనవైపు కూడా చూపించుకుంటుంది .. 

వెనక వున్న ఆకాష్ ముందుకు వచ్చి అదేం చెప్తుంది ?? అని అడుగుతాడు మోహన్ ని .. 

మనవైపు, తనవైపు వేలు చూపిస్తుంది .. దాని అర్ధం తనూ మనలానే మనిషే అని నాకు అనిపిస్తుంది.. 

నువ్వు మాలానే మనిషివేనా ?? అని ప్రశ్నిస్తాడు మోహన్.. 

అవును అన్నట్లు తల ఊపుతుంది.. 

మరెందుకు ఇలా అయిపోయావ్ .. ?? 

అసలేం జరిగింది.. ??

అక్కడ ఏడుస్తున్న వారు ఎవరు ?? అనగానే .. 

తల్లి, బిడ్డ అని చెప్పడానికి చేతులతో కొన్ని సైగలు చేసింది.. 

అది వినగానే వారి హృదయం కదిలిపోయింది.. 

నేను కూడా స్త్రీ నే అన్నట్లుగా తన దేహాన్ని దాచుకోవడం చూసి వారి ఇద్దరికీ కళ్ళల్లో నీరు ప్రవాహ ధారలై ప్రవహిస్తాయి .… 

ఇద్దరూ బాధపడుతూ వుండగా.. 

బాగా నగిలి పోయి వున్న ఓ దీవి యొక్క నమూనా చిత్రాన్ని మోహన్ కి అందిస్తుంది.. 

ఆకాష్ అది చూడగానే ఇప్పుడు మేము వెళ్ళబోతున్న దీవి ఇదే అని అంటాడు… 

అయితే ఆ దీవిలో కొన్ని అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నమాట అని మోహన్ అంటాడు.. 

నువ్వు మాట్లాడలేవా ? అని అడుగగా.. 

లేను అన్నట్లు తల ఊపుతుంది.. 

స్త్రీలను మాత్రమే ఎంచుకొని వారు అక్కడ ఏదో చేస్తున్నారు.. అదేంటో మనం కనిపెట్టాలి అని మోహన్ అంటాడు.. 

తప్పకుండా నేను మీకు సహాయం చేస్తాను.. వీళ్ళ పరిస్థ్తితి చూస్తుంటే గుండె పగిలిపోతోంది.. .. 

వీళ్ళకు ఇలాంటి పరిస్థితి కల్పించిన ఏ ఒక్కరినీ వదలకూడదు. అని ఆకాష్ అంటాడు.. 

కాని మనం ఇద్దరమే ఇది చెయ్యలేము .. 

ఎందుకంటె ఇంతలా వారు చెయ్యగలుగుతున్నారంటే అక్కడవున్న వారి సంఖ్య అధికంగా ఉండొచ్చు.. ప్రతీ అడుగు జాగ్రత్తగా వెయ్యాలి.. లేకుంటే మన ప్రాణానికే ప్రమాదం అని అంటాడు మోహన్… 

సరే ఏం చేద్దాం చెప్పండి … 

ముందు మనం మన నౌకలో అక్కడకు వెళ్లి .. రహస్యంగా అక్కడేం జరుగుతోందో తెలుసుకొని అప్పుడు ఆలోచిద్దాం అని చెప్తాడు మోహన్.. 

ఇక ఇప్పటికే నౌక వచ్చి వుంటుంది…. మనం వెంటనే వెళ్ళాలి అని అనుకోని… 

మేము మళ్ళి తప్పకుండా ఇక్కడకు వచ్చి మిమ్మల్ని అందరినీ మాతో తీసుకువెళ్తాం .. మా ఇద్దరినీ నమ్మండి.. అని మాట ఇచ్చి … 

అక్కడనుంచి నేరుగా ఆ ఊదారంగు గల ప్రవేశ మార్గం దగ్గరకు వచ్చి కాగడా వెలిగించి ఆ రాయి దగ్గరగా పెడతారు.. ఆ రాయిలో ఎలాంటి చలనం లేదు.. 

ఇదేంటి ఈ రాయి ముడుచుకొని దారి ఇవ్వట్లేదు.. ఇప్పుడెలా ? 

ఇందాక వారు ఇలానే కదా బయటకు వచ్చారు .. ఇప్పుడేమైంది ? అని అనుకుంటూ వుండగా.. 

వెనుకనే వచ్చిన ఆ వింత జీవి సైగలతో చెప్తుంది ..

To be continued …

Written by : BOBBY

7 comments:

  1. Oopiri biga pettukuni chadivanu nani garu amavutundooo ani...super andi akkade undi chustunna feel......

    ReplyDelete
  2. Nenu kuda em jarugutunda ane bhayam tho ne chadivanu.....exiting ga undi....rodistunnadi talli bidda ante badha kaligindi....aadavarine ela edo chestunnaru ante meru e story dwara edo sandesam estarani anukuntuNna.....tirigi velle margam lo rayi yenduku teruchukovatledo telusu kotaniki repati varaku yeduruchudalsinde na......

    ReplyDelete
  3. నేను స్త్రీ మూర్తిని అని చెప్పేటందుకు..దేహాన్ని దాచుకోవడం లోనే తెలిసి పోతుంది..స్త్రీ మూర్తి అని...హ్యట్సాఫ్..నానిగారు..

    మనుసు లోతునుండి గ్రహిస్తే కాని అంతటి వాక్యం.రాదు ఎవరికి...

    ఈ ఒక్క పదానికే చాలు అర్తంచేసుకునే వాడు ఉంటే నీకు జీవితాంతం అబిమానిలా నిలిచి పోతాడు...
    నీ ఎదురుగ ఉంటే హగ్ చేసుకునేవాడిని..చాలా రోజుల తరువాత ఒక పవిత్ర వాక్యం మీ నుండి విన్నాను..ఈ వాక్యంలొ మీకు ఎమున్నదిలే అనిపించినా..నాకు మాత్రం దాని అంతరార్తం చాలా పవిత్రతగా అనిపిస్తుంది..

    Thank u నాని గారు..
    ఇలాంటి వాక్యాలు మీనుండి ఇంకా వినాలని ఉంది...

    ReplyDelete
  4. Excellent... still suspense.. waiting for next part..

    ReplyDelete