Sunday, October 2, 2016

నేటి ప్రజాస్వామ్యం ..



రోడ్డు మీద ఒక పక్కన ఒక చిన్న మామిడి చెట్టు పెరుగుతూ వుంది... అందరూ దాన్ని మామిడి చెట్టు అని తెలుసుకోకుండానే, పట్టించుకోకుండానే దాన్ని పక్కనే నడుస్తూ తిరుగుతూ వున్నారు... మురికి నీరు పోసేవారు, వ్యర్ధ పదార్ధాలను వేసే వారు వాళ్ళపని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు... తీగలకు అడ్డుగా వుందని సగంచెట్టు నరికే వారు కొందరు.... ఇలా రక రకాలుగా ఆ చెట్టు ఎన్నో బాధలను అనుభవిస్తూ, సహిస్తూ వస్తున్నది .. కాని ఎవ్వరూ తనని గుర్తించట్లేదని బాదపడుతూ వుంది... ఇంతలో ఆ చెట్టు కొంచం వయసుకు వచ్చింది దానికి తోడు వేసవి కాలం వస్తుండడంతో కొద్ది కొద్దిగా పూత రావటం మొదలుపెట్టింది... అతితక్కువ వ్యవధిలోనే పిందెలు వచ్చి అవి పెరుగుతున్నాయి... ఆ చెట్టు చాలా సంతోషంగా వుంది... మొదటిసారిగా తను కాపుకు వచ్చింది కాబట్టి... మామిడి కాయలు కొద్దిగా పెరిగి గుత్తులు గుత్తులుగా చూడటానికి చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి ... ఒకరోజు ఉదయాన్నే లేత సూర్యుని కిరణాలు వెలుగులు ఆ మామిడి కాయల మీద పడి మిరుమిట్లు గొలుపుతూ వుండగా అటువైపు వెళ్తున్న కొందరి ఆకతాయుల కళ్ళు ఆ చెట్టుమీద పడ్డాయి... 

ఇంకేముంది ఇల్లు పీకి పందిర వేసినట్లు పిందే, కాయా అనే బేధాలు లేకుండా అన్నీ కోసి పారేసారు... అది చూసి అక్కడే నివాసం ఉంటున్న ఒక పెద్దాయన వాళ్ళను తిట్టి తరిమేసాడు... తరువాత ఆ పెద్దాయన ఒక దోటి తీసుకువచ్చి కొన్ని కాయలు కోసుకుపోయాడు... అలా ఎంతోమంది ఒక్క కాయని కూడా పండనీయ కుండా ఒకరి తరువాత ఒకరు లా వచ్చి మొత్తం కాయలను కోసుకుపోయారు... ఇప్పుడు ఆ చెట్టు నా పరిస్థితి ఇంతకుముందే బాగుంది అని అనుకుంటుంది.... 

ఇదంతా విన్న తరువాత మీకు ఒక విషయం అర్ధం అయ్యి వుంటుంది.. ఇక్కడ చెట్టుగా చెప్పబడినది ఆంధ్రా ప్రజలు, మనుషులుగా చెప్పబడినవారు ప్రస్తుతకేంద్రం, మామిడి కాయలుగా చెప్పబడినవి మనకు మంజూరు కాబడే నిధులు.... ఎలక్షన్ల ముందువరకు ప్రగల్భాలు పలికినవారు ప్రస్తుతం మౌనంవహిస్తున్నారు.. ఆమౌనాన్ని చెరపాలంటే ప్రజలే పెదవులు విప్పాలి.. ఇంటికి ఒక్కడు చొప్పున కదిలితే పనైపోతుంది.. 

ఇది ఒక్కరిమీద చెప్పబడింది కానే కాదు... ప్రస్తుతం మన ప్రజాస్వామ్యంలో జరిగినా, జరుగుతున్న, పరిస్థితులు...

Bobby Nani

No comments:

Post a Comment