ఎన్నో రోజుల నిరీక్షణ అనంతరం ఇవాళ మీ ముందుకు వచ్చింది నేను రాసిన ఈ పాట..
క్రింద లింక్ ఓపెన్ చేస్తే మీరు చూడొచ్చు..
మీ ఆశీర్వాదములే నా కలానికి జీవం,
నా కవనానికి అందం..!!
మీ ఆదరాభిమానములు లేకుంటే, మీ ప్రోత్సాహం లేకుంటే అసలు నా ఈ ప్రస్థానం నాలుగు గోడల మధ్యనగల కావ్యాలకే పరిమితం అయ్యేది.. విహంగమై సుదూర తీరాలకు ఇంత ఎత్తున విహరించేది కాదు.. మీ ఇంటి బిడ్డగా నన్ను ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికి శిరస్సు వంచి కృతజ్ఞతలు..
అలానే నన్ను నమ్మి, నాపై నమ్మకముంచి నాచేత పట్టుబట్టి పాట రాయించిన నా సోదరుడు శ్రీ గుండేటి సాయి కృష్ణ గారు .. నిజంగా మీరు అద్బుతం చేసారు.. నిస్తేజంగా పడివున్న నా అక్షరాలకు పర్మల భావాలద్దారు.. మీకు సర్వదా కృతజ్ఞతలు __/\__.. మీతో ఇంకా ఇంకా కలిసి పని చెయ్యాలని వుంది..
ఇక మీ అభిప్రాయాల కోసం వేయి కన్నులతో, సహస్ర కరములతో వేచి చూస్తూ ఉంటాను..
మా ఈ “సిన్ని” ని ఆదరించండి.. అలానే మల్లీశ్వరిక్రియేషన్స్ చానల్ వారిని ప్రోత్సహించండి.. మీ ముందుకు మరిన్ని పాటలను, చిత్రాలను ముందు ముందు తీసుకు రాబోతున్నారు..
No comments:
Post a Comment