అతడో
పరంజ్యోతిస్వరూపి
అతడి జీవితం
ఔచిత్యదీపము
అతడి చూపులు
సుధా విశుద్ధములు..!!
మదపుటేనుగు వంటి బలమైన దేహం
త్రిశూలమువంటి బాహువులు
బల్లెములవంటి పొడవాటి కరములు
చక్రమువంటి కరతలములు
షట్కోణము
వంటి ఖటినమైన ఛాతి
సూర్య చంద్ర నేత్రాలతో
పుష్కర
వదనముతో
నిర్మలంగా
కనపడే
నిశ్శబ్ద
ప్రళయం తాను..!!
తన కోపం
సముద్ర మహా భీకరఘోష
తన మౌనం
అనంత శూన్యా కాశం
తన
సంతోషం తళుక్కున మెరిసే ఇంద్రచాపం
తన కన్నీళ్ళు
కనిపించని కడలి కెరటాలు..!!
అందుకే
అతడి కన్నీళ్ళు ఎవరికీ అక్కర్లేదు..
అతనికో మనసు ఉందన్న విషయాన్ని
ఏనాడో మర్చిపోయిందీ లోకం...!
దగ్గరకొచ్చాక పరిమళించే తన
వ్యక్తిత్వం అంటే అందరికీ లోకువే..!
అందరికీ అన్ని ఇచ్చి అర్ధం చేసుకునే
అతని అంతరంగం ఎవ్వరికీ అర్ధం కాని ఓ
చదరంగం..!!
యుద్ధం తనకు కొత్త కాదు
తన ఇంటికి తానె ఓ సైనికుడు
బాధించే ఏ శరమైన ముందు
తన శరీరాన్ని చీల్చాల్సిందే..!
గాయాలు తనకు కొత్త కాదు
మనసులో బ్రద్దలయ్యే వే వేల
అగ్నిపర్వతాలను ఏక కాలంలో
ఓర్చిన మొనగాడు..!
ఇటు చావనూ లేడు
అటు బ్రతకనూ లేడు
కాలానికి వ్రేళ్ళాడగట్టిన
గడియారపు ముళ్ళు అతను..!!
అందుకే .. అతడో శిఖరం..!!
Written by: Aniboyina Bobby
No comments:
Post a Comment