Thursday, August 4, 2016

అడుగంటిపోతున్నాయి మానవతా విలువలు..


గుడిలోన మూగబోయిన బొమ్మ మెడలో,
మూడు మణుల పచ్చలగల హారం.. !!
ఎండవానల బండబారిన శ్రామికుడి ఇంట్లో,
మూడుపూటల తిండిలేని బ్రతుకుభారం ....!!
గుడిలోన రాతి బొమ్మకు
తడవ తడవకు నూతన వాస్త్రాలంకర...
గుడిబయట బిచ్చగత్తే,
మాన సంరక్షణకు మూరెడు బట్ట కరువాయే.. ..!!
జగద్రక్షకుని ధర్మ హుండీకి,
సాక్షాత్ పోలీసులే రక్ష దేవాలయంలో....
రక్షణ కోరిన ఆడదాని శీలానికి,
“శ్రీ రాముడే” రక్ష పొలిసు స్టేషనులో .. !!!
అమృతం తాగిన దేవునికి
కమ్మని ఆవునేతి లడ్డూల నైవేద్యం... !!!
అంబలికి నోచని అనాధల కడుపుల్లో,
ఆకలి తిరుగలి వాయిద్యాలు....!!

పురోగమిస్తున్న నవ నాగరిక సమాజంలో..
పునర్దర్శన మిస్తున్నాయి మూఢనమ్మకాలు ..!!
అంతర్ధానమౌతున్నాయి దయాంతః కరణాలు ..
అడుగంటిపోతున్నాయి మానవతా విలువలు..

Bobby Nani

5 comments:

  1. రక్షణ కోరిన ఆడదాని శీలానికి,
    ....... రక్ష పొలిసు స్టేషనులో .. !!!

    ఈ వ్యాక్యానికి ద్వంద్వార్ధమేదైనా ఉందా ? అర్ధం కాలేదు చెపుతారా ?

    ReplyDelete
    Replies
    1. Akkada kooda aameku rakshana ledani mam

      Delete
    2. This comment has been removed by the author.

      Delete