ఈ మధ్య
కవిత
రాస్తున్నప్పుడు
మధ్యలో
నన్నొక
అనంతమైన
నిస్సహాయత
ఆవరిస్తోంది
ప్రపంచమంతా
నన్ను
ఒంటరిగా
వదిలేసినట్లనిపిస్తుంది
నా
పక్కన ఎవరూ లేకపోగా
నేను
రాస్తున్నదేంటో
నా
వెనగ్గా వచ్చి
తొంగి
చూసే ఆ అందమైన
కళ్ళు
కూడా నాతో లేవు
ఎంత
రాసినా
ఎన్ని
రాసినా
ఆనందం
కలగట్లేదు
ఒంటరితనం
ఓ మూలన కూర్చుని
ముళ్ళులా
పదే పదే గుచ్చుతోంది
విశాల
గదుల ఎత్తయిన మేడలో వున్నా
అంతటా
ముళ్ళ పొదలు పరిచినట్లు
వేసవి
ఎండకు పగిలిన బండలు
నిశ్శబ్దంగా
మారిన కీచురాళ్ళు
గాలినిండా
తెలియని ఓ భారం
ఇవన్నీ
నువ్వు చూస్తున్నావా ?
నడిరేయి
వానలోఒంటరిగా కూర్చుని
గొంతెత్తికి
అరుస్తున్న వీధికుక్క ఆర్తనాదం
నువ్వు
వింటున్నావా ?
కళ్ళు
తెరిచినా మూసినా
ఈ
ప్రపంచం ఒకేలా కనపడుతున్నప్పుడు
తెరుచుకున్న
కళ్ళతో నిద్రపోతూ
వింటున్న
చెవులతో కలలు కంటున్నాను..!!
నిద్ర, మెలకువ
రెండు
విభిన్నమైన ప్రపంచాలు
ప్రతీ
ఉదయం ఒక జన్మ లాంటిది
ప్రతీ
రాత్రి మరో ప్రపంచంలో
జీవించడానికి
మనిషి చేసే ప్రయాణం లాంటిది
కళ్ళు
లేని కాలంలో
కలం
లేని కవితలను రాసుకుంటున్నాను
జాలి
చూపించని కన్నీళ్లు
నా
కళ్ళలో కొన్ని కూడా మిగల్చలేదు
కవి
జీవితమే ఓ దుర్భరం..!!
Written by: Bobby Aniboyina
Mobile : 9032977985
No comments:
Post a Comment