మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Saturday, July 15, 2023
చలి తాపం...
అదో ఆషాడమాసపు
చవితి తొలి ఝాము
సంపెంగతోట మధ్యమున
ఓ చిరు కుటీరమున
ధవళాంబరి రాగము వింటూ
చిరువెన్నెలలో
తానో వికసించిన పద్మ మందారమై
కూర్చుని వుంది..!!
దూరాన
చంద్రిక కొలను మీంచి
వీచే పిల్లగాలి సంపెంగెను ముద్దాడి
తన జడలోని మల్లెల వాసన
తన దేహపు జవ్వాజి పరిమళము సమ్మిళితమై
ఓ కొత్త తన్మయత్వమును ప్రేరేపిస్తున్నది..!!
వదులుగా వున్న ఆ చీర కొంగు
పూర్ణ కలశ స్తన సంపదను
అత్యంత రమణీయంగా ఆగి ఆగి తడుముతోంది
గాలి తాకిడికి కుచ్చిళ్ళు వదులైయ్యాయేమో
ఎక్కడి సొంపులక్కడ సడలక నలగక వాడక
అప్పుడే విచ్చిన పూవనం లా వుంది..!!
బిగుతైన నెలవంక నడుము
వంగవన్నె లాంటి పల్చటి రవిక
నవనీత నడుముకు
హంసలు పొదిగిన ముత్యాల గొలుసు
తాంబూల సేవనముతో పండిన పెదవులు
నిజంగా తానో అందాల శైవాలము..!
చలి తాపం తగిలిందేమో..!
దేహం విరహంతో దహించిందేమో..!
పక్కన వున్న చంద్రిక కొలనుకు
అభ్యంగనముకై వెళ్ళింది
ఒక్కో వలువను నేల రాల్చింది
ఎంతటి కామోద్రేక స్థితిలో వున్నదో ఏమో..!
తన కోర్కెల కొలిమిలో సలసలమంటూ
ఆ కొలను కాగిపోయింది
కోర్కెలు నిండిన అచెంచల నేత్రములు
కసితో రంగరించిన ఘాటైన చూపులు
గారాలు పోయే మత్తిల్లు మూల్గులు
పిల్లగాలి స్పర్శ తాలూకు సుఖానికి
తనలోని నగ్నత్వాన్ని తానె దర్శించి సిగ్గుతో
మొగ్గలా ముడుచుకుంటోంది
తన కొమలభరిత అందాలను
ఒక్కొక్కటిగా తానే ఆస్వాదిస్తూ, ఆఘ్రాణిస్తూ
నిక్కబొడు కుఛమొనలకు
సంపెంగ తైలము మెదించుచూ,
ఉప్పొంగే తన నరాల పొంగును
నిశితంగా అనుభవిస్తూ,
తన రసఝరుల తనువొక కోలాటమై
తన నడుం మడతలపై
బాహుమూల జబ్బలపై
లోవన్నెల దారులపై
జారే నీటి చలమలు
మన్మధ తాపముతోడ
మర్మాంగపు అమృత ధారలై
పరుగిడు తన స్త్రీ తత్వమ్మున
ఆణువణువూ రసమయ భావనలే
రసరమ్య అనుభవాలే..!!
Written by : Aniboyina Bobby
Mobile: 9032977985
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment