SOCOTRA
-The Mysterious Island-
మునుపటి భాగాన్ని మనం ఒక్కసారి మననం చేసుకుందాం ...
కాలానికి అనుగుణంగా నడుచుకోవాలే కానీ.. దాన్ని మార్చాలని ప్రయత్నించకూడదు.. ప్రయత్నించలేము కూడానూ .. “ప్రియమైన వారిని విడిచి వెళ్ళడం అంటే కేవలం దేహాన్ని వారికి దూరం చెయ్యడమే.. జ్ఞాపకాలను కాదు”.. అంటుంది మత్స్యక..వారి ఇరువురి కన్నీరును తుడుస్తూ..!
తరువాత ఏంటో చూద్దాం పదండి..
24th Part
మీ ఇద్దరికీ కొన్ని బాధ్యతలు అప్పగించాలి .. మీరు స్వీకరిండానికి సిద్దంగా వున్నారా ?
అడుగుతుంది మత్స్యక..!
మీ మాట అంటే మాకెప్పుడూ ఆజ్ఞాపనమే..!!
దానికి ఎప్పుడూ కట్టుబడే వుంటాము.. అని అంటారు వాసుర, నక్షత్ లు..!
ముందుగా నక్షత్ .. నువ్వు చాలా ప్రత్యేకమైనవాడివి.. పుట్టుకతోనే నీకు ఈ ప్రత్యేకత వచ్చింది.. ఆ ప్రత్యేకత ఏంటి అంటే.. నీకు తెలియని విషయాన్ని కూడా నువ్వు చాలా గొప్పగా వివరించి చెప్పగలవు.. నీ బుద్దికి అది తెలియదు కానీ నీ జ్ఞానానికి మాత్రం అన్ని తెలుసు.. ఎప్పుడో ఎక్కడో చూసినట్లు, చదివినట్లు అనిపిస్తుంటుంది కానీ నిజానికి నువ్వు ఈ జన్మలో వాటిని చూసి, చదివి వుండవు..
బుద్దేమో ఇది తప్పు అని నీతో ఎప్పుడూ వాదిస్తుంటుంది.. ఎందుకంటె దానికి తెలియదు కాబట్టి..
నీ జ్ఞానం మాత్రం సంశయించకుండా చెప్పమని ప్రోత్సహిస్తుంటుంది.. కారణం దానికి అన్ని తెలుసు కాబట్టి..
దేవతల భాష బ్రహ్మలిపి నీకు తెలియకపోయినా స్వతహాగా నీలో ఆ జ్ఞానం వుంది.. అందుకే నేను ఒక్క అక్షరం నేర్పిస్తే నువ్వు దానికి సంబంధించిన మరికొన్ని అక్షరాలు చెప్పేవాడివి..
మనుషులకు తెలియకుండా ఎన్నో శతాబ్ధాల నుంచి నిగూఢముగా వస్తున్నటువంటి ఈ బ్రహ్మలిపిని ఈ నాల్గవ శతాబ్దంలోనే మనుషులకు నీ ద్వారా ఈ లిపి అనేది ఒకటి వుందని తెలుస్తుంది.. ఇదే శతాబ్దంలోనే నీ తరువాత ఇది కాలం చెల్లుతుంది.. ఈ బ్రహ్మలిపి ఒకటి ఉందన్న విషయాన్ని మనుషులకు తెలియజేసే గ్రంధకర్తవు నీవు అవుతావు .. నీ కళ్ళముందు జరిగిన, జరుగుతున్న ప్రతీ విషయాన్ని పేర్లుతో సహా నువ్వు బ్రహ్మలిపిలో ఓ గ్రంధాన్ని రాయాలి.. ఇదే నీకు నేను అప్పగించే బాధ్యత అంటుంది ఆత్మాశి (మత్స్యక).
నా జీవితానికి ముఖ్యమైనది ఈ గ్రంధమే అయితే తప్పకుండా ఈ గ్రంధాన్ని పూర్తిచేస్తాను.. అంటాడు నక్షత్..
ఇక వాసుర నువ్వు .. ఈ పాపను ఉత్తర దిశగా తీసుకెళ్ళి అరణ్యము, సముద్రము కలిసే చోటున నాకు తెలిసిన రహస్య స్థావరం ఒకటి వుంది.. అక్కడ తనని జాగ్రత్తగా పరిరక్షించాలి .. పరులు ఎవరైనా తనని చూస్తే తన ప్రాణానికే ప్రమాదం.. అని అంటుంది ఆత్మాశి (మత్స్యక).
మీరు చెప్పినట్లే చేస్తాను.. కానీ నేను నక్షత్ ఒకదగ్గర వుండమా ? అంటుంది వాసుర ..
రెండు దిక్కులు ఒకేచోట కలవడం మీరు చూసారా ?
మీరూ అంతే .. నక్షత్ పశ్చిమ దిక్కుకు వెళ్ళాలి.. అంటుంది ఆత్మాశి.. !!
వాసుర, నక్షత్ ఇద్దరు మౌనంగా తలదించి వుండిపోయారు.. ఇద్దరి కళ్ళలో కన్నీరు .. ఆ చంద్రిక కొలనులో బొట్లు బొట్లుగా రాలుతోంది..
ఏడవకండి .. మీ కన్నీరు చాలా పవిత్రమైనది, స్వచ్ఛమైనది.. పవిత్రమైన కన్నీరు చంద్రిక కొలనులో పడి కింద నున్న శ్వేతమయ మీనములకు తాకితే అవి ఆ వలయం నుంచి స్వేచ్ఛగా బయటకు వచ్చి తిరుగుతాయి.. వాటిని కనుక మనుషులు చూస్తే సముద్రాలను శాసించగలరు.. దానివల్ల ప్రపంచ వినాశనము కలుగుతుంది.. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి.. అంటుంది. ఆత్మాశి ..
బాధపడకండి … మీ ప్రేమ అజరామరం .. కానీ ఇది విధి.. మీ బాధ్యతలు తీరిపోయాక చివరి రోజుల్లో మీరు కలిసే ఉంటారు.. అంటుంది. ఆత్మాశి..!!
ఉపద్రవం అన్నారు .. అది ఎప్పుడు ? ఎలా రాబోతుంది ? అడుగుతారు వాసుర నక్షత్ లు
అవి నాలో రహస్యంగానే వుండాలి.. మీకు చెప్పలేను అని సమాధానమిస్తుంది ఆత్మాశి..!
కొన్ని రోజులు గడిచాయి...
ఓ వైశాఖ పౌర్ణమి రోజున నిండు వెన్నెలలో చంద్రిక కొలనులో జలకూనకు జన్మనిస్తుంది ఆత్మాశి ..
ఆ జలకూన జననానికి సంద్రం అంతా ఆనంద కెరటాలతో నిండిపోయింది.. జలచరాలన్నీ సంద్రం పై ఎగిరెగిరి గంతులేశాయి.. ప్రతీ పౌర్ణమికి ప్రకాశించే వెన్నెలకన్నా ఆ రోజు పదిరెట్లు ప్రకాశవంతంగా ఆ కొలను వెలిగిపోయింది…
తల్లి పొత్తిళ్ళలో ఓ రోజు కూడా గడవకముందే తన పాపను ఉత్తర దిక్కుకు తీసుకెళ్ళమని వాసుర కు చెప్తుంది ఆత్మాశి..
తాను చెప్పినట్లే మరుసటిరోజు ఓ ప్రాతఃకాల సమయంలో వాసుర ఆ జలకూనను తీసుకెళ్తూ ఓ ప్రశ్నను అడుగుతుంది..
మా వంద సంవత్సరముల వయస్సు మీకు ఒక్క సంవత్సరం తో సమానం కదా..నేను ముదుసలి అయినా కూడా ఈ పాప ఇలానే పొత్తిళ్ళలో వుంటే ఎలా.. ?? నా తరువాత తన బాధ్యత ఎవరిది ?? అని అడుగుతుంది వాసుర ..
మంచి ప్రశ్న ..
నేనే ఈ విషయం చెప్పాలనుకున్నాను..
తన జ్ఞానరంద్రం మూసి వేయబడి.. తనకు తానుగా స్వతహాగా నిర్ణయాలు తీసుకున్న రోజున తన శక్తి ఏంటో తనకు తెలుస్తుంది.. తన శక్తులను ఎప్పుడైతే తెలుసుకొని తన మనుగడ సాగిస్తుందో అప్పటివరకు తను మామూలు పిల్లలవలె ఉంటుంది .. వారిలా మాములుగానే ఎదుగుతుంది.. అందుచేత నువ్వు భయపడాల్సిన పనిలేదు.. జాగ్రత్తగా వెళ్లిరా అంటూ తన పాపను చివరిసారిగా చేతుల్లోకి తీసుకొని ముద్దులు కురిపిస్తుంది ఆత్మాశి…
ఇంత బాధలో కూడా ఆత్మాశి కళ్ళలో ఓ చుక్క కన్నీరు రాకపోవడాన్ని ఆశ్చర్యంగా చూస్తూ అక్కడ నుంచి పాపను తీసుకు వెళ్ళిపోయింది.. వాసుర..
ఎప్పుడూ కాంతివంతమైన ముఖముతో వుండే నక్షత్ అమాస చంద్రునిలా వెలవెలబోతున్నాడు.. తన నవ్వులన్నీ వాసుర పట్టుకెల్లిపోయిందనే బాధతో....
ఆ మరుసటిరోజునే నక్షత్ ప్రయాణం మొదలైంది.. తనని పశ్చిమ దిక్కున సముద్రం మధ్యలో వున్న సొకోట్ర అనే ప్రాంతానికి వెళ్ళమని ఇక్కడే తన గ్రంధాన్ని రాసి జాగ్రత్తగా భద్రపరచమని చెప్తుంది.. ఆత్మాశి..
To be continued …
Written by : BOBBY
No comments:
Post a Comment