Saturday, March 4, 2017

శశిభూషణుడు...


సదాశివుడు, సదానందుడు, శ్మశానవేశ్ముడు, శ్యామకంఠుడు, శశిభూషణుడు, శశిశేఖరుడు ఇలా ఒకటా రెండా .. ప్రేమతో ఎన్ని పేర్లుతో పిలిచినా కాదనక కదలివచ్చే ఆ భోలాశంకరునిపై రాయాలని చాలారోజులనుంచి కోరిక వుండేది.. మొన్న జరిగిన శివరాత్రి పర్వదినమున సంకల్పించాను .. కుదరలేదు.. మనసుకు పర్వదినముతో పనిలేదని ఈరోజు పోస్ట్ చేస్తున్నాను... 

శశిభూషణుడు... 
***************

గిరిజా రమణా చంద్రశేఖరా
హరహర మహాదేవ శంభో శంకర..!!
తాండవకేళీ లోలా శూలి
శంకర నటరాజ శివ నంది వాహనా..!!
ఉప్పొంగు గంగనై హిమశైల శిఖరాగ్రముల పై 
నుంచి జర జరా నీ జటలోన ఉరికి ..
అభిషేక మొనర్చనా శశిభూషణా... !!
గిరిజా రమణీ వేషము తాల్చి.. 
ముగ్ధ మనోహర రూపము తోడ.. 
కాలి యందియలు ఘల్లుమని మ్రోయ..
రమణీయ లాస్యము చేయు నా ప్రభో..
నమక, చమక మంత్రములు పలుకుచూ, 
ఓంకార నిక్వాణము చెలగగ..
వేద నాదముల ననుసంధించుచూ ..
వేయి నామముల నిను కొల్వనా .. !!
విశ్వమయా సర్వేశా మహేశా, 
విబుధ లోక పరితోషిత వేషా ..
శాశ్విత శ్రీ సచ్చిదానంద రూప..
మునిమానస మంగళకర దీప.. 
కదలిరారా నా అంతరంగమను 
సదనము నందున నిలిచిపోవగ.. 
కదలిరార నను కరుణ జూడగ..
కలుషభంగ ఘన వృషభతరంగా..!!

Bobby Nani

No comments:

Post a Comment