Thursday, May 10, 2018

నిజంగా ఆత్మలు ఉన్నాయా ??



కొన్నిరోజుల క్రితం ఒకరు అడిగిన ప్రశ్న... 
నిజంగా ఆత్మలు ఉన్నాయా ??

దీనిమీద ఏదో ఒక వివరణ ఇవ్వడం సబబు కాదని కొంచం సమయం తీసుకొని వివరిస్తున్నాను..

ఇప్పుడు నేను చెప్పబోయే కొన్ని విషయాలు జరుగుతున్నవి, జరిగినవి... 
90% మంది దీన్ని నమ్మడానికే కష్టం... ఎందుకంటె ఊహాప్రపంచాన్ని భాహ్యప్రపంచం అనే బ్రమలో వున్నారు.. మనకు తెలియని అతీత శక్తి ఒకటి మనమధ్యనే వుందని మనం గ్రహించాలి.. ఇది చాలా తక్కువమంది మాత్రమే గ్రహించగలరు.. దీనిపై నేను నాకు తెలిసినంతలో కొందరిని అడిగి నిర్ధారించుకోవడం.. కొన్ని పుస్తకాలు చదవడం జరిగింది... 

ఇక విషయంలోకి వెళ్తే ...

కొందరిలో ఒక పనిని గాని, ఒక దృశ్యం కాని, లేదా ఒక ప్రదేశం కి వెళ్ళినప్పుడు కాని, జరిగినప్పుడు ఇది ఇంతకుముందే మనం చేసినట్లు అనిపిస్తుంటుంది... అప్పటివరకు మనకు గుర్తుకురానిది అది జరగగానే మనకు గుర్తుకువచ్చినట్లు మనం ఇదివరకే చూసేసినట్లు అనిపిస్తుంది... కొందరిలో అయితే వాళ్ళు మొదటిసాటి ఆ ప్రదేశంకు వెల్లివుంటారు కాని అక్కడ ఏమున్నాయో ఏముంటాయో కూడా చెప్పేస్తుంటారు.... 
మీలో ఎవరికైనా అలాంటి అనుభూతి కలిగిందా... ?

శ్రీకృష్ణ భగవానుడు, భగవద్గీతలో, ఆత్మ సిద్ధాంతాన్ని వివరించాడు. ఆత్మ రెండు విధాలు.

1. జీవాత్మ 
2. పరమాత్మ. 
విశ్వవ్యాప్తంగా ఉండే శక్తి 'పరమాత్మ'అని, జీవులలో ఉండే తన అంశను 'జీవాత్మ'అని వివరించాడు.
ఈ జీవాత్మే 'ఆత్మ. 
ఆత్మ నాశనం కానిది, శస్త్రం ఏదీ ఛేదించలేనిది, అగ్ని దహించలేనిది, నీరు తడపలేనిది, వాయువు ఆర్పలేనిది అని వివరించాడు. 
ఇంతేకాక "అహం బ్రహ్మస్మి" అయమాత్మ బహ్మ" అనే ఉపనిషద్ వాక్యాలు కూడా నీలో ఉన్న ఆత్మ భగవంతుని అంశే కనుక ఆవిషయాన్ని తెలుసుకోమని చెబుతున్నాయి.

ఆత్మ అనగా ప్రతీ మనిషి లోనూ ఉండే భగవంతుని అంశ. కనుక దానికి కుల, మత, వర్గ, రూప బేధాలు ఉండవు. దీనినే "అంతరాత్మ" అని అనవచ్చును. అంతర్లీనంగా ఉండి, మానవునికి సరి అయిన మార్గమును, న్యాయ, అన్యాయాలు, తప్పు, ఒప్పులను నిస్పక్షపాతంగా చెపుతూ, ఆ మానవునికి సన్మార్గాన్ని చూపుతూ ఉంటుంది. ఇది ఎప్పుడూ, మంచిని చెప్పే ఒక ఆత్మీయునిలాగ, ధర్మాన్ని తెలియజెప్పే ఒక గొప్ప యోగిలాగ, మంచి చెడులను సరిగ్గా నిర్ణయించి తెలియజెప్పే ఒక న్యాయమూర్తిలాగ ప్రవర్తిస్తుంది. మానవులందరిలోనూ ఈ అంతరాత్మ ఒకే విధంగా ఆలోచిస్తుంది. ఒక విషయాన్ని ఒకే విధంగా వివరిస్తుంది. అంతరాత్మ విషయంలో మానవులలో ఏవిధమైన తేడాలూ లేవు. ఎందుకంటే ఇది ఆ పరమాత్ముని అంశే కనుక.ఆయన ఒక్కడే కనుక. ఆయన నుండి వేరుపడి, వివిధ రూపాలు కలిగిన శరీరాలలో ప్రవేసించి జీవనం సాగిస్తుంది కనుకనే ఎంత వీలయితే అంత తొందరగా ఆ భగవంతునిలో లీనం కావాలని తాపత్రయ పడుతూ ఉంటుంది. ఆత్మకు రూపం లేదు. అది ఒక దివ్య శక్తి . ఈ శక్తిని తెలుసుకోమనే గొప్ప గొప్ప మహాత్ములందరూ తమ బోధలలో చెప్పేది. 

ఇక్కడో ప్రశ్న మీకు రావచ్చు 

మరి మానవుల ఆలోచనావిధానం లోనూ, ఆచరణావిధానం లోనూ ఇన్ని తేడాలు ఎలా వచ్చాయి?

సమాధానం : సాధారణంగా మానవులు రూపంలోకానీ, చేష్టలలో కానీ,ఆలోచనా విధానంలోకానీ ఒకరితో ఒకరికి పోలికలు ఉండవు. ఎక్కడో అక్కడ చిన్న తేడా అయినా ఉంటుంది. కానీ విచిత్రంగా, అంతరాత్మ విషయంలో అందరూ ఒకేలాగ, ఒకే పోలికతో ఉంటారు. తేడా అల్లా ఎవరు ఎంత శాతం అంతరాత్మకు విలువ ఇస్తున్నారు? అన్నదాని మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడే మనుషులు ఒకరితో ఒకరికి పోలిక లేకుండా పోతుంది. ఈ పరిస్థితికి కారణం "మనస్సు". ఇది కూడా మనలో ఆత్మచేసే బోధకు సమాంతరంగా పనిచేస్తు ఉంటుంది. ఈ మనస్సు పరిస్థితులకు, కారణాలకు, ఇంద్రియాలకు, పురుషార్థాలకు, గుణాలకు లోబడి మనకు మార్గము చూపుతూ ఉంటుంది.ఈ మార్గం సమయాను సారంగా మారుతూ ఉంటుంది. ఈ మార్గమును ఎవరు, ఎంత శాతం వరకూ అనుసరిస్తారు? అన్న దానిమీద ఆధారపడి ఉంది.

మరి, ఆత్మ, దేనికి లోబడక , ఏ పరిస్థితులకూ, సమయానికీ కూడా లోబడకుండా ఎప్పుడూ న్యాయమార్గాన్నే చూపుతూ ఉంటుంది. మనుషులలో తేడాలు, ఈ రెండు మార్గాలలో దేనికి ఎంత విలువనిస్తారు... అన్న దానిమీద ఆధారపడి ఉంటాయి.

మరి మరో గొప్ప గ్రంధం ఖురాన్ లో ఏం చెప్పారో చుడండి.. 

రాత్రివేళ మీఆత్మలను స్వాధీనం చేసుకునేవాడు, పగటివేళ మీరుచేసే పనులు గమనించేవాడు దేవుడే.(6:60) 

మరణ సమయంలో ఆత్మలు స్వాధీనం చేసుకునేవాడు దేవుడే(39:41)

ఇంకో గొప్ప గ్రంధం బైబిల్ లో కూడా చుడండి.. 
ఆదికాండం 1:26-27 చెప్తుంది మానవ జాతి ప్రస్ఫుటముగ సృష్ఠి అంతటికన్న ప్రత్యేకమైన లక్షణాలు ఉన్నవి. మానవులు దేవునితో సంభంధం కలిగియుండుటకు సృష్ఠించబడ్డాము. ఎలా అంటే, దేవుడు మనలను పదార్థముతోను, అభౌతికముకాని భాగములతోను సృష్ఠించాడు. పదార్థము ఖచ్చితముగా స్పర్శనీయమైనది: భౌతికమైన శరీరము, ఎముకలు, అవయవములు, మొదలగునవి. మరియు ఒక వ్యక్తి జీవించినంతకాలము ఆ భౌతిక కాయముండును. అభౌతికమైనవి అన్నియు స్పర్శలేనివి: ప్రాణము, ఆత్మ, బుద్ది, చిత్తము, మనసాక్షి మొదలగునవి. ఇవన్నియు ఒక వ్యక్తి జీవించనంతకాలముకంటే అతీతముగానుండును.

కేవలము జీవుడు మరియు అత్మ అని సారాంశనివేదిక నిస్తుంది. మరేదో, జీవము, ప్రాణము, ఆత్మ, హృదయము, మనస్సాక్షి, మరియు మనస్సు ఇవన్నియు ఒకదానికొకటి సంభదించినవైయున్నవి.జీవుడు మరియు ఆత్మ , అయినప్పటికి, ప్రాధమికమైన అభౌతికమైన మానవులోని కన్పడే విషయాలు. అవి ఇతర విషయాలను కూడ ఇముడ్చుకున్నట్లు తెలిస్తుంది. ఈ మనస్సుతో, మాన్వతవము ద్విభాగము గా ( రెండుగా కోసినట్లయితే శరీరము/ జీవము/- ఆత్మ), లేక త్రిధావిభాగము ( మూడుగాకోసినట్లయితే శరీరము/ జీవము/ ఆత్మ). అది అహేతుకముగా వుండడం అశక్యమైనది. (కీర్తనలు 139:14).

మరి మన తత్వవేత్తల దృష్టిలోకూడా చుడండి.. 
పూర్వం కణాదుడనే తత్వవేత్త ఉండేవాడు. అతను ప్రతి పదార్థం అణువులతో నిర్మితమై ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు అణువులు విడిపోవడం వల్లే పదార్థం ముక్కలవుతుందని భౌతిక నిజాన్ని ఊహించాడు కానీ అతను కూడా భౌతికతకి వ్యతిరేకమైన ఆత్మని నమ్మేవాడు. ప్రతి పదార్థంలో ఆత్మ ఉంటుందని, పదార్థాన్ని కోసినప్పుడు ఆత్మ కూడా ముక్కలవుతుందని నమ్మేవాడు. గ్రీక్ తత్వవేత్త ఆరిస్టాటిల్ ఆత్మకి కూడా చావు ఉంటుందని నమ్మేవాడు. పదార్థం నశించినప్పుడు ఆత్మ కూడా నశిస్తుందని నమ్మేవాడు. ఆత్మని పదార్థం నుంచి వేరు చెయ్యలేము అని సూత్రీకరించాడు.

ఇలా మనం చాలా రకాలుగా ఆత్మ గురించి వింటున్నాం... కాని మరికొందరు ఏమంటున్నారో తెలుసుకుందాం...

ఆత్మ అనేది మనిషి దేహం నుంచి బయటకు వస్తూ, వెళ్తూ వుంటుంది. అది ఎప్పుడంటే మానవ దేహం పూర్తిగా అలసిపోయి.. నిద్రపోతున్న సమయంలోనే అది సాధ్యం అవుతుంది... 
బయటకు వచ్చింది మళ్ళి ఎలా అదే దేహంలోకి ప్రవేశిస్తుంది ?

దేహానికి, ఆత్మకు ఒక భంధం అనేది వుంటుంది... ఉదాహరణకు ఒక పక్షిని మనం పెంచుకుంటూ ఉంటాము... రోజు ఆహారం పెడుతూ ఉంటాము... అది ఎక్కడ తిరిగినా మళ్ళి మన ఇంటికి వచేస్తుంటుంది... అలా ఎందుకు వస్తుంది ? ఇంటిలో రక్షణ, ఆహారం వుంటుంది అనే భంధం ఆ పక్షికి ఏర్పడి వుంటుంది.. అందుకే అది ఎక్కడ తిరిగినా మళ్ళి తన ఇంటికి వచేస్తుంది.. ఈ మధ్యలో ఎవరన్న వేటగాడు పట్టుకుంటే అది ఇంక రాలేదు.. అలాగే వయస్సులో వున్న వారికి ఆ భంధం చాలా దృడంగా వుంటుంది... వయస్సు మళ్ళిన వారిలో ఈ భంధం చాలా తక్కువగా వుంటుంది... అందువల్ల వాళ్ళ ఆత్మ తిరిగి రాక దేహం నిర్జీవంగా పడివుంటుంది....

ఆత్మ విడిచిన దేహం ఒక ఖాళీ గిన్నె మాదిరిగా వుంటుంది... అంటే దీనిబట్టి ఖాళీ గిన్నెలో మనం ఏదైనా పోయవచ్చు అలా వేరే ఆత్మలు ఆ ఖాళీ గిన్నెలాంటి శరీరంలోకి ప్రవేశించడానికి అవకాశం వుంటుంది...

ఈ మధ్య ఒక ఇంగ్లీషు పత్రిక వారు ఒక డాక్యుమెంటరీ తీసారు అందులో యదార్ధ ఘటనలను ఆధారంగా చేసుకొని స్వయంగా వారినే అడిగి తెలుసుకున్న విషయాలను మనకు అందించారు.. ఇది చూసాక ఎందరో దిగ్బ్రాంతికి లోనైయ్యారు.. ముగ్గురు వ్యక్తులు చావుదాకా వెళ్లి వెనక్కు వచ్చిన అదృష్టవంతులు వారు.. ఇప్పుడు వారి గురించి తెలుసుకుందాం.. 

మొదటి వ్యక్తి.. 
నేను ఈ మధ్య కాలంలో చాలా అసౌకర్యంగా , చిరాకుగా, ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉండేవాడిని నాకు ఎవరో ఏదో ఆదేశం ఇస్తున్నట్లు వుండేది.. పలానా వారితో మాట్లాడకు, ఇలాంటి పనులు చెయ్యకు అని నాకు సందేశాలు ఇచ్చేవారు నేను వాటిని గుడ్డిగా అనుకరించే వాడిని.. నన్ను ఏదో శక్తి సమ్మోహితుడను చేసి నన్ను ఆడిస్తుందని మాత్రం నాకు అర్ధం అయింది.. కాని ఇది నిజమా అనే సందిగ్ధంలో గడిపే వాడినిచిన్న చిన్న సమస్యలకు కూడా చనిపోతే బాగుండు అని నన్ను ఎవరో వెన్నుతట్టి ప్రోత్సహించినట్లు అనిపించేది.. అలా ఒకరోజు ఇంకా ఎక్కువగా ప్రోత్సహించారు ఎవరో నువ్వు వెళ్లి చావు ఆలస్యం చెయ్యకు నువ్వు అనుకున్నది జరుగుతుంది ఇలాంటి మాటలతో ఎవరో అనేవారు మనం ఆలోచనా శక్తిని ఆ సమయంలో కోల్పోతాము అలా నేను ఒక ట్రైన్ కింద పడుకుందామని వెళ్లాను.. ట్రైన్ చాలా వేగంగా వస్తుంది.. నవ్వుతూ వున్న నాకు ఆ ట్రైన్ అరిచిన శబ్దానికి నన్ను నేను గ్రహించుకోగలిగాను.. చివరి నిమిషంలో తప్పించుకోవడం వల్ల నా శరీరం మొత్తం రెండు భాగాలుగా పడి నేను బయట పడగలిగాను.. కాని నేను జీవించి ఉన్నంతవరకు శవంతో సమానం.. 

ఇలా మిగిలిన వారు కూడా వారి భాదను పంచుకున్నారు.. కళ్ళలో నీళ్ళు తిరిగాయి.. దీన్నిబట్టి మనకేమర్ధమైంది .. కంటికి కనపడని అతీత శక్తి మన మధ్యనే వుంది.. అవి మనిషిని ఎన్నుకుంటాయి... ఎలా అంటే ఎవరైతే ఎప్పుడూ అసహనంతో ఉంటారో, ఎవరైతే ఎప్పుడూ ఒంటరితనాన్ని ఇష్టపడతారో, ఎవరికైతే ఈ లోకం మీద విరక్తి కలిగి జీవిస్తూ ఉంటారో అలాంటివాళ్ళను అవి ఎన్నుకుంటాయి.. ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తాయి.. దయచేసి మనుషులతో కలిసిమెలసి సంతోషంగా వుండండి.. రేపటి గురించి దిగులు చెందకుండా ఈ రోజు సంతోషం అనుభవించండి.. 

స్వస్తి... /\...

Written by : Bobby Nani
 

No comments:

Post a Comment