Monday, August 21, 2017

ఓ చిన్న ఆవేదనా పూరితమైన వ్యాసం..



ఒకానొకప్పటి నుంచి అనాదిగా కొనసాగుతున్న పితృసామ్య వ్యవస్థ మహిళలను శారీరకంగా, మానసికంగా బలహీనులుగా మార్చి లింగపరమైన అసమానతల సమాజంగా మార్చడం, మహిళలను సంభోగ వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా, వంటింటి కుందేలుగా, వరకట్నం తీసుకువచ్చేవారిగా మాత్రమే చూస్తూ వారిపై అజమాయిషీ చలాయించే పితృస్వామిక భావజాలం ఒకప్పుడు సమాజంలో బాగా పాతుకుపోయి ఉంది. భారతీయ సమాజంలో “ఆడది” అంటే చులకన భావం వ్యాపించి ఉంది. పురుషాధిక్య సమాజం మహిళను ఏమీ చేయలేని బలహీనురాలు, నిస్సహాయురాలిగా చిన్నచూపు చూస్తోంది. దీనిని ఇప్పటికి కూడా ఉగ్గుపాలతో కలిపి తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచుతున్నారు. భార్య, తల్లి, పక్కింటమ్మాయి అందరూ ఆడవాళ్ళే. వారిపై నేనేం చేసినా చెల్లుబాటు అవుతుందనే ధోరణి కొందరి మగవాళ్ళలో ఇప్పటికి కూడా కొనసాగుతూనే వుంది ... అలాంటి ధోరణి వల్లనే వారిని దాడులకు పురిగొల్పుతోంది. స్త్రీ అస్తిత్వాన్ని గుర్తించని పితృస్వామిక ఆధిపత్య ధోరణి మహిళలపై లైంగిక, భౌతిక దాడులకు కారణమవుతోంది.

మీరు అనొచ్చు ప్రస్తుతపు కాలంలో ఆడవాళ్ళు కూడా ఇలానే వున్నారని ...

ఒప్పుకుంటాను .. 

కొందరు ఆడవారు మోసగించేవారు, వ్యసనపరులు కూడా వున్నారని .. 
కారణం ఒకప్పటిలా వంటింటి కుందేళ్ళు గా వున్న వారు ఒక్కసారిగా స్వేఛ్చ, సమానత్వం తెలుసుకొని బయట ప్రపంచాన్ని చూసేసరికి కేవలం కొందరు మాత్రమే ఇలాంటి వ్యతిరేఖ కార్యకలాపాలకు, విచ్చలివిడి తనానికి అలవాటు పడుతున్నారు. వారి వలలో పడిన మగవారికి సైతం చుక్కలు చూపెడుతున్నారు...

ఇక్కడ మనం ఆలోచించాల్సింది స్త్రీ గొప్పా లేక పురుషుడు గొప్పా అని కాదు... మన ఆలోచనలు యెంత గొప్పగా వుండాలి... అవి పదిమందికి ఎలా శ్రేయస్కరంగా వుండాలి.., వాటివల్ల మనము, మనతోటి వారు, మన కుటుంబం, మన ప్రాంతం, మనదేశం బాగుపడేలా వుండాలన్నదే నా ముఖ్య ఉద్దేశం ... దయచేసి మీరు ఇక్కడ స్త్రీ , పురుషుల బాలా, బలాలను ప్రదర్శించే ఏర్పాట్లు చెయ్యకండి ... జరిగిన, జరుగుతున్న విషయాలను అందరికి గుర్తు చేసాను తప్ప మగవారిని వేలెత్తి చూపాలని, వారిని తక్కువ చేసి మాట్లాడాలని నా అభిమతం కాదు. నాకు ఎవ్వరైనా ఒక్కటే .. స్వ,పర బేధాలకు నా వద్ద చోటు లేదు.. ఒక అమ్మాయి రిక్వెస్ట్ పెట్టగానే సొంగ కారుతూ వెళ్లి యాడ్ చేసే మనస్తత్వం నాది కాదు ప్రొఫైల్ బాగుంటే తప్ప మగవారు అయినా, ఆడవారు అయినా ఒకేలా చూస్తాను ... ఈ విషయం నా లిస్టు లో వున్న మిత్రులకు అందరికి తెలుసు అని భావిస్తున్నాను ...
కొందరి మగవాళ్ళు గురించి చెప్తున్నాను ... 

ఇలాంటి వాళ్ళు ఈ లోకంలో చాలామందే వున్నారు. వీరు అలా ఉండబట్టే స్త్రీ లు కొందరైనా నిర్భయంగా తిరగగలుగుతున్నారు... ఒక అమ్మాయి చేతిలో జీవితాన్ని కోల్పోయి ... జీవితాంతం ఒంటరిగా మిగిలి ... ఏ తోడు లేకుండా ఆ అమ్మాయినే తలుచుకుంటూ ... జీవితాన్ని గడిపే మగవాళ్ళు ఎంతోమంది. వీళ్ళు జీవితం లో మరో అమ్మాయిని చూడలేరు, తాకలేరు ఇది మీకు తెలుసా ? 

ఒక అబ్బాయి చేతిలో శరీరాన్ని కోల్పోయి.... తలోచ్చుకొని ఏడ్చి...ఏడ్చి తోడు దొరకగానే ... ఆ తోడే ... నా దేవుడనే జీవితాన్ని గడిపే ఆడవాళ్లు .... ఎంతోమంది వున్నారు .... "మీ ఆడవాళ్ళ ఏడుపుకు ఓదార్పు దొరుకుతుంది కాని ఓ మగవాడి వేదనకు ఓదార్పు దొరకదు. ఎందుకంటె మగవాడు బయటపడాలని ఎప్పటికీ కోరుకోడు.. ఒకవేళ కోరుకుంటే తన సర్వస్వం అనుకున్న వారి దగ్గరే బయటపడుతాడు ... ఉదాహరణకు భార్య, ప్రేయసి .. తల్లి దగ్గర మాత్రం ఇలా ఎప్పటికి చెయ్యలేడు... 

కొందరు ఆడవారు కలలు కంటారు ఆ కలలోనే జీవిస్తారు.. మీకు ప్రేమ పరిచయం ఓ కలలా... మిగిలిపోతుంది. కాని నిజంగా ప్రేమించిన ఒక మగవాడికి మాత్రం అదే జీవితం అవుతుంది. ప్రేమని కోల్పోయి ఒంటరిగా మిగిలిన మగవాళ్లు కోకొల్లలు.. మగవారు అయినా, ఆడవారు అయినా వారిని చిన్నప్పటినుంచే క్రమమైన దారిలో పెట్టాల్సిన భాద్యత వారి తల్లి, తండ్రులది. మగవారిని ఒకలా చూస్తూ, ఆడవారికి హద్దులు గీస్తూ పెంచడం కాదు.... ఇద్దరికీ హద్దులు గీయండి. ఆడ మగ అనే భేదాలు లేవు. అందరూ సమానమే అని కేవలం అక్షర రూపంలోనే వున్నాయి. ఆచరణ రూపంలో చెయ్యాలని తప్పుని ప్రశ్నించే ఒక భారతీయ పౌరిడిగా అడుగుతున్నాను ... ఇది మనదేశం ఎవరో ఏదో చేస్తారని కాకుండా మనమే ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ...


స్వస్తి __/\__

Written by : Bobby Nani

No comments:

Post a Comment