నువ్వు రాయాలనుకుంటే రాసేయ్
ఎవరికోసమో నిన్ను నువ్వు నిర్భంధించుకోకు
ఒకరికోసమో, ఒకరిమీదనో నువ్వు రాయట్లేదు
నీకోసం నువ్వు రాస్తున్నావ్ ... వ్రాయి.. !!
నీకు తెలియకుండానే నీలో కవితాత్మ జనియించింది
దానిని గట్టిగా పట్టుకొని పదునుపెట్టు
దానికో సరికొత్త రూపం, ప్రాణం నువ్వే పొయ్యాలి..!
ఒక్కటి గుర్తుపెట్టుకో..!
కవిత్వం నీకు ఆకలి కావాలి
ఆ ఆకలి నీ శ్వాస ఆఖరు వరకు ఉండాలి
ఉదర బాధ ఒకడిది
నయన బాధ ఒకరిది
శ్రవణ బాధ ఒకడిది.. అయితే
నీది అక్షర బాధ..
పుంఖానుపుంఖాలుగా వ్రాసినా అది తీరేది కాదు
తరిగేది కాదు..!!
నీ
ప్రస్థానంలో ఎన్నో చూస్తావు
విమర్శలు,
పొగడ్తలు,
ఆరాధన,
ఆత్మీయత,
ఇలా ఎన్నో,
విమర్శ లో నిన్ను నువ్వు మార్చుకో,
పొగడ్తను చిరునవ్వుతో దూరంపెట్టు
అదొక్కసారి తలకెక్కితే నీ
అక్షరానికి నువ్వు దూరం అయినట్లే..!
ఆరాధనలో కన్నీటినీ,
ఆత్మీయతలో దగ్గరితనాన్ని చూడు..!!
లే
ఊరికే కూర్చుంటే
ఊరకుక్క కూడా నిన్ను చూసి మొరుగుద్ది
అక్షరాలతో ఘర్ఘించు
రేపటి
స్వర్ణోదయానికి నాంది పలుకు..!!
Written by: Bobby Nani
No comments:
Post a Comment