Friday, June 26, 2020

జీవితంలో కొన్ని క్షణాలు


జీవితంలో
కొన్ని క్షణాలు 
రాత్రిని రంపంపెట్టి కోసినట్లుగా 
వేకువ పొట్టులా రాలిపోతుంటాయి..!!

కళ్ళముందు కనిపించే 
రంగురంగుల ఇంద్రధనుస్సులన్నీ 
నిజమనే భ్రమలో బ్రతికేస్తుంటాము
మనం గిరిగీసుకున్న గీతే 
మన ప్రపంచాన్ని చిన్నది చేసేస్తుంటుంది
మనం ఎన్నో కోల్పోయేలా చేస్తుంది..

అయినా నా వద్ద ఏముంది కనుక 
ఇప్పుడు కొత్తగా కోల్పోవడానికి 
అమాస పున్నములు నా నేస్తాలే కదా 
ఎంత అందంగా ఉంటాయో అవి రెండూ
దేని అందం దానిదే.. 
దేని విశాలత్వం, విశృంఖలత్వం దానిదే..
కానీ నేనే అమాసలో పున్నమిని 
పున్నమిలో అమాసను వెతుక్కుంటుంటాను..!!

ఒక్కోసారి మనసు పసిదై పోతుంటుంది 
చిన్న సంతోషం పొరపాటున గాలికి కొట్టుకొచ్చి 
నాకెదురొస్తే చాలు గాలికి ఊగే గులాబీ అప్పుడే మొలిచిన 
ఆకును అడ్డుపెట్టుకున్నట్లు, 
సంతలో పీచుమిఠాయి చేతికందినట్లు
నాకు నేనే సంబరపడిపోతుంటాను..! అవన్నీ క్షణాలే..మరి!!
వెంటనే మరోవార్త నన్ను పాతాళానికి ఈడ్చుకెళ్ళి పడేస్తుంది..!!

నాపై 
పుడమికెంత కోపమో 
కొన్ని కన్నీటి చుక్కలను కూడా నన్ను దాచుకోనివ్వదు 
చెప్పుల్లేని పాదాలతో ఎండలో నడుస్తున్నా బాధ అనిపించదు 
ఇసుకలో ఇనుము కాలినట్లు పాదాలు బొబ్బలెక్కినా నొప్పి పుట్టదు 
కానీ ఇక్కడ అందరి దృష్టిలో నేనో ఇసుకలో మొలుస్తున్న గడ్డిపరకను అదే బాధ..!!

నేను ఒంటరిగా వున్నప్పుడు గాలి కూడా నన్ను పలకరించదు 
కనీసం నా జీవితపు గుహలోకి ఒక సూర్య కిరణమైన ప్రవేశించదు.
పదే పదే వినిపించే నా నిశ్శబ్ద తరంగాల మధ్య 
నా చుట్టూవున్న గులకరాళ్ళు పోగుచేసుకుంటూ ఉంటాను..
కానీ ఎక్కడికో హడావిడిగా పోతున్న పాదాలు 
నా గుండెల్ని నిర్లజ్జముగా తొక్కుకుంటూ వెళ్తాయి 
ఊపిరాడని ఉలిపిరి కాగితంలా ఇలా 
నా అక్షరాలు పారబోసుకుంటూ ఉంటాను..!!

Written by: Bobby Nani

రాబోయే రోజులు చాలా దారుణంగా ఉండబోతున్నాయి ...

రాబోయే రోజులు చాలా దారుణంగా ఉండబోతున్నాయి 
మిత్రులు ఎక్కడా ఇన్వెస్ట్మెంట్ లు చెయ్యకపోవడమే మంచిది.. 
ముఖ్యంగా డబ్బు రూపంలో మీ చేతిలో సిద్దంగా పెట్టుకోండి.. 
రేపు ఎలా వుండబోతోందో ఎవరూ ఊహించలేము.. అన్నిటికీ మనం సిద్దంగా ఉండాలి 
ఒక్కటి గుర్తుపెట్టుకోండి.. !!

“మీరు జాగ్రత్తగా ఉండండి .. మీతోటి వారిని కూడా జాగ్రత్తపరచండి”
ఇదే విషయం నేను నా చుట్టూ ఉన్నవారికి చెప్పి హెచ్చరిస్తూనే వుంటాను 
కానీ వారు నన్ను అతి జాగ్రత్త అంటూ నవ్వుతూ వెళ్ళిపోతున్నారు.. 
వారు నవ్వుతున్నారని నేను చెప్పకుండా ఉండలేను.. ఇది నా బాధ్యత
తన దాకా వస్తే కానీ తెలియదంటారు..వారి దాకా రాకూడదనే నా ఈ తాపత్రయం 
కానీ అలా నవ్వే వారి నోటి నుంచి ఒకే ఒక్క మాట వినాలని వుంది 
“నీ అతిజాగ్రత్త వల్లే నువ్వు నీ కుటుంబం ఈ రోజున బయట పడింది అని” 
ఇది వినడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు అనిపిస్తుంది.. 
మరణాల రేటు తక్కువ ఉందని భుజాలు ఎగరేస్తున్నారు.. 
చిన్న ఉదాహరణ చెప్తాను వినండి.. 
ఒక హాస్పిటల్ వెయ్యి మందిని చూడగలదు 
లక్షమంది వచ్చి పడితే ఆ వెయ్యి మందికి కూడా వైద్యం అందదు 
తాజాగా హైదరాబాదు లో జరిగిన ఒక ఘటన మరింత ఆందోళన కలిగించింది..!!

మందు వచ్చిందని రెచ్చిపోకు మిత్రమా 
ఆ మందు లో వున్న ఫార్ములా జపాన్ దేశంలోని వారు జలుబుకు వాడేది.. 
స్వల్పంగా ఉన్నవారికే అది తగ్గిస్తుందని పది పేజీల ఒక ఆర్టికల్ లో 
పెద్ద పెద్ద డాక్టర్లు సైతం హెచ్చరించి వున్నారు. 
మందే వచ్చింది టీకా కాదు..గుర్తుపెట్ట్టుకో.. !
నీ ఇంటికి రక్షణ నువ్వే.. అలాంటిది నీవల్లే నీ ఇంటికి ఆపద తెచ్చిపెట్టకు
నువ్వు బాగుంటేనే నీ కుటుంబం 
నీ చుట్టూ వున్న సమాజం బాగుంటుంది
అర్ధం చేసుకో.. కాస్త జాగ్రత్త వహించి జాగరూకతతో వ్యవహరించు..!!

Written by: Bobby Nani

Saturday, June 20, 2020

ఇది పూర్తిగా ఆవేశపూరితమైన శృంగార కావ్యము...

ముఖ్య గమనిక : స్త్రీలు ఇందుకు దూరంగా ఉండుట శ్రేయస్కరము.. 
ఇది పూర్తిగా ఆవేశపూరితమైన శృంగార కావ్యము.. ప్రబంధమును, ఉత్ప్రేక్షాలంకారములను జోడించి రాసాను.. చాలామందికి అర్ధం కాదు.. కాకూడదనే అలా రాసాను.. ఇది కేవలం నాకోసమే నేను రాసుకున్నది..ఇలాంటివి రాయకుండా ఉండిపోతే ఇక ఎప్పటికీ రాయలేను. సాధన కోసమే నాకు నేను రాసుకున్నాను అని విన్నవించుకుంటున్నాను.. ప్రబంధము అంటే చాలావరకు అంగాంగ వర్ణనలు ఉంటాయి.. అవి కొందరి ఊహకు కూడా అందని అభివర్ణనములు.. నాకు ఇది రాయడానికి పట్టిన సమయం అక్షరాల నాలుగు రోజులు.. ఒక్కో పదాన్ని కూర్చడానికి వేల సార్లు ఆలోచించాల్సి వస్తుంది.. ఒకే అర్ధంతో వున్న పదాలన్నీ ఒక్కోసారి కావ్యానికి అందాన్ని చేకూర్చవు.. అందం రావాలంటే రాసేవాడు నేర్పరి అయివుండాలి.. అంతటివాడిని అవ్వాలనే ఈ ఆశ ప్రయాస.. __/\__

నీ
అధర తాళపత్రాలపై లిఖిస్తున్నా
ఓ శృంగార కావ్యంబును.

అచెంచల కమలముకుళ మృద్వీపుల్లనగు సొంపును జూడ
రాజీవగంధి స్సురతపయసి యస్యా స్సౌరభవముల సొబగును జూడ
ధవళకుసుమా వాసిత త్రివళలలిత మధ్యా హంసవాణీ సు వేశినీ
పరిమళ మన్మంద హాసినీ విలాసిని.. చెమక చమకముల 
చంద్రకాంతి మయమగు ముఖస్యోభిత వదనమున జూడ
గాండీవమ్ముల పూబోణి కనుసోగలను జూడ 
సౌందర్య విలాస విభ్రమాది సౌశీల్యంబుల తోడ 
శృంగార లీలా వినోద విలాస లాలితమైన సమ్మోహన 
రూపిణీ, స్వరూపిణీ..!!

ఆ ముఖమును జూడ పోడిమి నిర్మల చంద్రకాంతుల తుల్యములు 
ఆ కాంతాధరంబును జూడ శోణఛాయా విలాసన చంచలములు 
స్నిగ్ధ త్రిభాగ ముండిత శిరశ్సిఖ హిమ ధవళోపవీతముల 
లాస్యానంద వాశినీ .. 
నిను ఏమని సముద్భూషించ ?
ప్రభాత వేళ లలితోద్యాన పరంపరా పిక,శుకాలాపములతో 
ప్రతిధ్వనించు నీ గంధర్వ కంఠ మాధుర్యంబులు 
మిన్నులతో రాయు సువర్ణ సౌధరాజములతో ప్రకాశించు విశ్వంకరములు
శృంగార నారీకేళ ఫల వృక్ష నివహములతో విరాజిల్లు దేహ శృంగారంగంబులు
చైత్రరథమును మించు మేను రమణీయోద్యానమ్ములు 
దివ్య ప్రబంధయుగాస్యలగు ముదితనితంబి నీజన చతుర విలాసోక్తులు
రమణీయ మధుర సుగంధపుటరటులతో, 
లేత చివురు పాదాల అందియల మ్రోగు 
ఘంటా నినాదముల పటపటాత్కార క్రేంకారములతో 
మేలిమి బిగి నిండు పూర్ణకలశ కుచాగ్రములతో, 
శంఖంబున పట్టి పూరించు నిక్కనీల్గు నేరేడుమచ్చికలతో,
విశాల నఖక్షతమౌ తీగ మందార పరిహాసకౌనుతో, 
నతనాభీయ పాతాళ లోతులతో కూర్పునట్టి ఆంగికాభినయముతో,
చతుర్విధ వర్ణ వరాసి కుచ్చిళ్లు పుడమిన రాల్చి 
ముడిలేని రవికను లాలిత్యముగా తెరలించి 
చోష్యలేహముతో నఖశిఖమున పట్టి అధర మర్ధనగావించి
భగభగమను భగమును మునిపంటి అధరమున అదిమిపెట్టి 
హస్త విన్యాసంబుల విశాల నడుమును ఏకబిగిన పట్టి 
చుంబన స్థానములతో నాట్యోపయోగాంగములు మీటుచూ
ఒరుపాదమ్మును పుడమిన నిల్పి 
మరుపాదమ్మును భుజమున నిల్పి 
తమక తమక చమకముల ఉష్ణ నిట్టూర్పులతో 
స్వేద వాహిని ఉత్తుంగతరంగ పరవళ్ళు చిందు తమక మూల్గులతో 
తకదిమిదిమితకమౌ ఎదురెత్తు నడుం నాట్యా విలాసాలతో
అచంచల ఆనంద స్వర్గ విహారపుటంచులలో తేలియాడు 
నశ్రాంతయోగాందూబద్ద మధుద్విషమన్మంథములై 
అవిశ్రాంత యుద్ధ సయ్యాటలలో ఒదిగి మమేకమౌ ఈ 
జన్మ ధన్యంబునే సఖి, 
చిత్రిణీ నా త్రిపాణీ మరోమారు 
ఊపిరాడని బిగి గాఢ పరిష్వంగములో 
రమించినా, క్రీడించినా కించిత్ అయినా లేదే 
తప్పు లేదే రమణి..!!

Written by: Bobby Nani

Saturday, June 13, 2020

నువ్వు రాయాలనుకుంటే రాసేయ్


నువ్వు రాయాలనుకుంటే రాసేయ్
ఎవరికోసమో నిన్ను నువ్వు నిర్భంధించుకోకు
ఒకరికోసమో, ఒకరిమీదనో నువ్వు రాయట్లేదు
నీకోసం నువ్వు రాస్తున్నావ్ ... వ్రాయి.. !!

నీకు తెలియకుండానే నీలో కవితాత్మ జనియించింది
దానిని గట్టిగా పట్టుకొని పదునుపెట్టు
దానికో సరికొత్త రూపం, ప్రాణం నువ్వే పొయ్యాలి..!

ఒక్కటి గుర్తుపెట్టుకో..!

కవిత్వం నీకు ఆకలి కావాలి
ఆ ఆకలి నీ శ్వాస ఆఖరు వరకు ఉండాలి
ఉదర బాధ ఒకడిది
నయన బాధ ఒకరిది
శ్రవణ బాధ ఒకడిది.. అయితే
నీది అక్షర బాధ..
పుంఖానుపుంఖాలుగా వ్రాసినా అది తీరేది కాదు
తరిగేది కాదు..!!

నీ
ప్రస్థానంలో ఎన్నో చూస్తావు
విమర్శలు,
పొగడ్తలు,
ఆరాధన,
ఆత్మీయత,
ఇలా ఎన్నో,
విమర్శ లో నిన్ను నువ్వు మార్చుకో,
పొగడ్తను చిరునవ్వుతో దూరంపెట్టు
అదొక్కసారి తలకెక్కితే నీ
అక్షరానికి నువ్వు దూరం అయినట్లే..!
ఆరాధనలో కన్నీటినీ,
ఆత్మీయతలో దగ్గరితనాన్ని చూడు..!!

లే
ఊరికే కూర్చుంటే
ఊరకుక్క కూడా నిన్ను చూసి మొరుగుద్ది
అక్షరాలతో ఘర్ఘించు
రేపటి
స్వర్ణోదయానికి నాంది పలుకు..!!

Written by: Bobby Nani

Friday, June 5, 2020

హంసయాన


తను ఎప్పుడు పుట్టిందో నాకు తెలియదు కానీ 
నన్ను చూసి .. గోముగా చిరునవ్వు చిందించిన ప్రతీక్షణం 
నేను మళ్ళి మళ్ళీ పుడుతూనే వున్నాను
ఇక తన గురించి చెప్పాలంటే 
ఆమె దంతదవళ కాంతిలో పట్టపగలే నే
నక్షత్రాలను దర్శిస్తుంటాను
ఆమె అంతరంగం ఎటు చూసినా పద్మవ్యూహమే
కానీ ఆమె అంతరంగ పాతాళ లోతులను సైతం నే చదవగలను 
తన రెండు కనుబొమ్మల మధ్యన ప్రతీ క్షణం 
నేను అస్తమించని సూర్యోదయాన్ని చూస్తుంటాను
అద్దంలో నా ముఖం నే చూడటానికి భయపడతాను కానీ 
నన్ను చూసిన ఆమె ముఖ కాంతులలో 
నా అందాన్ని నేను వెతుక్కుంటుంటాను..!!

తన మాటలు నాకు ప్రశ్నలను సంధిస్తే 
తన భావాలు మాత్రం నాకు సమాధానాలను అందిస్తాయి
తనలోని అంతర్గత విషయాలను నా 
మనసెప్పుడూ వెలికితీస్తూనే వుంటుంది
తన జీవిత రహస్యాలను ఛేదిస్తూనే ఉంటుంది..!!

తన అల్లరి 
గాలి చేసే పిల్ల చేష్టల మల్లె 
తన ఆనందం 
ఆకాశాన్ని తుడిచే తుంటరి మబ్బు పరుగు మల్లె 
తన కోపం 
మూతి ముడుచుకున్న నల్లని మేఘ మల్లె 
తన బాధ 
వర్షించే వర్షాగమ పన్నీటి గల గలల మల్లె 
తన నడకలో, నడతలో నర్మగర్భమైన ఒక
అవ్యక్తమైన సంగీతమేదో నను అలరిస్తూ వుంటుంది. 
తనతో గడిపే ప్రతీ క్షణంలో అది నేను అనుభూతిస్తూనే ఉంటాను.
ఒక్క మాటలో చెప్పాలంటే 
తానో అద్బుతం అంతే.. !!

Written by: Bobby Nani