“ఓహ్ బేబి” చిత్రాన్ని చూస్తున్నప్పుడు సమంత గారు పాటల గురించి వివరించిన ఆ తీరు నాకు చాలా నచ్చింది.. ఒక్కో పాటకు ఒక్కో సందర్భం వుంటుంది.. విత్తనం వేస్తున్నప్పుడు ఒక పాట, పంట కోసేటప్పుడు ఒక పాట.. పంట సేతికొచ్చినప్పుడు మరోపాట అంటూ ఇలా ఒక్కో భావానికి ఒక్కోరాగం వుంటుంది అని వారు అన్నారు.. అది నాకు చాలా నచ్చింది.. ఈ రోజుల్లో గొంతుతో పాడేవారే కాని గుండెతో పాడేవారు కరువయ్యారు.. మనం కనుక ఏదైనా ఓ గ్రామానికి వెళ్ళి కనుక చూస్తే తెల తెల్లవారునే పొలం గట్లుమీద కొందరు.. నాగలి చేతపట్టి మరికొందరు.. ఎడ్లబండి నడుపుతూ మరికొందరు ఇలా వారి రోజువారి ఒక్కో పనిలో ఆ సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి పాటలు పాడుతూ ఎదుటి మనిశషికి శ్రమ కనిపించకుండా వారు చేస్తున్న పనిని ఆస్వాదిస్తూ ఎంతో హృద్యముగా పాడుతారు..
ఒక్క సంగీతవాయిద్యము కూడా లేకుండా వారి గొంతే ఓ సంగీత వాయిద్యనాదమై
మన మనస్సునకింపై,
ప్రియమై
వాత్సల్యముగ మన శ్రవణములకు తాకుతుంది.. మనకు తెలియకుండానే మన పెదవులు ఆ పాటను రాకపోయినా పాడేందుకు ప్రయత్నిస్తాయి ..
నిజానికి గుండెతో పాడటం అంటే ఇదే..
ఇలా మన జీవితం నుంచి మనముందుకొచ్చిన పాటలను “యేలలు” అంటారు..
అలాంటి ఓ పాటను రాయాలనిపించింది.. !!
ఇలాంటి పాటలలో కాస్త నాటు మరి కాస్త మొరట స్వభావంకల అక్షరాలు ఉంటాయి .. కానీ అవి చాలా అందంగా ఉంటాయి.. వాటి శబ్దమాధుర్యం కూడా సౌందర్యభరితంగానూ సమ్మోహనాభరితంగాను వుంటుంది..
అది రాయడానికి మునుపు నేనో సందర్భాన్ని రాయాల్సి వుంటుంది.. కనుక ఇక యాస, ప్రాస లోకి వెళ్ళిపోదాం ..
తెల్లవారుతూనే ఆవులు అంబా అని అరుస్తున్నాయి
కోడి కొక్కొరకో.. కో అని లోకాన్ని మేలికొలుపుతూంది
గంగడు కొడవలి తీసుకొని కోతలకు బయలుదేరాడు..
గంగకేమో బద్దకంగా వుంది.. తను ఇంట్లోనే ఉండిపోయింది.. మంచి ఎండగా వుంది మరి..
పాపం గంగడు గంజినీళ్ళకు ఎక్కడనుంచి ఎక్కడికి వస్తాడు..
అందుకే ఉండబట్టలేక తలమీద బుట్టేట్టుకొని, బుట్టలో గంజిమూతలెట్టుకొని బయలుదేరింది గంగి
చేను గట్టున నిలబడి చూచింది...
ఆ ఎండలో గంగన్న బావ ఒంటిమీద చెమట మిలమిలా మెరుస్తూంటే గంగకి బాధ వేసింది..
అక్కడనుంచే బావను పిలుస్తోంది..
“కొడవలీ మొలనుంచి
కోత చాలించి
రావోయి బేబేగ రా
వోయి గంగన్న బావా...
తలమీద కొచ్చాడు
తండ్రీ సూరీడు ..!!
ఇలలోన జనులెల్ల
యిసిగీ పోనారూ
ముఖమెల్ల కప్పింది
ముత్తేల సెమటా
ఒల్లెల్ల ఒసివాడి
కందిపోనాదీ ..
బంగారు నీ మోమే
ఒసివాడి పోయే
నా బంగారు బావా..
ఒల్లెల్ల కందింది
వెర్రినా బావా.
యేటిలోన మునిగి
సెమట కడిగేసి
సరసనూ కూకోని
సల్దారగించూ ..
ఇలా మన వాస్తవ జీవితంలో జరిగే పనులను వాటి సందర్భాలను తీసుకొని మనం ఈ యేల పదాలను రాయొచ్చు..
Written by: Bobby Nani
No comments:
Post a Comment