Monday, January 8, 2024

రస తనువులు...

 


ఓ ఘాటైన వర్ణన రాసి ఎన్నిరోజులు అయిందో ... కాచుకోండి మరి.. !


స్త్రీ మూర్తులు ఈ వర్ణనకు కాస్త దూరం గా వుంటే మంచిది.. 


కొన్ని పదాలు అర్ధం కాకపోయినా  మరికొన్ని ఖచ్చితంగా అర్ధం అవుతాయి. స్త్రీ పురుషుల “రస తనువుల” సంగమం ఇది.. కాకపోతే సమయం లేక కాస్త చిల్కరింపుగా రాసాను.. అందరికీ తెలిసిన సత్యాలే ఇవన్నీ .. అయిననూ మనుగడలోలేని ఇలాంటి పదాలవల్ల ఓ కొత్తదనం చేకూరుతుంది. ఈ కావ్యాన్ని కావ్యంగానే పరిగణించవలసినదిగా మనవి. 


రస తనువులు 

**************


అంగాంగ తేజమౌ సుదతి రసమధువులొలుకు నీ

చందన కనకపు సోయగం నఖశిఖపర్యంతమున్ 

నతనాభీయ, నెలవంక కౌను ముద్దులిడుపగన్, 

గజస్తన నిగడ నును గుబ్బల బంగారు కుంభముల్ 

కరమునపట్టి అదిమిశంఖమ్ము బిగువున 

రసములిడుగ పూరింపగన్..!!

అబ్బబ్బా ఏమే సఖీ ఈ సుఖంబులొలుకు 

నీ పాల మీగడ దేహంబు సమ్మోహనంబులు

జాము, గడియలు కాదే క్షణకాలంబు సుఖింపు చాలే 

వెచ్చని నీ బాహులతికల మధ్యన..వెన్నలా కరిగేందుకు !!


సాంబ్రాణి కురుల పరిమళాలతో

గంధపు తనువు సుగంధాలతో

మత్తెక్కించే ఆ మల్లెల మెడ వంపులను 

మునివేళ్ళతో కాదే మునిపంటిన ఆఘ్రాణించాలి..!!


సముద్రాన్ని మథించి సుధనిచ్చిన 

మంధర పర్వతపు యౌవన శోభితం 

కలహంసల మేలు మువ్వల పగడవర్ణపు 

పారాణి పాదద్వయ భూషితం 

మకరందపు మేలిమి కను సోగలై విచ్చు 

తామరపూవ్వుల నేత్రద్వయం..!!


నును బుగ్గలపై మకరికల లేపనం 

పసిడి దేహమ్ములపై  పసుపునిగ్గుల పోసనం

ఎద కలుశమ్ములపై కస్తూరి తైల విలేపనం..!


సమస్త విన్యాసంబుల విశాల నడుమును ఏకబిగిన పట్టి 

చుంబన స్థానములతో నాట్యోపయోగాంగములు మీటగ

నత నాభీయముపై  రత్నాగ్ర మణికాంతులు మెరయ

నవనీత కౌను పై శీతల చందనము లమర 

నలిగిన చీరంచుల కుచ్చిళ్లు నే పుడమిన రాల్చి

రవిక చెదిరిన పాలపొంగులను లాలిత్యముగా తెరలించి 

చోష్యలేహముతో నీ ఆపాదమస్తకం  అధర మర్ధన గావించగన్..!! 


యెర్ర కలువలై విచ్చిన నీ ఆడతనంలో

నేనో తచ్చాడే దారితప్పిన కొంటె తుమ్మెదనై 

మత్తిల్లిన నీ రస తనువుల లోతులను చుంబిస్తూ

నీ అణువణువూ మేలైన మగని మగటిమికి.. 

కవ్యపు దెబ్బకు చిట్లిన వెన్నకుండలా

పులకరింతల నడుమన... నీవు పురివిప్పియాడగన్..!!


           ~ ~ త్రిశూల్ ~ ~ 


Mobile: 9032977985


Blog: http://bobbynani.blogspot.com/


Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr

No comments:

Post a Comment