ప్రకృతి తత్వాన్ని, స్త్రీ అంతరంగాన్ని ఎప్పటికప్పుడు
గమనిస్తూనే ఉండాలి. వాటికి తగ్గట్లు మనల్ని మనం అన్వయించుకుంటూ ఉండాలి. రెండిటిలో ఏది
వికటించినా అది ప్రళయమే అవుతుంది. అందుకే అంతర్ముఖుడనై
సంధిస్తున్నానిదిగో ఉత్ప్రేక్ష, రస, భావ త్రిపుట కవిత్వాలను మేళవింపుగా..!!
సుదతి
సౌమ్య సంధ్యారుణ వర్ణితం
ముదిత
సౌమ్య మాధుర్య రస శోభితం
పడతి సౌమ్య
సౌదామినీ వద కేతనం
వనిత సౌమ్య
తాంబూల సుమ చర్వణం !!
శ్వేత
మధుకము (White Peacock)
*************************
తనని మొదటిసారి చూసింది నీలవర్ణపు వస్త్రధారణలోనే ..
ఏమి లావణ్యమో..!
ఎంతటి
సౌందర్య ఉద్దీపనమో ...!!
చూడగానే ఓ దైవిక అనుభూతిని కలిగించింది.
చూస్తూన్నంత
సేపు ఎంతో ప్రశాంతత
మాట్లాడుతూన్నంత
సేపూ ఏదో తెలియని గొప్ప అనుభూతి .. !!
తన చూపుల్లోని ఆధ్యాత్మికత
తన వదనములోని
అమాయకత
తన కులుకుల్లోని
వయ్యారములు
తన ధాతువుల్లోని
ప్రకాశములు
తన పెదవంచుల్లోని చిలిపి నవ్వులు
తన పాదద్వయముల్లోని
లత్తుక శోభలు
ఏ
"కవి" వర్ణించగలడు..!!
ధనుస్సు
లోని "ధనూష" మును
సూర్యుని
లోని "రేతస్సు" ను
పున్నమి
లోని "వెన్నెల" రజనును
క్షీరము
లోని "మధురిమ" ను
పుణికిపుచ్చుకున్న
"శ్వేత మధుకము" తాను ..!!
ఎన్ని
జన్మల తపస్సు చేసుంటాడో ఆ బ్రహ్మ
తన దైవీక
ఉలినుంచి తగు మెళుకువలు నేర్చి
రసరమ్య
మగు ఈ "అంగన"ను మలచడానికి ..!!
ఎన్ని
కులుకులు నేర్పించి ఉంటాడో ఆ అంగజుడు
తన నఖశిఖ
పర్యంతము నవనీత నడుమొంపుల
మిసి మిసిల
మెరుపులకు, కులుకు సింగారాలు పొదగడానికి ..!!
ఎవరు తాను
?
నింగికి
నీలిమనా
లేక
పరువానికి
ప్రణయినినా ..!!
అదేంటో
తన రాకను
తనకన్నా ముందు
తన దేహ
పరిమళం ఇట్టే చెప్పేస్తుంది..!!
తానెప్పుడూ
విచ్చుకున్న పద్మము లా,
చిరునవ్వు
మోము తో .. వెన్నెల కాంతివోలె ఉంటుంది..!!
ముంగురులేమో
ఊగే మేఘాలవలె,
నెమలి
పింఛములవలె ఉంటాయి ..!!
ఆ కనుబొమ్మలు
చూడు గాండీవములా
ఎలా వంగి, చూపుల శరములను ఎక్కుపెట్టి
నేరుగా హృదయానికి సంధిస్తున్నాయో ..!!
ఆ నేత్రాలు
చూడు తెల్లతామర రెక్కలను
నల్ల కలువ
రేకులను కలగలుపుకొని
లేడి కన్నులను
ధిక్కరించుచునట్లున్నాయి..!!
ఆ నాశిక
చూడు సంపంగి మొగ్గవలె,
కాడికి
కట్టిన నాగలివలె
మదిని
దోచేందుకు ఎలా సిద్దముగా ఉందొ..!!
ఆ అధరములు
చూడు దోర దొండ పండ్లలా,
అమృత రసాన్ని
ఎలా స్రవిస్తున్నాయో..!!
ఆ కంఠం చూడు శంఖంలా..
సంపంగి
చెట్టు కాండంలా ఎంత అందంగా వుందో..!!
తన తనువు
లోని అణువణువూ ఓ అద్భుతమే..!
తన ఆపాదమస్తకమూ
ఓ అజరామరమే..!
స్తనములు
పూర్ణకుంభములవోలె
నడుం మడతలు
తరంగములవోలె
నాభీయము
తామర మొగ్గవోలె
పిక్కలు
బంగారు సన్నాయివోలె
పాద పద్మమ్ములు
పద్మాలవోలె
ముంజేతి
మునివేళ్ళు లేత చివుర్లవోలె
తనలోని
ప్రతీది ప్రతిభాసమాయములే..!!
ఆమె సౌందర్యాతిశయాన్ని
చూస్తే
మానవ మాత్రులే
కాదు..
దేవాదిదేవతలు
సైతం ముగ్ధులై ముడుచుకుపోతారు.. !!
శుద్ధ
సువర్ణచ్చాయ గల ఆ దేహం,
ఆ రూపురేఖా
విలాసాలు,
కిన్నెర
కాంతలను తల తన్నే విధంగా వున్నాయి.. !!
అందుకే
నిజంగానే
తానొక అద్బుత క్షేత్రం,
తనది అరుదైన
స్త్రీ తత్త్వం..!!
Written by: Bobby Aniboyina
Mobile:
9032977985
Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr
No comments:
Post a Comment