Saturday, May 9, 2020

Lockdown (లాక్ డౌన్)


యావత్ ప్రపంచానికి ఇది ఓ నూతన అధ్యాయం..
జరగలేదు
జరగబోదు
ఇక జరగదేమో!!
నా (అ)సభ్య సమాజంలో జరిగిన, జరుగుతున్న కొన్ని సందర్భానుసారాలను ఉద్దేశించి నా సరళి లో కొన్ని వాక్యాలు వ్రాయ సంకల్పించి ఈ టపా వ్రాస్తున్నాను..

మీ అభిప్రాయం ఎలాంటిదైనా సరే ముక్కుసూటిగానూ, నిర్మొహమాటంగానూ తెలియజేయమని నా చిరు మనవి..!!

దేశమే గొప్పది.. ప్రజలు కాదు..

విపక్షాలు ఒక్కరోజు ఏదో ఒక కారణంచేత బంద్ చేస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థకు కోట్లు నష్టం.. అలాంటిది 55 రోజులు దేశానికి తాళం వెయ్యడం అంటే మామూలు విషయం కాదు..అందులోనూ 137 కోట్లు పైచిలుకు జనాభా వున్న సువిశాల భారతావనిలో ఇది సాహసమనే చెప్పుకోవాలి.. ఈ లాక్ డౌన్ లో మనదేశం సరాసరి ఒక్కరోజులో సగటున 644.64 బిలియన్ల నష్టాన్ని భరిస్తోంది.. అంటే దాదాపు 35,000 కోట్లకు పైగా నష్టపోతుంది..అలా 55 రోజులకు మన కోసం మనదేశం ఎంత నష్టపోతోందో మీ ఊహకే వదిలేస్తున్నాను..

ఇదంతా ఎందుకు ?

"దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్"
అంటూ వెలుగెత్తి చాటిన మహానుభావుడు, కన్యాశుల్కం లాంటి దురాచారాన్ని అంటకట్టడానికి కంకణం కట్టుకుని నిలబడిన సంఘసంస్కర్త, ప్రజాకవి, శ్రీ శ్రీ గురజాడ అప్పారావు గారు..!!

వారి నుంచి రాలిన మాటలను నిజం చెయ్యాలనే తపనతో, సదుద్దేశంతో ప్రధాని శ్రీ నరేంద్ర మోడి గారు ఈ సాహసానికి పూనుకున్నారు.. ప్రతీ ప్రాణము ముఖ్యమే..ఒక్క ప్రాణం పోయినా ఆ కుటుంబ సభ్యుల బాధ వర్ణనాతీతం అంటూ "నష్టాన్ని భరిద్దాం కానీ ప్రాణాన్ని కాపాడుకుందాం" అనే నినాదంతో ముందుకు కదలడం నిజంగా న భూతో న భవిష్యతి..!! దేశం గర్వించదగ్గ విషయం ఇది..!

మరి మనకోసం ఇంత చేస్తున్న దేశానికి మనమేం చేస్తున్నాం ?
బాధ్యతారాహిత్యం గానూ,
నిర్లక్ష్య, నిర్లిప్త ధోరణి తోనూ,
వ్యవహరిస్తూ వైరస్ తీవ్రతను ఒకరినుంచి మరొకరికి చేరవేసే క్యారియర్ గా మారుతున్నాం…!

నిర్లక్ష్యం.. నిర్లక్ష్యం..  ఎక్కడ చూసినా ఇదే స్థితి.. పరిస్థితి.. దుస్థితి..
నీ ఒక్క నిర్లక్ష్యంతో దేశం కొన్ని సంవత్సరాలు వెనక్కి పోవడమే కాదు కొన్ని ప్రాణాలు సైతం కోల్పోవాల్సి వస్తుంది..

నీకన్నీ తెలుసు.. అవును నీకు అన్నీ తెలుసు..!

మృత్యువు నీ వీపు వెనుక నక్కి వుందన్న సంగతి తెలుసు
నీవల్ల .. నీ కుటుంబానికి, సమాజానికి, దేశానికే తీరని నష్టమని తెలుసు.. కానీ ….
నీకు సంబంధించిన ఏపనీ ఆగకూడదు..అన్నీ యథాతథంగా జరిగిపోవాలి..
ప్రాణాలు గుప్పిట పెట్టుకొని వుంటే నీకు పెళ్ళి కావాలి.. ఓ వందమందికి అది అంటించాలి..
నువ్వు చేసే సేవ గొప్పగా వుండాలి.. దాన్ని ఊరూరా చాటింపు వేసి ఊరినే వళ్ళకాడు చేయాలి..
పూలు జల్లించుకొని వందలమంది ప్రాణాలను బేరం పెట్టాలి..
కొంపలో కూకొని కోరింది తినక .. అడ్డ తిరుగుళ్ళు తిరిగి అందరికీ అంటించాలి.
నేను నాయకుణ్ణి అంతా నా ఇష్టం.. నేను మీటింగులు పెడతాను, పర్మిషన్లు ఇస్తాను.. వ్యాధిని విస్తరిస్తాను.. చేతివాటం చూపిస్తాను..
పేరుకు మూడు జోన్లు .. కానీ కసరత్తులు మాత్రం గాలికివదులు..
నేను ప్రతిపక్షాన్ని .. వే లెత్తే చూపుతాను… చూస్తూ వుంటాను.. అరవడం మాత్రమే నా హక్కు..
నేను అధికారాన్ని నాడు మయసభ నేడు అంతా నా ప్రతిభ..
ఇచ్చింది ఐదు, పైనుంచి వచ్చింది ఐదు..మొత్తం పది నా ఖాతానే.. బొమ్మ చూసి మాత్రం గుద్దండి ఓటు..! మర్చిపోవద్దు..నేనున్నాను.. నేను విన్నాను..
నేను కామన్ మాన్ ని పనికిమాలిన ఎడిటింగ్ లు చేసి బొమ్మను భోగిని గా .. మార్చి రెండు వర్గాల మధ్య చిచ్చు పెడుతూ ఏకత్వం లో భిన్నత్వాన్ని చేస్తుంటాను..
నేను లాఠీ కి భయపడను .. వ్యాధికి భయపడను నాతోపాటు నాకు తోడుగా మరో నూర్గురు కావాలి.. కాటికి..
దండం పెట్టినా మారను, నెమ్మదించి చెప్పినా వినను.. రెండు తగిలిస్తే మాత్రం అందరికీ పంపి ఆనందిస్తాను..
బ్రతికుంటే బలుసాకు ఒకరిది.. కలిసి సహజీవనం మరొకరిది..వ్యాధి వచ్చి అలా పోతుంటుంది.. మనకెందుకు మన ఎన్నికలే మనకు ముఖ్యం..
ఆకలి కేకలు వినపడినా మనకెందుకు.. ప్రజలే ఆదుకుంటుంటే.. విరాళాల ఖజానా నిండుకుంది.. లెక్కలే లేవాయే..
అంటించుకొచ్చిన బలసి నోడు బాగుండు.. పూట గడవనోడు పాణం వదుల్తుండు.. ఇదెక్కడ న్యాయం సారు..
బ్రతకడానికి అవసరమైనవి రెండు గంటలు.. తాగి తందాన తానా మాపటివేళ..నెత్తురు ఇంకిపోతుంది సారు.. ఇవి చూస్తుంటే..
ప్రజలకోసం పాలకులా.. పాలకుల కోసం ప్రజలా..
ఇంతకీ ప్రజలు గురించి చెప్పనే లేదు.. వీరు నట సార్వభౌములు.. ఏ ఎండకా గొడుగు.. ఏ పాదానికా పాదరక్ష… ఇంకెక్కడి మార్పు..
డాక్టర్ లు, పోలీసు వారు, శ్రామికులు, కార్మికులు, అధికారులు, హాస్పిటల్ యాజమాన్యం, సేవచేసే ప్రజలు..ఇలా ఎందరో వ్యాధి ప్రబలకుండా పోరాడుతుంటే నువ్వు మాత్రం తలుపు వేసుకొని వుండలేకున్నావ్ ..
సొల్లు కబుర్లు కావాలి నీకు అవి చెప్పడానికి రోడ్డు ఎక్కాలి వినడానికి నలుగురు ఎదవలు పనికట్టుకోవాలి.. వీళ్ళందరినీ అదుపు చెయ్యడానికి మరో అధికారి ముఖ్య విధులు వదిలి రావాలి.. మారవా నువ్వు.. నిన్నే అడుగుతోంది..
నీకోసం కాదు నీ ఇంట్లో తలపండిన వృద్ధుల కోసం
నీ కడుపున బుట్టిన బిడ్డలకోసం .. నువ్వు ఇంట్లోనే వుండ్రా అయ్యా.. లాక్ డౌన్ కష్టమే కానీ ప్రాణం కన్నా కాదు..!!

అర్థం చేసుకుంటారని ఆశిస్తూ.. ____/\____

STAY HOME
STAY SAFE

Written by: Bobbynani

No comments:

Post a Comment