Monday, January 24, 2022

“లోగిలి” అంతర్జాల మాసపత్రిక


 “లోగిలి” అంతర్జాల మాసపత్రిక తమ సాధనసంపత్తులతో కృషీభూతులై తమ విశిష్ట కృషి ద్వారా ఉత్తమశ్రేణి సాహిత్య అభిలాషకులుగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ సంపాదకులు – శ్రీ నారాయణస్వామి చిన్న దాసరి గారు, గౌరవ సలహాదారులు – శ్రీ గౌరిశంకర్ భమిడిపాటి గారు, సంపాదకులు – “విశిష్ట సేవారత్న” “కవి మిత్ర” మహారధి ఫణీంద్ర గారు, సహా సంపాదకులు – శ్రీ అగ్ని శిఖ షణ్ముఖ గారు, కోశాధికారి & డిజైనర్ – శ్రీ అనిల్ కుమార్ గారు, ప్రధాన సలహాదారులు – శ్రీ సాంబమూర్తి లండ గారు, క్రియాశీలక కార్యదర్శి – శ్రీ రజితేంద్ర రెడ్డి గారు, సలహాదారులు – శ్రీ హేమంత్ కొరటమద్ది గారు.


సాహిత్యపరమైన వీరి వ్యాసాలు “లోగిలి” అంతర్జాల మాసపత్రిక ద్వారా అందరికీ సుపరిచితమే అయినప్పటికీ సాహిత్యసేవలో తమవంతు బాధ్యతను నిర్వహించుచూ ముందుకు సాగుతున్న సహృదయుల చేయూతను సర్వదా ఆశిస్తూ వారి గురించి ఓ నాలుగు మాటలు చెప్పాలనిపించింది.

బంగారం విలువ దాని వన్నెను బట్టి మాత్రమే కాని దాని రూప వైఖరులను బట్టి కాదు. అలానే ఒక పుస్తకం లేదా పత్రిక విలువ దాని విశ్వజనీనతను బట్టి తప్ప కేవల తత్కాలస్థితాలైన సాహిత్య ప్రమాణాలను బట్టి మాత్రం నిర్ణయించబడదు. ఇది నేను బలంగా నమ్ముతాను..అలాంటి పరిమితులతోనే రూపం దాల్చిన పత్రిక “లోగిలి” అంతర్జాల మాసపత్రిక.

పది విభాగాలుగా ఈ పత్రికలో పొందుపరిచారు. కవులు, రచయితలు, చిత్రకారులు, దర్శకులు, విమర్శకులు ఇలా ఎందరో కొలువుతీరిన ఓ మహాసమూహార గ్రంధం ఈ పత్రిక. కొత్తవాళ్ళకు అవకాశాలను కల్పిస్తూ, వారి గురించి నలుదిశలా చాటి చెప్పే ఓ గొప్ప ప్రయత్నమే ఈ పత్రిక ముఖ్య ఉద్దేశం.. అంతే కాదు ఎందరికో ఆదర్శప్రాయంగాను, మరెందరికో ఓ వేధికగాను అస్తమించని రవికిరణము వలె, విశ్రమించని కడలి కెరటము వలె వీరి ప్రస్తానం ముందుకు సాగడం నభూతో న భవిష్యతి.

ఒకసారి చాగంటిగారు అన్నారు .. బీజాక్షరము కలిగిన గ్రంధములను చదివితే మనలోకి అపారమైన శక్తి ప్రవహిస్తుందని.. కాని ఈ పత్రికలో ఎక్కడా బీజాక్షరాలు లేవు. అయిననూ అలాంటి అనుభూతికే లోనౌతాము అని నిస్సందేహంగా చెప్పగలను.. పుస్తక పఠనం చాలా గొప్పది.. అక్షర రసాన్ని అమృత రసంగా మనకు అందించేది అదిమాత్రమే.

పుస్తకాలను, పత్రికలను ఆదరించండి. ఎందుకంటె అవే మన భూత, భవిష్య, వర్తమానాలు. అవే కనుక లేకుంటే ఇంత జ్ఞానమూ, విజ్ఞానమూ రెండూ లేవు.

“లోగిలి” అంతర్జాల మాసపత్రిక వారు ఇంకా మరింత ముందుకు వెళ్ళాలని, ప్రతీ గుండెకు చేరువ కావాలని, ఎందరికో గొప్ప వేదిక కావాలని మనస్పూర్తిగా అభిలాషిస్తున్నాను..

లోగిలి పత్రిక సహా సంపాదకులు – శ్రీ అగ్ని శిఖ షణ్ముఖ తమ్మునికి నా ప్రత్యేక అభినందనలు

స్వస్తి.. __/\__

Written by: Bobby Aniboyina
Mobile : 9032977985

No comments:

Post a Comment