Monday, August 2, 2021

నేను రాసిన పాట “నన్ను విడువా మాకే సిన్ని”...


 

నేను రాసిన పాట “నన్ను విడువా మాకే సిన్ని” లక్షమందికి పైగా చేరువై మరింత వేగంగా ముందుకు వెళ్తోంది.. చాలా చాలా ఆనందంగా వుంది.. ఇంత తక్కువ సమయంలో లక్ష మందికి చేరువవ్వడం it's not an easy… నిజంగా మీ ఆదరాభిమానాలకు శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.. __/\__

ముందుగా ఈ పాటకు ప్రాణం పోసి రూపం కలిగించిన నా ఆత్మీయ సోదరులు “గుండేటి సాయి కృష్ణ, వారి సతీమణి శ్రీమతి సంధ్యా” గార్లకు నమస్సుమాంజలి...

తదుపరి వ్యక్తి ఫోక్ సింగర్ భైరగోని చంద్రం గారు తన గొంతుకతో మాయ చేసారు అలానే ముఖ కవళికలతో ఆశ్చర్య పరిచే విధంగా పాటలో ఇమిడారు..

తరువాత ఈ పాటకు జీవాన్ని ప్రసాధించిన సంగీత రూపకర్త జి ఎల్ నాందేవ్ గారు..

అలాగే ఎడిటింగ్ చేసిన రమేష్ సిద్దం గారికి, డైరెక్షన్ కోరియోగ్రఫీ చేసిన రాజేష్ మలయాళ గారికి తన అందంతో సమ్మోహన పరిచిన జినీత గారికి ఇందులో పని చేసిన ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.

ఈ వేదిక ద్వారా మరెన్నో అవకాశాలు మీనుంచి రావాలని కోరుకుంటూ.. రాబోయే ప్రతీ అవకాశాన్ని సద్వినియోగపరుస్తూ, చేసే పనికి రాసే అక్షరానికి నూటికి నూరుపాళ్ళు ప్రాణం పెట్టి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని మాట ఇస్తున్నాను.. మీ ఇంటి బిడ్డగా నన్ను ఇంతలా ఆశీర్వదించినందుకు మరొక్కసారి మీకు ధన్యవాదములు..

Song Link: https://www.youtube.com/watch?v=i3BtJz0V-0w

1 comment:

  1. Congratulations To ���� నన్ను విడవమాకే సిన్ని.. పాట కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.. ఇలాగే మీ ఆదరాభిమానాలు MallishwariCreations and
    MallishwariCreations A2Z Channel పైన subscribe రూపంలో మద్దతు ఇవ్వగలరు అని కోరుతున్నాను���������� మల్లీశ్వరి క్రియేషన్స్ పతాకంపై aniboyina bobby గారి పాటలు మారుమ్రోగాలని కోరుతున్నాను �� ధన్యవాదములు ఆనందభాష్పాలు తో

    ReplyDelete