Friday, October 30, 2020

నాటకం..



జీవం లేని
పీనుగు ముఖాలవంటి
ఈ అవర్ణపు లోకంలో నీ
మనుగడ ఓ ప్రస్నార్ధకమే..!!
అంతటా నాటకమే మరి
నీకు తెలియకుండా
నువ్వాడే నీ బ్రతుకే ఓ నాటకం
రంగులు పులుముకుని రోజుకో వేషం
నవ్విస్తావ్,
ఏడిపిస్తావ్,
నమ్మిస్తూ మోసంచేస్తావ్
పడక దిగినది మొదలు
పడక చేరేదాకా బ్రతుకు పాత్రలో
అలరిస్తావ్, మురిపిస్తావ్, మైమరిపిస్తావ్
పగలూ, రేయీ నడుమన
పడుతూ, లేస్తూ సాగే ఓ
అద్బుత కథలోని మహా నటులం..!!
కష్టాలు, కన్నీళ్ళు,
ప్రేమలు, స్నేహ బంధాల
చిక్కుముడులతో రాసిన
అద్భుత కథలోని నటీ నటులం
ఎవరి బ్రతుకూ వ్యర్ధం కాదోయ్..!
ప్రతీ పాత్రదీ ఓ సముచిత స్థానం..!!
ఇన్ని చేసేవాడివి
బాధతో, నిస్సహాయంగా
ఎందుకు ఉన్నచోటే ఉన్నావ్ ?
కదిలే కాలమూ,
ఎగసే కెరటమూ,
ఉదయించే కిరణమూ,
ఎప్పుడైనా విశ్రాంతి
తీసుకోవడం చూసావా ?
లే..
కదులు..
గర్జించే సంద్రం వలె
ఉరిమే ఆకాశం వలె..!!
ముసలితనం నీకే
నీ అక్షరానికి కాదు..
చావు
ఏ క్షణాన ఎదురుపడినా
ఒక మారు సంతోషంగా
కృతజ్ఞతలు తెలుపుకునే అవకాశమివ్వు..!!
అదే జీవితం..!!

Written by: Bobby Nani

Friday, October 23, 2020

అనుభవైక్యము


 అన్నీ పోయిన

“అనిబోయిన” వంశస్థుడను
నా జీవితమెప్పుడూ
కనుకొలనులో అశ్రువల్లె కదలని
లంగరేసిన నది ఒడ్డు నావ లాంటిది..!
చీకటి మింగిన వినీలాకాశం నుంచి
చిట్టచివరి నక్షత్రం నేల రాలడం
నే చూస్తున్నాను..!
నిశీధము కమ్మిన చిమ్మ చీకట్లో
నేనో ఒంటరినై కాళ్ళాడిస్తూ
శిఖరపు అంచున కూర్చున్నాను...!!
జేబుని తడిమి చూసాను
మూలన బిక్కమొఖమేసుకొని
ఒంటరిగా ఉందో ఏకాకి అక్షరం
అద్దంలో నన్ను నేను చూసినట్లనిపించింది
తననీ కోల్పోతా..ననేమో..!
నన్ను చూసి వణుకుతోంది..!!
చేతుల్లోకి తీసుకున్నాను
రెండుగా విరిచేసాను
పదమై నిలిచింది
మళ్ళి విరిచాను
వాక్యమై కూర్చుంది..!
వాక్యం పంక్తి యై,
పంక్తి పుట యై,
పుట కవిత యై,
కవిత కావ్యమై,
కావ్యము కనకమై
వేవేల వర్ణాలను
ఏక ఉదుటన చిమ్మింది.. !!
మరణించిన ఆశల పై నుంచి
అక్షరం మొలకెత్తింది
ఒక శుభ సూర్యకిరణమేదో
ఆశీర్వచనంలా నా పెదవిపై పుష్పించింది
కమ్మని తైలములు,
లేత చివుళ్ళు,
మిలమిలల సూర్యరశ్మి,
గాలికి ఊగులాడే నదీ ముంగురులు,
ఆకాశమంతా నక్షత్రాల వానతో
జీవితమంతా ఓ రంగులమయమయ్యింది..!!
నా
జీవితం
ఓ అక్షరంగా మళ్ళి
పునర్జీవించింది..!!

Written by: Bobby Nani

Tuesday, October 13, 2020

అంగన



అధరాలా అవి
మధుర సుధారస ఫలములా..!!

మధువులొలికే ఓ అంగన
నీ దోర అధరాలపై
మధురసంతక చుంబన లేపనములద్దనా..!!
ముద్దుల మర్దన గావించనా ..!!

ఏమా నాట్య భంగిమలు
శృంగార నారీకేళ కనకపు సొగసుల నివహముతోడ
విరాజిల్లు ఆ మేను శృంగారంగంబులు..!

ఏమా నవనీత సొబగులు
చైత్రరథమును మించు దేహ రమణీయోద్యానమ్ముల
ఘంటా నినాదమ్ముల పట పటాత్కార క్రేంకారంబులు..!

తమక చమక తమకముల ఉష్ణనిట్టూర్పులతో
నీ పీతాంబర సొగసులను మర్దించువాడెవ్వండే..!!
ఏడు ధాతువులను ఏక బిగిన నొక్కి
మేలిమి బిగి పూర్ణకలశ కుచాగ్రములను
శంఖంలా పట్టి పూరించు వాడెవ్వండే..!!

చరణ కంకణులు జల్లుజల్లు మన
కరణ కింకుణులు గొల్లు గొల్లు మన
చిరు పాదంబుల అందియలు గల్లుగల్లు మన
చోష్య లేహముతోన నఖశిఖమున పట్టించి,
మకరికలతోను తనువంత దట్టించి,
నతనాభీయమును జిహ్వతో అర్చించి,

ఆ పాలిండ్ల బింకములపై కందర్పుని పరాగ మమరగ
హస్త విన్యాసంబుల అర్ధచంద్ర నడుమును ఏకబిగిన పట్టి
చుంబన ప్రాకారములతో నాట్యోపయోగాంగములు మీటుచూ,
సర్పములై పెనవేయు నీ మేను కౌగిళ్ళలో మత్తిల్లు వేళ
బొండుమల్లియలు సిగ్గుతో కొమ్మచాటు వికసించు వేళ
గండు తుమ్మెద కన్నె పువ్వారులను చుంబించు వేళ
భగ భగ మను భగమున మేహనమును జోప్పించు వేళ
తక దిమి దిమి తకమౌ మని నీ యౌవ్వన కర్మాగారాన్ని
మేళగించు వాడు ధన్యుండే.. సఖి..!!

Written by: Bobby Nani

Saturday, October 10, 2020


 

అదో చైత్రమాసపు తొలిజాము

ప్రపంచమంతా నిద్రించు సమయము

నిదురే రాక నేను..

పహారా కాస్తున్న ఆరుబయట

పూల మొక్కలను .. అప్పుడే విచ్చుకుంటున్న

లే లేత కన్నె పువ్వారులను ముద్దాడుతున్న

తుమ్మెదలను చూస్తూ..  మాటలు కలిపాను..!!

 

 

ఇంతలో..

తళుక్కుమని ఆకాశంలో ఓ మెరుపు

నింగిలోని ఓ తార ... నా ఒడిలోకొచ్చి వాలే క్షణమది

తనివితీరా కళ్ళుతో తనని చూడాలని కళ్ళు తెరిచాను

మనసారా తనని  తాకాలని చేతులు చాచాను

తానో శ్వేత మధుకమై పసిడికాతులిడు మేనుతో

నా ఒడి శయనముపై తలవాల్చి నిదురించు వేళ

నన్ను నేను మైమరిచి రెప్ప వేయక గోముగా చూచే వేళ

తామర నేత్రాలతో .. తానో అనంత సౌందర్య రాశిలా

నా ముందుకొచ్చి నిల్చుంది..!!

 

ఆమె

రెండు విశాల నేత్రాల మధ్యన

తొలి సూర్య బింబం ఉదయిస్తోంది..!!

ఆమె

నిశిర కేశ సౌందర్యములో

నక్షత్రాలు కిరణాన్ని ప్రసవిస్తున్నాయి..!!

ఆమె

అధరాలపై పూచే మందహాసములో

వెన్నెల .. మల్లెమొగ్గలై గుప్పుమని గుబాళిస్తున్నాయి..!!

 

ఎదురుగా వున్నా

పుడమికి ఒకవైపున నేను,

మరోవైపున ఆమె ..

దిక్చక్రము ... కొస అంచుల నిలబడి

ఆమెను నే చూస్తున్నా, ఆరాధిస్తున్న..ఆనందిస్తున్నా..!!

 

గోధూళి వేళా,

ఎరుపెక్కిన పారాణి అరచేతిని ముద్దాడే వేళా,

హోరెత్తే సంద్రం ఆకాశాన్ని ఆర్తిగా తడిమే వేళా,

పారే నదిలో దోనె దీపాలు మౌనగీతాన్ని ఆలపించే వేళా,

నౌక తీరాన్ని విడువలేక విడువలేక విడిచే వేళా

నింగిని తాకే అంతిమ నక్షత్రం లా గప్చిప్గా మాయమైనావు..!!

ఏమని చెప్పను,

ఎక్కడని వెతకను

భూమీ, ఆకాశం కలిసే చోట,

పారిజాతాలు రాలి పడిన చోట,

నా నవ్వును నే పారేసుకున్న చోట,

అలసి సొలసిన సూర్య నేత్రాలతో... నే వెతుకుతాను,

ప్రాణ వాయువులూది పిల్లనగ్రోవిని పలికిస్తాను..!!

వస్తావు కదూ..!!