ఓ సెమ్మ,నీ కెంత వయ్యారమే,చిన్ని గన్నేరు పువ్వు చీరగట్టిచిలుక రెక్కల రవిక బిగియ దొడిగికుదురు పాపట తీసి కురులు దువ్వినుదుట కస్తూరి కాయ చిదురుపెట్టిపడతి చెమటగారిన యదిపన్నీరు గంధమేనే..!!అబ్బబ్బ ఎన్నెన్ని కులుకులేసంపెంగ రేకులే చెలియ చెక్కిళ్ళుదానిమ్మ గింజలే రమణి పలువరుసలువెండి వెలుగులే సరసాక్షి నునుబుగ్గలునాజూకు నడుమున నడయాడునారీమణి బంగరు మొలతాడుఅబ్బబ్బ ఎన్నెన్ని సౌందర్య సొబగులే..!!కాళ్ళకు లత్తుక నంటికన్నులకు కాటుక నంటిచెక్కిళ్ళకు మకరికను పూసికబరీభరముకు మరుమల్లెలు దూర్చివేకువన పూచిన తంగెళ్ళ వలె భూషించునీ సముద్వీక్షణములు క్షణమైననూ చాలునే..!!ఒకవైపున వీరమునుమరువైపున శృంగారమునుఏక కాలమున చూపగల సమర్ధురాలివి శుభాంగివి..!!Written by: Bobby Nani
No comments:
Post a Comment