“జీవితం”
నువ్వు అనుకున్నట్లు అది ఒక వాక్యం కాదు
దాని రహస్యం నీకెప్పటికీ బోధపడదు..!!
కొందరు మాత్రం తీరంవెంబడి పల్లీలు తింటూ,
తీరిగ్గా ఆడాళ్ళ పై అక్షరాల్ని పారబోసుకుంటూ ఉంటారు..
చుట్టూ వున్న వారి కన్నీళ్ళు వాళ్ళకు అక్కర్లేదు..!!
భయపెట్టి గాండ్రించే సంద్రమే
ఒక్కోసారి నీ కన్నీళ్ళు చూసి
నిను దగ్గరకు పిలుస్తుంది..
దాన్ని నువ్వు ఎన్నటికీ గుర్తించలేవు ..!!
నీ పాదాలకింద మెత్తగా నలిగే
పుడమి నిను హత్తుకోవాలనిచూస్తుంది
దాన్ని నువ్వు ఎప్పటికీ చూడలేవు..!!
నీ తలపై
నిత్యం వికసించే అపూర్వ పుష్పం ఆకాశం ..
తలెత్తి చూసినా ఆ సౌందర్యాన్ని
ఎన్నటికీ వీక్షించలేవు..!!
నీ చూట్టూ ఎందరు వున్నా
నీలోని జీవితం తాను వొంటరినేనని తెలుసుకుందో ఏమో
భోరున కురిసే చిమ్మ చీకట్లలో నీకోసం పెడబొబ్బలు పెడుతూనే ఉంటుంది..
అనంత దుఖంలా నిలవబడ్డ ఆ జీవితం
నీలో ఆశలు తెగిన పక్షిలా,
కడుపులోనే... రగిలే చిచ్చును దిగమింగుతూ,
అప్పుడప్పుడు పరామర్శకొచ్చే
నీ జీవితంలోని సంతోషాలను, ఆనందాలను
తన విషాద గీతాలతో భయపెడుతూనే ఉంటుంది..
నిను ఉలిక్కి పడేలా చేస్తూనే ఉంటుంది..!!
Written by: Bobby Nani
మేలైన మాటలు
ReplyDeletenewsgita.com
కనీనికలు
ReplyDelete.......
కవుల కనీనికలు
కవనాలనుకనగానే విచ్చుకుంటాయ్
భావాలను సులువుగా జుర్రుకుంటాయ్
దప్పికో ఆకలో లేదు వాటికి
అయినా....
అవగాహనలదివ్వెలను
ఆలోచనలసహాయాగ్నితో
వెలిగించి...
నిరాశలనిసి బాటలోంచి
నీరసమానసరుగ్మతలవిసాలబారినుంచి
నిన్నురక్షిస్తాయి
అన్నలా నాన్నలా అమ్మలా సాయమందిస్తాయి
గాదిరాజు మధుసూదన రాజు
ద్యావుడా. ఈ రేంజిలో తవికలతో దాడి చేస్తున్నారు.
ReplyDelete"నీరసమానసరుగ్మతలవిసాలబారినుంచి" కాపాడేవారేవరు.
ప్రస్తుతానికి తీరం వెంబడి పల్లీలు తింటూ నడుస్తాను.
:-)
Deleteబుచికీ ది గ్రేట్
ReplyDelete