ప్రత్యూషవేళలు అనేకం వికసిస్తూ ఉంటాయి..
మదిలో మెదిలే అనేకానేక ప్రవాహ సంద్రంలో.... (కరుణ, శాంత, రౌద్ర, వీరాద్భుత, హాస్య, శృంగార, భయానక, బీభత్సములు, నవరసములు, రతి, శోక, నిర్వేద, క్రోధోత్సాహా, విస్మయ, భయ, జుగుప్సలు, నవ, స్థాయి, భవములు) ఇలా కొన్నిటిని ఏర్చి, కూర్చి సమాజహితానికి ఓ అక్షర ఖడ్గంగా మార్చే సంకల్పమే నా ఈ అక్షరారణ్యం ....
Wednesday, February 7, 2024
అభినవ సత్య…!
ప్రత్యూషవేళలు అనేకం వికసిస్తూ ఉంటాయి..
Wednesday, January 17, 2024
ఆమె..!!
ఓ స్త్రీ స్థానంలో వుండి ఈ కావ్యాన్ని రాసాను.. ఎంతవరకు రాయగలిగానో నాకు తెలియదు మీరే చెప్పాలి మరి.
Tuesday, January 9, 2024
Monday, January 8, 2024
రస తనువులు...
ఓ ఘాటైన వర్ణన రాసి ఎన్నిరోజులు అయిందో ... కాచుకోండి మరి.. !
స్త్రీ మూర్తులు ఈ వర్ణనకు కాస్త దూరం గా వుంటే మంచిది..
కొన్ని పదాలు అర్ధం కాకపోయినా మరికొన్ని ఖచ్చితంగా అర్ధం అవుతాయి. స్త్రీ పురుషుల “రస తనువుల” సంగమం ఇది.. కాకపోతే సమయం లేక కాస్త చిల్కరింపుగా రాసాను.. అందరికీ తెలిసిన సత్యాలే ఇవన్నీ .. అయిననూ మనుగడలోలేని ఇలాంటి పదాలవల్ల ఓ కొత్తదనం చేకూరుతుంది. ఈ కావ్యాన్ని కావ్యంగానే పరిగణించవలసినదిగా మనవి.
రస తనువులు
**************
అంగాంగ తేజమౌ సుదతి రసమధువులొలుకు నీ
చందన కనకపు సోయగం నఖశిఖపర్యంతమున్
నతనాభీయ, నెలవంక కౌను ముద్దులిడుపగన్,
గజస్తన నిగడ నును గుబ్బల బంగారు కుంభముల్
కరమునపట్టి అదిమిశంఖమ్ము బిగువున
రసములిడుగ పూరింపగన్..!!
అబ్బబ్బా ఏమే సఖీ ఈ సుఖంబులొలుకు
నీ పాల మీగడ దేహంబు సమ్మోహనంబులు
జాము, గడియలు కాదే క్షణకాలంబు సుఖింపు చాలే
వెచ్చని నీ బాహులతికల మధ్యన..వెన్నలా కరిగేందుకు !!
సాంబ్రాణి కురుల పరిమళాలతో
గంధపు తనువు సుగంధాలతో
మత్తెక్కించే ఆ మల్లెల మెడ వంపులను
మునివేళ్ళతో కాదే మునిపంటిన ఆఘ్రాణించాలి..!!
సముద్రాన్ని మథించి సుధనిచ్చిన
మంధర పర్వతపు యౌవన శోభితం
కలహంసల మేలు మువ్వల పగడవర్ణపు
పారాణి పాదద్వయ భూషితం
మకరందపు మేలిమి కను సోగలై విచ్చు
తామరపూవ్వుల నేత్రద్వయం..!!
నును బుగ్గలపై మకరికల లేపనం
పసిడి దేహమ్ములపై పసుపునిగ్గుల పోసనం
ఎద కలుశమ్ములపై కస్తూరి తైల విలేపనం..!
సమస్త విన్యాసంబుల విశాల నడుమును ఏకబిగిన పట్టి
చుంబన స్థానములతో నాట్యోపయోగాంగములు మీటగ
నత నాభీయముపై రత్నాగ్ర మణికాంతులు మెరయ
నవనీత కౌను పై శీతల చందనము లమర
నలిగిన చీరంచుల కుచ్చిళ్లు నే పుడమిన రాల్చి
రవిక చెదిరిన పాలపొంగులను లాలిత్యముగా తెరలించి
చోష్యలేహముతో నీ ఆపాదమస్తకం అధర మర్ధన గావించగన్..!!
యెర్ర కలువలై విచ్చిన నీ ఆడతనంలో
నేనో తచ్చాడే దారితప్పిన కొంటె తుమ్మెదనై
మత్తిల్లిన నీ రస తనువుల లోతులను చుంబిస్తూ
నీ అణువణువూ మేలైన మగని మగటిమికి..
కవ్యపు దెబ్బకు చిట్లిన వెన్నకుండలా
పులకరింతల నడుమన... నీవు పురివిప్పియాడగన్..!!
~ ~ త్రిశూల్ ~ ~
Mobile: 9032977985
Blog: http://bobbynani.blogspot.com/
Insta: https://www.instagram.com/aniboyinabobby?utm_source=qr