వింత జంతువు..
************
వాడి మొఖం
కపాళాలు వెలవెలబోయేలా
దొంగ ఆప్యాయతల్ని పొంగరిస్తున్న
ఓ తపేళా మొఖం..
వాడి దేహం
రాజకీయ సిఫిలస్ కురుపులు
రొచ్చు గుంటలుగా మారిన
ఓ రహదారి ..
వాడి మనస్సు
తీరని ఆర్ధిక దాహంతో
సదా తహతహలాడే
ఓ సహారా ఎడారి..
వాడి ఆలోచన
కుళ్ళి, పురుగులతో లుకలుకలాడే
ఓ పదవీ రాక్షస వేశ్య శవం..
వాడి తెలివి
స్వార్ధం అనే ఆరని రావణ కాష్టంలా
వావి వరసలు మరిచిన చిత్తకార్తే ..
వాడి కడుపు
మధ్యతరగతి మానవ అస్థిపంజరాలతో
నిరుపేదల స్త్రీల, నీళ్ళ రక్తంతో
నిరక్షరాస్యుని ఆశల మాంసంలో
కలిసి ఉడుకుతున్న
ఓ గుడుంబా కడవ..
ఇంతకీ ఎవడు వాడు.. ??
వర్గాలకి .. వర్ణాలను గుర్తులుగా చేసి
కండువాగా మార్చి,
జెండాగా ఎగురవేసి,
తన కాళ్ళనూ, తన చేతులనే
తన పదవీ సింహాసనానికి
పాదాలుగా, పాదుకలుగా చేసుకొని
పదిలంగా కూర్చుని
అయిదు సంవత్సరములకొకసారి
పాచిపళ్ళు తోమి..
ఓటుకోసం యాచకం చేసే
నీచ రాజకీయ నేత..
Written by : Bobby Nani


No comments:
Post a Comment