యవ్వనం అనేది చాలా అద్బుతమైనది.. దాన్ని కొందరు యువత చే చేతులా నాశనం చేసుకుంటున్నారు.. ఈ మధ్య నాకు తెలిసిన కొందరు పెద్దవారు ఒక సంస్థను నడుపుతున్నారు... వాళ్ళు కొన్ని సేవా కార్యక్రమాలు చేపడుతూ వుంటారు.... వాళ్ళు ఒక జైలు కి వెళ్లి అక్కడవున్న ఖైదీలకు ఏదైనా ఇవ్వాలని అక్కడకు వెళ్ళారు... అక్కడ వాళ్ళు చూసిన సంఘటనకు వాళ్ళు కూడా నిర్ఘాంతపోయి మాట మూగదైపోయిందంట..... ఇంతకీ విషయం ఏంటంటే అక్కడ వున్న ఖైదీలు అందరూ 25 వయస్సు లోపల వయస్సు వున్నవారేనంట ... ఇది మన యువత అందరం తలదించుకొని బాదపడాల్సిన విషయం...
మన యువత ఎటు పయనిస్తునారు ??
ఏవేవో తప్పులు చేసి అందరూ అక్కడ వాళ్ళ బంగారు భవిష్యత్తు ని నాశనం చేసుకున్నారు... నిజంగా ఇది చాలా బాదాకరం..
నేటి యువతకి లైఫ్ అంటే సెలబ్రేషన్.... క్లబ్ లు, పబ్ లు, సినిమాలు, షికార్లు, టీవి, ఇంటర్నెట్, సెల్ఫోన్ లతో కాలక్షేపం..... మారుమూల పల్లెలకి కూడా ఈ వాతావరణం వచ్చేసింది..... తినడానికి తిండి లేక పోయినా ఇంట్లో టీవి, చేతిలో సెల్ఫోను ఉండడం సర్వ సాధారణం అయిపొయింది..... ప్రజల్లోకి, వారి జీవనంలోకి అంతగా చొచ్చుకుపొయిన ఈ సాధనాలు ఎలా ఉపయోగపడుతున్నాయో చూద్దాం......
కొన్ని మీడియా సంస్థలు సమాజ క్షేమాన్ని విస్మరిస్తున్నాయి. బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ యువతను పెడద్రోవ పట్టించే అశ్లీల కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ చూపిస్తూ ప్రేరేపిస్తున్నాయి..... మంచి, చెడుల విచక్షణ మరచి యువతను లక్ష్యంగా చేసుకొని సొమ్ము చేసుకుంటున్నాయి..... యువతను ఆదర్శంగా మలచాల్సిన మీడియా అందుకు భిన్నంగా వారు పెడద్రోవ పట్టేందుకు వీలుగా క్రైమ్ స్టోరీలు మళ్ళీ మళ్ళీ వేస్తూ ఆవిధంగా ప్రేరేపిస్తున్నారు.....
తప్పు ఎవరిది ??
యువత దా ?
తల్లిదండ్రులదా ?
సమాజందా ?
కాలానిదా ?
పరిస్తితులదా? ?
ఇవన్నీ ఒకఎత్తు అయితే.. మరికొన్ని కూడా వున్నాయి..
తనగురించి తాను పట్టించుకోక పోవడం..
తనమీద తనకు నమ్మకం లేమపోవడం..
ఆత్మవిశ్వాసం లోపించడం..
చేసే పనిపై ద్రుష్టి లేకపోవడం..
మనస్సు నిలుప లేక పోవడం..
బానిస మనస్తత్వంతో ఉండడం..
అనుభవాల ద్వారా జ్ఞానం సంపాదించడం కాకుండా బట్టి పట్టడం..
గొర్రెల మందలో ఒకడిగా ఉండిపోవడం..
ఇతరులతో పోల్చుకోవడం..
అనుకున్నది సాధించలేక పోయాను, జీవితం వృధా అయిందని బాధపడడం..
నిరాశా నిస్పృహలకు తరచు లోనవడం, జీవితాన్ని చాలించాలనుకోవడం..
ఓటమిని స్వీకరించ లేకపోవడం..
చిన్న చిన్నకస్టాలకు, వైఫల్యాలకు కుంగి పోవడం..
చిన్న వైఫల్యాన్ని పెద్దగా ఉహించుకుని వర్తమానాన్ని పాడుచేసుకోవడం..
ఎవరు ఏమనుకుంటారోనని భయపడడం..
సమస్యలను సవాలుగా తీసుకొని ఎదిగేవారి ముందు ఎవరెస్టు శిఖరం కుడా చిన్నబోతుందని తెలియక పోవడం..
ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూస్తూ, దేబిరిస్తూ కూర్చోవడం కాదు..
నిప్పులు లేకుండా పొగలు చిమ్మే కర్రల్లాగా కాకుండా అగ్నికణాల్నివిరజిమ్మే దివ్వెలుగా,
రణరంగంలో క్రమశిక్షణతో పనిచేసే సైనికుల్లా ప్రచండశక్తితో యువత ముందుకు సాగాలి..
నెత్తురు మండే, శక్తులు నిండే యువత తమ ఆకాంక్షలు నేరవేర్చుకోవడమే కాదు దేశానికి కళ్ళు, కాళ్ళూ అయి నడిపించాల్సిన, దేశ భవిష్యత్తు ఉన్నతంగా లిఖించాల్సిన బాధ్యత యువతరం పైనే ఉంది.....
ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక పోవడం.. రాజకీయ పార్టీలపై విశ్వాసం లేకపోవడం, రాజకీయ వ్యవస్థకి దూరంగా ఉండడం, మాకు సంబంధించిన విషయం కాదని భావించడం.. ఓటింగ్ లో పాల్గొనక పోవడం, ఎన్నికలకు దూరంగా ఉండడం చేస్తోంది.. నేటి యువత.. ఒప్పుకుంటాను నేటి రాజకీయం అలానే ఉంది ... కాని ప్రతీ రంగంలోనూ యువత ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో యువత గురించి ఈ కాలగమనం రాస్తున్నాను..
కాలగమనం ....
***********
కాలము అమూల్యము జారవిడుచుకోకురా ..
నిర్లక్ష్యము చేసితివా తిరిగి నీకు దక్కదురా ..!
పెదవిని దాటిన మాట పృధ్విని దాటేనురా ..
విల్లును విడిచిన బాణం తిరోముఖం కాదురా..
గడచిన కాలాన్ని మళ్ళి కళ్ళ చూడలేవురా ..
అవకాశం చేజారితే అందుట దుస్సాధ్యమురా ..
ప్రతిక్షణమూ కోట్లకొలది ధనముకన్న విలువరా ..
అనుక్షణమూ అది తెలిసి మసలుకోరా సోదరా.. !
కాలగమన చక్రానికి అడ్డనేది లేదురా..
పరుగెత్తే సమయానికి పగ్గమేయలేవురా ..
ఆకాశానికి నిచ్చెన దుర్లభమని తెలియరా ..
సమయపు వినియోగము సర్వదా రక్షరా..
ఏ వేళకు ఏది నీవు చెయ్యాలో ఎరుగరా ..!
ఏమారితే దేవుడైనా ఆదుకోడు నిన్నురా..!!
ప్రతీ వ్యక్తికి వుండాలి చక్కని ధ్యేయము ..
నిత్యకృషితో చేరాలి ఎంచుకున్న గమ్యము ..
అలసత్వం ముమ్మాటికి నయంకాని దౌర్భల్యం ..
ప్రక్క చూపు వక్రబుద్ధి ప్రగతికి నడ్డు కుడ్యము
ఓడిన ప్రతివారికి గతమనేది సత్యము
గెలిచిన ప్రతీ వ్యక్తికి భవిష్యత్తు తథ్యము ..!!
మారరా సోదరా.. మార్చరా భవిత రాతను..
Bobby Nani