ఇక్కడ కనిపిస్తున్న చిత్రం ఓ సోదరి అందించారు.. ఈ చిత్రాన్ని చూడగానే నాకు మొదట కలిగిన అనుభూతి ఓ ప్రకృతి కాంత అందమైన మానవ కాంత రూపంలో మారి తెల్లని మేఘాలను చీరకట్టుగా మలిచి, రంగు రంగుల పుష్పాలను రవికగా మర్చి, సప్తవర్ణాలను అలంకారములుగా చేసుకొని, బంగారు వర్ణపు మువ్వలను సింగారించుకొని, లేలేత పారాణి సొగసులతో, సౌభాగ్యవతియై .... తన ప్రియుడైన ఆకాశ రాజు కోసం పరితపించిపోతున్నట్లు గా నేను భావించాను.. ఆ యొక్క సందర్భాన్ని పురస్కరించుకొని వారి మధ్యన వున్న ప్రణయ బంధాన్ని ఇక్కడ వివరించాను..
ప్రకృతి కాంత
*********
నింగి వలచింది నేలను..
తొంగి చూచింది ఈ ప్రకృతి కాంత సొగసును ..
వంగి నిలిచింది
సందిట కౌగిలించింది..
కనుసైగ చేసింది..
అనువైన కోనలో
కోరిక తీర ముద్దులిచ్చింది..
నింగి నేలను వలచి
మంచుపొగలతో పంపింది ప్రేమలేఖ..
నేలకు దిగివచ్చి
వలచి తలచి
పిలిచి కౌగిట జేర్చి
కొండ శిఖర అధరాల
కొరికి నొక్కి
పచ్చికబయళ్ళ
పమిట కొంగుపై
రంగు రంగు పువ్వుల
పుప్పొడి గందాల సువాసనలు చిలికి
వనమూలికల పరిమళాల పన్నీరుచల్లి
పిల్ల గాలులు చల్లగా వీచి
ఈ ప్రకృతి కాంత సఖియలైన గిరులు తరులు
తన్మయమునొంద
అబల ప్రకృతి కాంత కన్నియును
ఆకాశ రాజు ఆలింగనముచేసి
పరిణయమాడె ఈ ప్రకృతి కాంతను
ప్రకృతి పులకరించి హర్షింపగన్ ..
Bobby Nani
No comments:
Post a Comment