నేను ఈ రాజకీయాలకు చాలా దూరం.. అవంటేనే నాకు అసహ్యం.. ఇప్పటివరకు ఏ ఒక్కరిని నేను సమర్ధించనూ లేదు, అలా అని విమర్శించనూ లేదు.. కాని నేటి రాజకీయం ఎందుకో నాకు వసంతకాలపు చిగురింత లా అగుపించింది.. అలా అని సమర్ధించట్లేదు జరిగిన, జరుగుతున్న పరిస్థితుల దృష్ట్యా నేను ఇలా రాయాల్సివచ్చింది.. ఇబ్బంది వుంది కాదనట్లేదు 10 మంది బాగుకోసం 5 మంది నలిగినా మరేం పర్వాలేదు.. పూర్తిగా ఈ నిర్ణయం పై మార్పు రాకపోయినా మొదటి అడుగు పడినదానికి ఆనందంగా వుంది.. పుట్టినప్పటి నుంచి వింటున్న మాట మన భారతదేశం అభివృద్ధి చెందుతోంది అని .. ఎప్పుడండి అభివృద్ధి చెందేది.. ఇలా ఒక మార్పును కూడా మనం స్వీకరించకుండా, స్వాగతించకుండా పాలకులను, పాలనను తప్పు పట్టే మనం... ఇలాంటి మాటలు మాట్లాడితే చాలా హాస్యంగా వుంది.. అంటే మనకు ఇబ్బంది కలగకూడదు దేశం అభివృద్ధి అయిపోవాలి.. వహ్ స్వార్ధపూరిత మన మనోభావాల మధ్యన ఏ నాయకుడు వచ్చినా ఇంతే .. తప్పు వాళ్ళది కానేకాదు.. అన్నిటికీ వెంపర్లాడే అతి నీచమైన మనస్తత్వం కలిగిన మనది..
నోటుకు వేటు..
**********
నోటిమాటకు విలువతగ్గి ...
పచ్చనోటుకు రెక్కలొచ్చే..
తళ తళమను పచ్చనోటు ..నేడు
పనికిరాని పిచ్చినోటయ్యే..
భద్రపరుచుకున్న నోట్లు బజారుపాలాయే..
ధగ ధగల నోట్లుతో దగాకోరుల పాట్లు..
దెప్పిపొడిచే వారుకొందరు..
దేవులాడే వారుకొందరు ..
దిక్కులు ప్రక్కటిల్లేలా అరిచేవారు మరికొందరు..
అసమానుడు అనేవారు కొందరు..
అసాధారణం అనేవారు కొందరు..
చరిత్రకారుడనే వారు ఇంకొందరు ...
ఇంత జరిగినా నోటిమాటకు విలువలేదు..
సాటిమనిషికి ప్రయోజన లేదు ..
ఈ రణరంగ రాజకీయపు ముళ్ళ పొదల మాటున.. ఓ
మసి పీలిక వలె పేదవాడు చిక్కుకొని
రెపరెపలాడు గాలివాటుకు చిరుగుతూ తన
రక్తాశ్రువులు చిందిస్తూ ...
మసిబారిన బ్రతుకులతో..
విరిగిన ఆశలతో ...
నలిగిన హృదయముతో..
రేపటి మార్పుకై ..
ఓ మొనగాడి రాకకై ..
వేచివున్న పసిడి కళలు నేడు సాకారమయ్యే...
పట్టమెక్కిన వాడు పనివంతుడాయే ..
ప్రజల పాలకుడాయే ..
ప్రగల్భాలుడు కాదు ప్రతిభావంతుడయ్యే..
ముండమోపి సమాజాన్ని ప్రక్షాళన గావించగ
వికసించిందొక కమలం.. తన తెగింపునే
శంఖంగా మ్రోగించాడు..అమరేంద్రుడైన నరేంద్రుడు ...
Bobby Nani
No comments:
Post a Comment