ప్రేమికుడు చాలా గొప్పవాడు.. ఎందుకంటె తను ప్రేమలో ఉన్నప్పుడు ఎవరిని చూచినా తన ప్రియురాలే గుర్తుకు వస్తుంది తనకు.... ప్రతీ రూపంలో తన ప్రేయసి రూపాన్నే ప్రతిబింబించుకుంటాడు... నెమలి నర్తించినా, తుమ్మెద సవ్వడి చేసినా, కుసుమం వికసించినా, జాజులు పరిమళించినా, మేఘాలు ఘర్జించినా, నింగి వర్షించినా, ప్రకృతి పులకరించినా, ఆ ప్రేమికుడు పరవశంతో ఓ తియ్యనైన మధుర ఆనందాన్ని తన పెదవులతో స్పృశించినట్లు తను భావిస్తాడు.. అందుకే ప్రేమలో ఉన్నప్పుడు అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి.. అందలమెక్కాల్సిన వాడు అధఃపాతాళానికి పోగలడు .. కావున ప్రేమను ఆస్వాదించండి, కాని ఆ ప్రేమే మీ జీవితానికి ఓ విషాదం కాకూడదు అని కోరుకుంటూ ఓ ప్రేమికుడు తన ప్రేయసిని యెంత అమితంగా ప్రేమిస్తున్నాడో మీరే చుడండి ఈ కవితలో ...
హృదయం రాసుకున్న లేఖ
*******************
తనో ఉదయించిన రవి కిరణం ..
తనో ఉద్భవించిన నవ కుసుమం..
తనో అభినవ అందార విందం..
తనో తుంటరి తలోదరి తన్మయత్వం .. తనే
నా మదిని పరిత్యజించిన మీననేత్రి.. !!!
తన నర్తనలో నవవసంతమే...
తన హసితములో నిత్య నూతనమే ...
తన లలితములో యెవ్వన లావణ్యమే.. !!!
తన నేత్రములు చమర్చితే ఆకాశమే వర్షించును...
తనను తాకిన వాయువు సుగంధ పరిమళములు..
తనని అంటిన అందం ప్రకాశవంతం.. !!
తనని చూడని నేత్రములు అంధకారములు..
తనని తలవని హృది నిర్జీవములు..
తనని తాకని అధరములు వ్యర్ధములు... !!
చకోరి వంటి తన చెంగు చెంగుమనే
అతి మెత్తని, సుతి మెత్తని
ప్రత్తి దూది పింజెల వంటి పాదాల స్పర్శకు
పుడమి తల్లి మధుర గిలిగింతలు పొందును...
పల్లవిలేని తన వలపు పాటలు..
నియమంలేని తన పద్య పాదాలు...
అలంకారాలే లేని తన అయోమయ భావాలు...
నన్ను ఊపిరాడనివ్వకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి...
సమాధానం లేని వేల ప్రశ్నలకు సమాధానం చెప్పడానికి,
సందేహాల తన కౌగిలి బోనులో భందీఖానాలా నిలిచున్నా... ఇలా..
Bobby Nani
No comments:
Post a Comment