ఘాడమైన ప్రేమ కలిగిన ఉభయ ప్రేమికులను ఉద్దేశించి ముఖ్యంగా ఇది రాసాను.. స్త్రీ, పురుషుల సాంగత్య జీవన విధానం ప్రకృతితో మిళితమై ఉంటుందని చెప్పడానికే ఇక్కడ ప్రకృతిని కూడా వాడుకోవడం జరిగింది.. రెండు హృదయాల పవిత్ర ప్రేమ “ఓం కార” శబ్ధమంత పవిత్రతను కలిగి ఉంటుందని నేను నమ్ముతాను.. అతి స్వల్ప మంది మాత్రమే ఇలాంటి ప్రేమను పొందుతున్నారు.. అలాంటి వారి పవిత్ర ప్రేమను గౌరవిస్తూ వారి గౌరవార్ధం కోసం ఈ శశిరేఖను రాసాను.. నా ఈ శశిరేఖ మీకు నచ్చుతుందని ఆశిస్తూ ..
శశిరేఖ
*******
రావేలవే ... ఓ మధురసఖీ ఒకపరి ఇల రావేలవే..!!
ఒకసారిటువచ్చి బిగుతైన కౌగిలినందించి నీ..
ప్రేమను నా యెదపై శాసనముగా లిఖించవే ...
పూ .. పొదరిల్ల మాటున సొగసైన నీ
తీపి పెదవికై పిల్లగాలితో చెలగాట మాడుతుంటిని ..
రేఖవై, శశిరేఖవై.. రేయిలో నెలవంకవై నా ముందు
మెదిలే చిరు మందార దరహాసానివై, చంద్రవదనవై ...
ప్రాతఃకాలసమయమున పురివిప్పిన మయూరము లా
వయ్యారాల అలకనంద జలపాయిలా .. నడయాడు నీ
పారాణినంటిన పాదపద్మములపై జీరాడు ఆ కుచ్చిల్లు సొగసులుతో..
ఆమని కోయిలలు వేయిమార్లు ఒక్కసారి కూయంగ నీ
సిరిగజ్జే మ్రోయంగా... అందాల హరివిల్లు అంబరమునందు విరియంగ..
సిరిమల్లె నవ్వంగ , పరువములు సెలగంగ ..
మకరధ్వజుఁడు నీ పరువపు మకరందమును సేవింపంగ ..
పులకరింతలు గలుగ పురివిప్పి యాడినవి నీ
మధుర యవ్వన కన్నె ప్రాయములు ..
Bobby Nani
No comments:
Post a Comment