Saturday, May 5, 2018

వాలు జడ ..


ఈ కవితకు సున్నిత మనస్కులు కాస్త దూరం గా ఉంటే మంచిది.. 
ముఖ్యంగా ఆడవారు.. __/\__ 
నవ రసాలలో ముఖ్యమైనది.. ప్రధమ మైనది “శృంగార” రసం .. దాన్ని సాహిత్య పరంగానే వ్రాశాను.. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు.. 


వాలు జడ 
ఆఁ ... వాలుగంటి 
వెన్నునంటి ప్రాకి 
కటీర తిన్నులను లాలిత్యముగ ముట్టి 
అర్ధ చంద్ర కౌను పై, 
అరవిందమై విచ్చుకుంది 
జఘన లయలకు కులికెడి 
ఆమె కనకాంబరపు సొగసులను 
జుర్రుకును వాడేనురా ధన్యుడు.. 
అభినందనుడు..!! 

వసి వసి సిగ్గులను ఒడుపుగా తట్టి 
నారింజ చెక్కిలిని నేర్పుఁగ మీటి 
నును గుబ్బలను అదిమిన పట్టి 
పసిడి దేహంబును రసికతన చుట్టి 
నీలి ధాతువును కొనవేలిన నొక్కుతూ 
నడుం మెలికలను మునివేళ్ళున మీటుతూ 
నిట్టూర్పుల నిగుడ సొగసులను 
అధర మధ్యముల నలుపుతూ.. 
మన్మథలేపనమును నాభికమున వ్రాస్తూ 
ప్రకటించితి రదిగో అనుషంగ యుద్దమును..! 

మదనాలయము తెరవగ .. 
అధరములు అరవగా .. 
పరిధాయములు బెదరగ .. 
స్కందస్సులు అదరగ .. 
నిట్టూర్పుల మూల్గుల తోడ 
ఎదురోత్తుల సౌఖ్యముల గూడ 
నవనాడుల వొణుకు తపనలతో 
శగల శరముల ఊపిర్లావిరులతో 
మన్మథాలయ రసాస్వాదనలతో 
ఆపాదమస్తక పన్నీరు స్వేదములతో 
పెనుగులాటల సుఖములలో 
నర్తించినా.. 
క్రీడించినా.. 
రమించినా .. రమ్యంబునే..సఖీ.. !!

Written by: Bobby Nani

No comments:

Post a Comment