Monday, April 2, 2018

హరి – హరిణ



కవితలెప్పుడూ మగ భావాలనుంచేనా.. కాస్త ఆడవారి భావనల నుంచి రాస్తే ఎలా ఉంటుంది.. 
ఆ ఆలోచనతోనే మొదలైంది ఈ చిరు కవిత.. 

హరి – హరిణ 
**********

విశాలమైన నీ వక్షస్థలం మీద 
విహరించే నా చూపులు 
నా కంటి పాపల తెరలమీద 
నాకలోకాలు సృష్టిస్తున్నాయి 
నీ ఉద్దండ బాహా దండాలమీద 
ఊగిపోతున్న నా ఊహలు 
నీ విస్తుల మస్తకం మీద 
వాస్తవాలై మెరుస్తున్నాయి.. 

నాథా .. నాథా ... !! అంటూ 
నా నాలుక నాట్యం చేస్తున్నది 
నీ వజ్ర దంత వేదిక మీద 
పారవస్యపు పరదాల వెనుక 

నీ చైతన్య శక్తి బిందువులు 
నా నిశ్చిలతా సింధు శుక్తిలో రాలి 
మన బాధా ముక్తి ముక్తాఫలాలై 
మధురానుభూతి కలిగిస్తున్నవి 

నా నరహరివి నీవు.. 
నీ మనోహరిని నేను.. 
నీవు “హరి” నేను “హరిణ” 
ఆటో వేటో తెలియని 
అనుబంధం మనది.. !!

Written by : Bobby Nani

1 comment:

  1. బయ్యా ఒక పద్యం రాసాను.
    నా నిబిడీకృత ఫాలకడలిలో ఓక జలదరార్భటి విస్ఫులించింది. అది భువన జఘనమయి దంష్ట్రాకరాలమయి నా అస్థిత్వాన్ని అక్రూరించింది. ఎలా ఉంది బయ్యా.

    ReplyDelete